కొవిడ్-19 ఒంట్లో దేన్నీ వదిలి పెట్టటం లేదు. ఊపిరితిత్తుల మీదే కాదు.. గుండె నుంచి మెదడు వరకూ అన్ని అవయవాల పైనా ప్రతాపం చూపుతోంది. కనీసం వెంట్రుకల మీదైనా జాలి చూపటం లేదు. కొవిడ్ నుంచి కోలుకున్నాక ఎంతోమంది జుట్టు ఊడిపోవటంతో సతమతమవుతుండటమే దీనికి నిదర్శనం. మంచి విషయం ఏంటంటే- కొద్ది నెలల తర్వాత ఊడిన జుట్టు దానంతటదే రావటం. కాకపోతే తగు పోషకాహారం తీసుకుంటూ, ఒత్తిడికి గురికాకుం