vimarsana.com

Card image cap


పునరావాసం... పుట్టెడు కష్టం
అసంపూర్తిగా గృహాలు.. పరిహారంలో జాప్యం
ముంపు గ్రామాల ప్రజలకు అందని లబ్ధి
శిథిల గృహాల్లో బిక్కుబిక్కుమంటున్న బాధితులు
నేడో.. రేపో ఖాళీ చేస్తామనే ఆలోచన
మూడు ప్రాజెక్టుల కింద బాధితుల గోడు ఇది
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే- నాంపల్లి, తొగుట, బిజినేపల్లి
చెమట చిందించి ఒక్కో ఇటుకను పేర్చి కట్టుకున్న ఇంటి గోడల నెర్రెలు రోజురోజుకు పెద్దదవుతున్నాయి. పైకప్పు పెచ్చులూడి వాన నీరు వరదగా కురుస్తోంది. ఎప్పుడు ఏ గోడ కూలుతుందో.. ఏ ఇంటి పైకప్పు విరిగి మీద పడుతుందో తెలియదు. ఏదో ఒక రోజు వదిలేయాల్సిన ఇంటి మరమ్మతులకు డబ్బు ఖర్చు ఎందుకనేది వారి ఆలోచన. కానీ పాడైపోయిన ఇళ్లల్లో... అభద్రత మధ్య నివసించడమెలా? రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టు నిర్వాసితుల గోడు ఇది. పునరావాస వసతుల కల్పనలో కొన్నిచోట్ల జాప్యం జరుగుతుండడమే దీనికి కారణం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో వెంకటాద్రి జలాశయం ముంపులోని బండరావిపాకుల సర్పంచి లక్ష్మమ్మతోపాటు ఆమె మనవడిపై ఇటీవల మట్టి మిద్దె కూలి ప్రాణాలు హరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముంపు బాధితుల అవస్థలు, పునరావాస చర్యలపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.
డిండి ఎత్తిపోతల కింద ఇలా...
డిండి ఎత్తిపోతల పథకానికి అవసరమైన 9927 ఎకరాల్లో 7133 ఎకరాలు సేకరించారు. జలాశయాల కింద ఎనిమిది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. 769 గృహాలకు చెందిన 1120 కుటుంబాల వారు నిరాశ్రయులవుతున్నారు. కిష్టరాయనపల్లి జలాశయం కింద ముంపులో పోతున్న నాంపల్లి మండలం ఎస్‌డబ్ల్యూ లింగోటం పంచాయతీ లక్ష్మణాపురం గ్రామంలో పునరావాస చర్యలపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 124 ఇళ్లు, 175 కుటుంబాలు ముంపు కింద ఉన్నాయి. పరిహారంపై స్పష్టత రాలేదు. ఇళ్ల నిర్మాణం జాప్యమవుతోంది. దీంతో శిథిలావస్థలో ఉన్న పాత ఇళ్లలో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 
పై కప్పు కురుస్తున్నా...
మా తాతముత్తాల నుంచీ ఇదే గ్రామంలో జీవిస్తున్నాం. ఉన్న పది ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాం. నా ఇద్దరు కొడుకులు ఉపాధి లేక లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ప్రాజెక్టు కింద ఊరు పోతుందని తెలిసినప్పటి నుంచి ఇంటికి సున్నం కూడా వేయడం లేదు. పైకప్పు కురుస్తున్నా ఉపయోగం లేదని మరమ్మతులు చేయించలేదు.
- బాణావత్‌ పాండు, లక్ష్మణాపురం, నాంపల్లి మండలం
ఇదీ మల్లన్నసాగర్‌ పరిస్థితి..
సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల్లో నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ జలాశయం నిల్వ సామర్థ్యం 50 టీఎంసీలు. దీని నుంచి కొండపోచమ్మ సాగర్‌, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు, నిజాంసాగర్‌, సింగూరు జలాశయాలకు కూడా నీటిని అందించనున్నారు. ఈ జలాశయం నిర్మాణంలో ఎనిమిది పంచాయతీల్లోని 16 గ్రామాలు పూర్తి స్థాయిలో ముంపులో పోతుండగా తొగుట, తుక్కాపూర్‌ గ్రామాల కింద సాగు భూమి 90 శాతానికిపైగా ముంపు కింద ఉంది. మొత్తం 17 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. ముంపు గ్రామాల్లోని 5618 కుటుంబాలకు గాను ఇంకా 251 కుటుంబాలు కోర్టు కేసులు, ఇతర కారణాలతో పరిహారం అందక గ్రామాల్లోనే ఉన్నాయి. 65 ఏళ్ల వయసున్న ఒంటరి మహిళలు, పురుషులకు పునరావాసం ప్యాకేజీలో ఇప్పటివరకు కేటాయింపులు లేవు. 
ఎవరికీ పరిహారం దక్కలేదు
ఈమె పేరు బండ్ల లింగవ్వ. తొగుట మండలం పల్లెపహాడ్‌ గ్రామం. శిథిలమైన ఇంట్లోనే జీవిస్తున్న ఆమె మనోవేదన అంతా ఇంతా కాదు. ‘నాకు భర్త లేరు. ఇద్దరు కుమారుల్లో పెద్దోడు నర్సింహులు పునరావాస డబ్బుల కోసం తిరిగి తిరిగి దిగులుతో ప్రాణాలు విడిచాడు. ఇద్దరు కొడుకుల కుటుంబాలకు కూడా పరిహారమివ్వలేదు. వారు ఉపాధికి ఇతర గ్రామాలకు వెళ్లారనే కారణం చూపి అధికారులు తిరస్కరిస్తున్నారు. ఊరిలోనే ఉంటున్నా, నాకు పరిహారం వర్తింపజేయలేదు. కూలిపోతున్న ఇంటిని బాగు చేసుకునేందుకు ఆదాయం ఏదీ లేదు’ అంటూ లింగవ్వ వాపోయింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కింద ఇలా
ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 2015 జూన్‌ 11వ తేదీన శంకుస్థాపన రాయి పడింది. మొదటి విడతగా అయిదు జలాశయాలను నిర్మిస్తున్నారు. వాటి పరిధిలో ఆరు గ్రామాలు, 17 తండాలు ముంపులో ఉన్నాయి. ఇప్పటి వరకు కురుమూర్తిరాయ జలాశయం పరిధిలో మాత్రమే పునరావాస చర్యలు చేపట్టారు. మిగిలిన చోట్ల స్థల సేకరణ, అభివృద్ధి, నిర్మాణాల దశల్లో ఉన్నాయి.
ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నాం
ఇంటి కప్పు నుంచి గోడలోకి దిగిన పగుళ్లు చూపిస్తున్న ఈ వృద్ధుని పేరు ముడావత్‌ తుకారాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లోని వెంకటాద్రి (వట్టెం) జలాశయం ముంపు గ్రామమైన బిజినేపల్లి మండలం అనేఖాన్‌పల్లి తండా ఈయనది. తాతల కాలం నుంచీ సాగును నమ్ముకుని వారి కుటుంబం ఇక్కడ జీవిస్తోంది. ఆనకట్ట నిర్మాణం వీరి ఇంటి సమీపానికి చేరుకుంది. ‘మాకు పరిహారంలో భాగంగా ఇవ్వాల్సిన 250 గజాల ఇంటి స్థలం అందలేదు. ఊరిని విడిచిపెట్టాలంటే బాధగా ఉంది. అయినప్పటికీ ఇళ్లు ఇస్తారని ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎలాగో వెళ్లిపోతాం కదా అని ఇంటికి మరమ్మతు చేయడం లేదు. వర్షాలకు ఎక్కడ గోడలు కూలుతాయో అని భయంగా ఉంది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Tags :

Related Keywords

Nalgonda , Andhra Pradesh , India , Siddipet , Singur , West Bengal , Palamuru Reddy Venkatadri , , Venkatadri Reservoir Her , Her Everything , ప నర వ స , Enadu , Stories , Ain News , Eneral , 704 , 21130877 , Hyderabad Breaking News , Yderabad Breaking News In Telugu , S News In Telugu , S Breaking News , S Latest News , Bs News , Elangana News In Telugu , Elangana Breaking News , Atest Telangana News , Elangana Headlines , Odays Telangana News , Elangana News Live , Elangana News , Elangana Telugu News , Elangana Latest News In Telugu , Elangana News Headlines , Elangana News Live Updates , Odays Ts News In Telugu , Hyderabad News , Yderabad Live News Hyderabad Today , Yderabad News Telugu , Atest Hyderabad News , Yderabad News Headlines , Ts Telugu News , Ts News In Telugu , Telangana News In Telugu , Telangana News Paper , Spolitics , Sstatenews , Sstories , Ukyamshalu , Op Stories , Elugu Top Stories , நல்கொண்டா , ஆந்திரா பிரதேஷ் , இந்தியா , சித்திப்ெட் , சிங்கூர் , மேற்கு பெங்கல் , கதைகள் , ஆயின் செய்தி , ஹைதராபாத் உடைத்தல் செய்தி , ட்ச் செய்தி இல் தெலுங்கு , தெலுங்கானா செய்தி இல் தெலுங்கு ,

© 2024 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.