Live Breaking News & Updates on మ

Stay informed with the latest breaking news from మ on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in మ and stay connected to the pulse of your community

మీ కంప్యూటర్‌ నవ్వుతుంది!


మీ కంప్యూటర్‌ నవ్వుతుంది!
ఇదేంటి అనుకుంటున్నారా?  కంప్యూటర్లు, రోబోలకు సైతం నవ్వడం నేర్పిస్తున్నారు ఐఐటీ పరిశోధకురాలు డాక్టర్‌
మామిడి రాధిక.
ఇదేదో వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ!
నవ్వు.. మనుషులకు మాత్రమే పరిమితమైన భావోద్వేగం. దేవుడిచ్చిన వరం. అంతటి గొప్ప వరాన్ని కంప్యూటర్లు, మరమనుషులకు సైతం నేర్పిస్తే.. మనుషులకు మరింత దగ్గరవుతాయి అంటున్నారు రెండున్నర దశాబ్దాలుగా భాషలు, హాస్యంపై పరిశోధనలు చేస్తున్న ట్రిపుల్‌ ఐటీ ఆచార్యురాలు డాక్టర్‌ రాధిక మామిడి. ‘రాజమహేంద్ర వరంలో బీఎస్సీ పూర్తి చేశాక.. భాషాశాస్త్రంపై ఆసక్తితో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అప్లయ్డ్‌ లింగ్విస్టిక్స్‌లో ఎంఏ చేశాను. అక్కడే ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేశాను. ఆసమయంలో సాహిత్య అనువాదాలపై థీసిస్‌ రాయాల్సి ఉంటుంది. అందరూ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచనల అనువాదం ఎంచుకుంటే నేను మాత్రం ఒకింత సవాల్‌గా ఉండాలని ఇంగ్లిష్‌ జోక్స్‌ను తెలుగులోకి అనువాదం చేసే పని పెట్టుకున్నా. జోక్స్‌ అనువాదం తేలికైన వ్యవహారంలా అనిపించినా చాలా కష్టమైన పని అది. భాషాశాస్త్ర పరిశోధకురాలిగా గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకంలోని హాస్య సన్నివేశాలను సైతం అప్పుడే విశ్లేషించాను’ అంటారు రాధిక.
పాతికేళ్లుగా పరిశోధనలు...
పాతికేళ్ల క్రితం సీడాక్‌ ముంబయిలో తన కెరీర్‌ని మొదలుపెట్టారు రాధిక. అప్పట్లో... మనుషులు కాకుండా యంత్రాలు భాషని అనువాదం చేయడంపై పనిచేశారామె. ఇంగ్లిష్‌ నుంచి హిందీలోకి యంత్రాల సాయంతో వార్తల్ని అనువదించేవారు. అది మొదలు ఇప్పటివరకూ భాష, సాంకేతికతలపైనే పనిచేస్తున్నారామె. ‘సౌదీ అరేబియాలోని ప్రిన్స్‌సుల్తాన్‌ యూనివర్సిటీలో ఆరేళ్లపాటూ కంప్యూటేషనల్‌ లింగ్విస్టిక్స్‌ ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌గా పనిచేశాను. 300 పేజీల పుస్తకాన్ని ఒక పేజీలో రాయమంటే మీరు ఆ పుస్తకాన్ని మొత్తం చదివి కానీ రాయలేరు. కానీ మెషీన్‌ అలా కాదు... ఈ పనిని చాలా తేలికగా చేసిపెడుతుంది. దీనికి సంబంధించిన పాఠాలని విద్యార్థులకు బోధించేదాన్ని. ఆ తర్వాత 2010లో పోలాండ్‌లో లాఫాల్‌ పేరుతో అంతర్జాతీయ హాస్య సదస్సు జరిగింది. ఆ సదస్సులోనే భాష- హాస్యం పై పనిచేస్తున్న అనేక మంది ప్రొఫెసర్లను నేను కలిసాను.. నేను ఎంఫిల్‌లో చేసిన అంశం కూడా అదే కావడంతో యంత్రాలు కూడా హాస్యానికి స్పందించేలా చేయాలని అప్పుడే అనుకున్నాను.  మనదేశానికి వచ్చి ట్రిపుల్‌ ఐటీలోని భాష సాంకేతికత పరిశోధన కేంద్రం(ఎల్‌టీఆర్‌సీ)లో చేరాక ఇక్కడ డైలాగ్‌ సిస్టమ్స్‌- మెషీన్‌ ట్రాన్స్‌లేషన్‌ అంశంపై పాఠాలు చెప్పేదాన్ని. అంటే ఒక భాషని ఇంకో భాషలోకి యంత్రం సాయంతో అనువదించేటప్పుడు వచ్చే సమస్యలు అధిగమించడం ఎలానో చెప్పేదాన్ని. ఆ పనిచేస్తూనే మరోపక్క కృత్రిమమేధ, మిషన్‌ లెర్నింగ్‌ వంటి అంశాలని జోడించి కంప్యూటర్లకు హాస్యం పరిచయం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. ముందుగా జోక్స్‌ని కంప్యూటర్‌ గుర్తిస్తుందా... లేదా? అనే దానిపై పరిశోధన చేశాను. ఇందులో రెండు అంశాలు కీలకం. కంప్యూటర్లు జోక్స్‌ని గుర్తించి, స్పందించడం ఒకటైతే.. దానికి ప్రతిస్పందనగా తిరిగి జోక్స్‌ని వేయడం రెండోది. ఈ రెండింటిపైనా నేను పరిశోధనలు చేశా. ఏడాదిపాటు మా బృందంతో కలిసి పరిశోధనలు చేశాక... నా ప్రయత్నం ఫలించింది. కంప్యూటర్‌ జోక్స్‌కి స్పందించి.. జోక్స్‌ని తిరిగి జనరేట్‌ చేయడం మొదలుపెట్టింది. పెద్దపెద్ద సంస్థలు ఆంగ్లంలో ఉండే హాస్యానికి కంప్యూటర్‌ ఎలా స్పందిస్తుందనే దానిపై పరిశోధనలు చేస్తున్నాయి. కానీ మన భారతీయ భాషల్లో ఈ ప్రయత్నం చాలా తక్కువగా జరుగుతుందనే చెప్పాలి. తెలుగుకు సంబంధించిన వరకూ మేం చేస్తున్నాం. కన్యాశుల్కం పుస్తకంలోని హాస్యాన్ని అధ్యయనం చేసి ఈ సమాచారాన్ని ముందుగానే కంప్యూటర్‌లో డేటా రూపంలో నిక్షిప్తం చేశాం. ఆ పుస్తకంలో నవ్వు తెప్పించే వాక్యాలు వచ్చినప్పుడు కృత్రిమ మేధ ఆధారంగా కంప్యూటర్‌ నవ్వడం, స్పందించడం, తిరిగి జోక్‌ చేయడం చేస్తోంది. ఈ పరిశోధనలను ఉపయోగించి భవిష్యత్తులో దీన్ని ఓ ఉత్పత్తిగా తీసుకురావాలన్నది నా కల’ అంటున్నారు రాధిక.
- మల్లేపల్లి రమేష్‌రెడ్డి,
హైదరాబాద్‌

, క-ప-య-టర , నవ-వ-త-ద , Eenadu , Vasundhara , Article , 1001 , 121055438 , Computer , Laugh , Research

మేము సైతం సాధించగలం ఒంటికాలితో దేశం చుట్టేసి...!


మేము సైతం సాధించగలం ఒంటికాలితో దేశం చుట్టేసి...!
అన్నీ బాగుండి, ఆరోగ్యంగా ఉన్నా... నాలుగడుగులు వేయడానికే మనం ఆలోచిస్తాం. కానీ తాన్యాదాగా అందుకు భిన్నం... ఒంటికాలితోనే 3800 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతూ దేశాన్ని చుట్టేసింది.అదీ తన కోసం కాదు...క్రీడల్లో రాణించాలనుకుంటోన్న దివ్యాంగులకు చేయూతనందించేందుకు...ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఆమె స్ఫూర్తికథ మనమూ చదవాల్సిందే.
‘మార్చలేని గతాన్ని గురించి ఆలోచించే కంటే...చేతిలో ఉన్న భవిష్యత్తు గురించి శ్రమిస్తే విజయం మనదే అని నమ్మా. ఆ నమ్మకమే చావు అంచుల వరకూ వెళ్లిన నన్ను పారాసైక్లిస్ట్‌గా మార్చింది’ అంటోంది పాతికేళ్ల తాన్యా దాగా. ఆమెది మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌ జిల్లాలో ఉన్న బ్యావరా పట్టణం. 2018లో తాన్యా ఎంబీఏ చదివేందుకు ఊరిని వదిలి దేహ్రాదూన్‌ వెళ్లింది. చక్కగా చదువుకుంటోంది. ఉన్నత ఉద్యోగం కోసం ప్రణాళికలు వేసుకుంటూ సంతోషంగా సాగిపోతోంది. కానీ జీవితమంటే ఊహించనివి జరగడమే కదా! ఆ ఏడాదే ఓ కారు ప్రమాదంలో తాన్యాకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం తనని ఇండోర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. రెండు శస్త్రచికిత్సలు చేసి ఒక కాలుని తొలగించారు. అయినా సరే ఆమె బతకడం కష్టమని చేతులెత్తేశారు డాక్టర్లు. కానీ తాన్యా తల్లిదండ్రులు...ఆశను వదులుకోలేదు. కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనుకున్నారు. మెరుగైన చికిత్స కోసం దిల్లీకి తరలించారు. సుమారు ఆరునెలల పాటు చికిత్సలు జరిగాయి. క్రమంగా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది...
వారి కథలు విని...
తాన్యా ప్రమాదం తాలూకు గాయాల నుంచి బయటపడింది. కానీ కాలు లేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోవడం మాత్రం కష్టమైంది. అందరూ చూపించే సానుభూతితో భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంది. దాంతో ఆమెకు ధైర్యం నూరిపోయడానికి తాన్యా సన్నిహితులొకరు ‘ఆదిత్యమెహతా ఫౌండేషన్‌’ గురించి చెప్పారు. వికలాంగ క్రీడాకారులకు చేయూతనిచ్చే సంస్థ ఇది.  అక్కడే తనలాంటివారెందరో నిలదొక్కుకున్న కథల్ని విని స్ఫూర్తి పొందింది. తానూ పారాస్పోర్ట్స్‌లో దేన్నైనా ఎంచుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. అయితే ఆమె అమ్మానాన్నలు  ఒంటికాలు పిల్ల ఇవన్నీ చేయగలదా అని భయపడ్డారు. కానీ తాన్యా మాత్రం నిబ్బరంగా ముందడుగు వేసింది. శిక్షణ తీసుకునేందుకు వారికి నచ్చజెప్పింది.
బాధల్ని దిగమింగుకుంటూ...
శిక్షణ, సాధన చెప్పినంత సులువేం కాదు...పంటికింద నొప్పిని భరిస్తూ ప్రాక్టీస్‌ చేసింది. మొదట్లో సైకిల్‌ ఎక్కడానికి కూడా కష్టపడేది. కానీ అక్కడి కౌన్సెలర్లు క్రమంగా తాన్యాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. దాంతో చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటూ ముందడుగు వేసింది.  మొదట 100 కిలోమీటర్ల సైక్లింగ్‌ పూర్తి చేసింది. తర్వాత వేలకిలోమీటర్లు సైకిల్‌ తొక్కే సామర్థ్యాన్ని పెంచుకుంది. ‘నాకు చిన్నప్పటి నుంచీ ఆటలంటే ఇష్టం. కానీ ఎప్పుడూ దాని గురించి ప్రణాళిక వేసుకోలేదు. ఇప్పుడు ఇదే నా ఫుల్‌టైమ్‌ కెరీర్‌గా మారింది’ అని చెబుతోంది తాన్యా.  ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ ఏటా పారా క్రీడాకారుల కోసం నిధులు సేకరిస్తుంది. అందుకోసం ఏర్పాటు చేసిన ‘ఇన్ఫినిటీ రైడ్‌-2020’కి ఈసారి తాన్యాను ఎంపిక చేసింది. మొత్తం 30 మంది పారా సైక్లిస్టులు ఈ బృందంలో తాన్యా ఒక్కరే అమ్మాయి.
తండ్రి చనిపోయినా...
ఈ ప్రయాణం కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ... నలభై మూడు రోజుల పాటు సాగింది. ‘వేల మైళ్లదూరం ఒంటికాలితో సైకిల్‌ తొక్కడం వల్ల కాలి కండరాలు మెలి పెట్టేసేవి. భుజాలు, పాదాలు భరించలేనంత నొప్పిగా ఉండేవి అయినా సరే! ఏ రోజుకారోజు రెట్టించిన ఉత్సాహంతో వెళ్లేదాన్ని. అయినా నన్ను విధి పరీక్షించాలనుకుందేమో! ఓ రోజు నాన్న చనిపోయారనే ఫోన్‌కాల్‌ విని గుండెలవిసేలా ఏడ్చా. వెంటనే ఊరు వెళ్లిపోయా. అంత్యక్రియలు పూర్తయ్యాక తిరిగి ఎక్కడ ప్రయాణాన్ని ఆపానో అక్కడే తిరిగి మొదలుపెట్టా. నాన్న నా కాళ్లమీద నేను నిలబడాలని కోరుకున్నారు. ఆయన కోసమైనా నేను గెలవాలి’ అని చెబుతోందామె. తాన్యాకి రాజ్‌గఢ్‌ పోలీసు శాఖ, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కలిసి ‘యూత్‌ ఐకాన్‌ ఆఫ్‌ రాజ్‌గఢ్‌-2021’, ‘బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌’ అవార్డులతో సత్కరించాయి.
Tags :

, స-త , స-ధ-చగల , ఒ-ట-క-ల-త , ద-శ , చ-ట-స , Eenadu , Vasundhara , Article , General , 1001

మా మంచి బ్యాక్టీరియా... ఎక్కడున్నావ్‌?


మా మంచి బ్యాక్టీరియా... ఎక్కడున్నావ్‌?
పిండిని రొట్టెగా మార్చేది ఒకటైతే... పాలను పెరుగుగా మార్చేది ఇంకొకటి... కంటికి కనిపించని సూక్ష్మజీవులు మనిషికి చేసే సహాయం అనంతం... అలాంటి మంచి బ్యాక్టీరియా జాడ కనిపెట్టడమే ఆమె పని. ఒకటి కాదు, రెండుకాదు ఏకంగా 200 రకాల కొత్త బ్యాక్టీరియాలను గుర్తించారు హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్‌ సీహెచ్‌.శశికళ. ఈ పరిశోధనలే ఆమెను ప్రతిష్ఠాత్మకమైన ‘జానకీ అమ్మాళ్‌ నేషనల్‌ అవార్డు’కు ఎంపిక చేశాయి.
టొమాటో కెచప్‌ తెలుసుగా... ఎర్రగా, చూడగానే నోరూరిస్తుంటుంది. అదంత ఆకర్షణీయంగా ఉండడానికి తయారీదారులు రసాయన రంగులు ఉపయోగిస్తారు. రోడో స్పైరిల్లం సల్ఫ్యూరెక్సిజెంట్స్‌ అనే సూక్ష్మజీవులను శశికళ తన పరిశోధనలలో గుర్తించారు. ఇవి లైకోపిన్‌ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేయడాన్నీ గమనించారు. ఈ పదార్థం ప్రస్తుతం టొమాటో కెచప్‌లు, ఆహార ఉత్పత్తుల్లో సహజసిద్ధమైన వర్ణంగా ఉపయోగపడుతోంది. ఈ విధానంలో పలు సంస్థలు లైకోపిన్‌ను తయారుచేయడానికి ముందుకు రావడంతో శశికళ దానిపై పేటెంట్‌ హక్కును తీసుకున్నారు. ఇవే కాదు ఆక్వాకల్చర్‌లో మందులుగా ఉపయోగపడే సూక్ష్మజీవులను కూడా ఆమె గుర్తించారు. ఎన్నో ప్రఖ్యాత సంస్థలు ప్రస్తుతం దేశంలోని పలు చోట్ల చేపలు, రొయ్యల పెంపకంలో వాటిని ఉపయోగిస్తున్నారు. చేపల చెరువుల్లో  వేసిన ఆహారంలో మిగిలింది కుళ్లిపోయి, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌, అమోనియా వంటి రసాయనాలుగా మారతాయి. ఇవి మత్య్స సంపదపై తీవ్రప్రభావం చూపిస్తాయి. ఈ పరిస్థితుల్లో సూక్ష్మజీవులు ఆ రసాయనాలను తినేసి నీటిలో కాలుష్యాన్ని తగ్గిస్తాయి. కోళ్లఫారంలో చేరే వ్యర్థాలకు   ఈ బ్యాక్టీరియాలను కలిపితే దుర్వాసన దూరమవుతుంది. అలాగే  గట్టిపడే క్రూడ్‌ ఆయిల్‌, పెట్రోలు, డీజిల్‌ను ఇవి పలుచగా చేస్తాయి. ఇక భవననిర్మాణాల్లో ఉపయోగించే కాంక్రీట్‌లో ‘బాసిల్లస్‌’ వంటి బ్యాక్టీరియాను కలిపితే క్యాల్షియం కార్బోనేట్‌ అనే క్రిస్టల్స్‌ను ఉత్పత్తి చేసి మధ్యలో ఏర్పడే రంధ్రాలను పూడ్చి, ఆ నిర్మాణానికి ధ్రుఢత్వాన్ని తెస్తుంది. ‘ఇలా రోజువారీ జీవితంలో మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులను కనిపెడుతున్నందుకు వచ్చే ప్రశంసలకన్నా అందరికీ ఉపయోగపడేదే చేస్తున్నా అనే సంతృప్తి ఎక్కువ ఉంటుంది’ అని అంటారీమె.
అదో తపస్సు... సూక్ష్మజీవుల వర్గీకరణ సాధారణ విషయమేం కాదు. ఇవి కంటికి కనిపించవు. నిరంతరం వీటిపై నిఘా నేత్రం ఉండాల్సిందే. ఏ సందర్భంలో ఎలాంటి ఉత్పరివర్తనాలు వస్తున్నాయి. ఎప్పుడు ఎలా మార్పు చెందుతోందనేది అర్థం చేసుకోవడం చాలా సంక్లిష్టమైన విషయం. అనూహ్యంగా జరిగే అనేక మార్పులను గమనిస్తూ, నోట్‌ చేసుకుంటూ, గుర్తిస్తూ... ఇలా ఆమె జీవితం రోజూ ఓ తపస్సులా ఉంటుంది. ఈమె పరిశోధనశాల మొత్తం భద్రపరిచిన సూక్ష్మజీవులే ఉంటాయి. రెండు దశాబ్దాలుగా వేలకొలదీ సూక్ష్మజీవులను విడదీసి పరిశీలించి కొత్తవాటిని గుర్తించి నామకరణం చేస్తున్నారీమె. వీటిని పలు ప్రయోజనాలకు వినియోగించేలా చేసి వాటిపై పేటెంట్‌ హక్కునూ పొందారు. బ్యాక్టీరియాలను గుర్తించే పనిలో సహజసిద్ధంగా నీరు, మట్టి, నాచు వంటివాటినే  శశికళ ఎంచుకుంటారు. గుర్తించిన వాటి ఎదుగుదలకు అవసరమయ్యే ప్రత్యేక పరిస్థితులను కల్పించి వాటిని వృద్ధి చేస్తారు. దీనికి రోజులు, నెలలు కూడా పట్టొచ్చు. రెండు దశాబ్దాలుగా ఈమె చేపడుతున్న ఈ పరిశోధనలలో ఇప్పటి వరకు 200 రకాల కొత్త బ్యాక్టీరియాలను గుర్తించారు. ఆమె ప్రస్తుతం జేఎన్‌టీయూలో సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌, బ్యాక్టీరియల్‌ డిస్కవరీ ల్యాబొరేటరీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. విశ్వవిద్యాలయం ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌కు ఛైర్‌పర్సన్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Tags :

, మ-చ , బ-య-క-ట-ర , ఎక-కడ-న-వ , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121006776 , Bacteria