న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతత్వంలో శుక్రవారం విపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు. 15 పార్టీలు పాల్గొంటున్న ఈ సమావేశం... సాయంత్రం 4 గంటలకు వర్చువల్‌గా జరగనుంది. బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్‌సీపీ చీఫ్ శరద పవార్ సహా ఆయా పార్టీల నేతలు పాల్గొననున్నారు. అయితే, ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ, బహుజన సమాజ్ పార్టీలను ఆహ్వానం అందలేదు.