ఎలాగైనా అధిక బరువుని తగ్గించుకుని నాజూగ్గా, ఫిట్‌గా మారదామనే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇందుకోసం జిమ్‌కు వెళ్లి విపరీతమైన వర్కవుట్లు చేయడం, యోగాసనాలు వేయడం, డైట్ ప్లాన్స్‌ను అనుసరించడం చేస్తుంటారు. ఇంకొందరైతే బరువు తగ్గే క్రమంలో తిండి కూడా మానేస్తుంటారు. అయితే ఇలా నోరు కట్టేసుకునే బదులు కొన్ని రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే మేలంటున్నారు. అందులో మఖానా కూడా ఒకటి.