కరోనా వైరస్ మనల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. ఓవైపు మూడో దశ ఉద్ధృతి అనుమానాలను నిజం చేసేలా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రోజుకు వేలాదికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుంటే. మరోవైపు కొవిడ్ బారిన పడి కోలుకున్న వారిని పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రత్యేకించి మధుమేహం లాంటి దీర్ఘకాలిక రోగులకు కొవిడ్ నరకప్రాయంగా మారింది.