ఎరుపెక్కే గ్రహణం ఎరుపెక్కే గ్రహణం చీకటి కోణాల్ని స్పృశిస్తూ... అక్కడివారి జీవితాల్ని ప్రభావితం చేస్తున్న అనేకమంది మోసాల్ని బట్టబయలు చేస్తూ ఆద్యంతం ఆసక్తిగా సాగే చిత్రమే మా ‘నల్లమల’ అంటున్నారు రవిచరణ్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అమిత్ తివారీ, భాను శ్రీ, నాజర్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా. రవిచరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.ఎమ్ నిర్మిస్తున్నారు. ఆ చిత్రంలోని తొలి వీడియో గీతాన్ని నటుడు నాజర్ విడుదల చేశారు. ‘ఎరుపెక్కే గ్రహణమిది రవికెరుగని గగనం...’ అంటూ సాగే గీతమిది. పెద్దపల్లి రోహిత్ స్వరపరిచారు. పాట విడుదల అనంతరం నాజర్ మాట్లాడుతూ ‘‘నా పాత్ర చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాలో నటించిన అనుభూతి కలిగింది’’ అన్నారు. Tags :