స్నాక్..ఆరోగ్యంగా! స్నాక్..ఆరోగ్యంగా! కొవిడ్ కారణంగా నిర్ణీత పనిగంటలంటూ లేకుండా పోయాయి. తిండి, నిద్రవేళల్లో మార్పు లొచ్చాయి. దీంతో అర్ధరాత్రులు విశ్రాంతి సమయంలో చాలామంది జంక్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారట. ఇది ఆరోగ్యంపైనే కాకుండా తర్వాతి రోజు పనిపైనా చూపుతోందనేది అధ్యయనాలు చెబుతున్న మాట. మరి ప్రత్యామ్నాయమేంటి? బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు, పిస్తా.. ఇలా నచ్చిన వాటిని కొద్దిగా నెయ్యిలో వేయించుకోండి. కావాలనుకుంటే కొద్దిగా ఉప్పు, మిరియాలపొడీ జోడించవచ్చు. వీటిల్లో మోనోసాచ్యురేటెడ్, పాలీఅన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లతోపాటు ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. బాదం, వాల్‌నట్స్ మంచి నిద్రకూ సాయపడతాయి. * మకనా లేదా తామర విత్తనాల్లో తక్కువ కొలెస్టరాల్ ఉంటుంది. ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మైక్రో, మాక్రో న్యూట్రియంట్లు వీటి సొంతం. కొద్దిగా ఎండబెట్టి వేయించి, చాట్ మసాలా కలుపుకుంటే సరి! రుచీ, ఆరోగ్యం. * 100 గ్రాముల పెరుగుకి పావు కప్పు పండ్ల ముక్కలు, కొంత తేనె కలిపి మిక్సీ పట్టండి. ఆరోగ్యమైన స్మూతీ రెడీ. *మీగడ తీసిన పెరుగుకి, నచ్చిన పండ్ల ముక్కలను జోడించి, డీప్ ఫ్రిజ్‌లో కొంతసేపు పెట్టి తినండి. ఐస్‌క్రీమ్ బదులుగా దీన్ని ప్రయత్నించి చూడండి. పండ్లలో శరీరానికి మేలు చేసే ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అరటి, కివీ మంచి నిద్రనీ ఇస్తాయి. Tags :