vimarsana.com


Covid: 10 మంది కుటుంబీకులను కోల్పోయా..
అమెరికా సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి
వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ బారి నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి సంకోచం లేకుండా టీకా తీసుకోవాలని అమెరికా సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి స్పష్టం చేశారు. కొవిడ్‌ బారిన పడి.. అమెరికా, భారత్‌లలో ఉంటున్న తన కుటుంబసభ్యులు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తెలిపారు. అమెరికన్లు టీకా తీసుకుని తమను తాము కాపాడుకోవాలని చెబుతూ ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. అగ్రశ్రేణి భారతీయ-అమెరికన్‌ ఫిజీషియన్‌ అయిన డాక్టర్‌ మూర్తి కొవిడ్‌పై తప్పుడు సమాచార వ్యాప్తికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్వేతసౌధం వద్ద గురువారం మాట్లాడారు. ఎవరైనా వైద్య, ఆరోగ్య సమాచారాన్ని ఇతరులతో పంచుకునే ముందు దానికి శాస్త్రీయ ఆధారాలున్నాయా? అన్నది సరిచూసుకోవాలని కోరారు. ఇంతవరకు 16 కోట్ల మంది అమెరికన్లు వ్యాక్సిన్లు పొందడం శుభసూచకమన్నారు. ‘‘అలాగని మనమంతా కష్టాల నుంచి బయటపడినట్లు కాదు. కోట్లాది అమెరికన్లు ఇంకా కొవిడ్‌ నుంచి రక్షణ పొందలేదు. వ్యాక్సిన్‌ పొందనివారిలో ఎక్కువగా ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తున్నాయి’’ అని డాక్టర్‌ మూర్తి తెలిపారు. 
ఇవీ చదవండి

Related Keywords

United States ,Americans ,Corona Bari ,United States Figure ,ஒன்றுபட்டது மாநிலங்களில் ,அமெரிக்கர்கள் ,ஒன்றுபட்டது மாநிலங்களில் எண்ணிக்கை ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.