సాక్షి,విజయవాడ: ఏడాదిన్నరగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో ప్రజల్లో ఫోబియో నెలకొంది. ఏ జ్వరం వచ్చినా.. జలుబు, చిన్నపాటి దగ్గు వచ్చినా నిర్ధారణ పరీక్షలు కూడా లేకుండా కరోనాగా భావించి మందులు వాడేస్తున్నారు. అవి ఒక్కోసారి ప్రాణాల మీదకి తెస్తున్నాయి. తెలియని వారు చేస్తే ఏదో అనుకోవచ్చు.. విద్యావంతులు సైతం ఇదే విధంగా మందులు వాడుతూ ప్రమాదాలను కొనితెచ్చుకొంటుండటం ఆందోళనకర