'కొవాగ్జి&#x

'కొవాగ్జిన్‌' టీకా సామర్థ్యం 77.8 శాతం


‘కొవాగ్జిన్‌’ టీకా సామర్థ్యం 77.8 శాతం
డెల్టా వేరియంట్‌ నుంచి 65.2 శాతం రక్షణ
మూడో దశ క్లినికల్‌ పరీక్షల తుది విశ్లేషణ
ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19కి భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాకు 77.8 శాతం సమర్థత ఉన్నట్లు మూడో దశ క్లినికల్‌ పరీక్షల తుది విశ్లేషణలో నిర్ధారణ అయింది. ఈ టీకా తీసుకుంటే ప్రాణాంతక కరోనా వైరస్‌- డెల్టా వేరియంట్‌ నుంచి 65.2 శాతం రక్షణ ఉంటుందని తేలింది. తీవ్రమైన కొవిడ్‌-19 రాకుండా 93.4 శాతం మేరకు నిరోధిస్తుందని, వ్యాధి సోకినప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించని (అసింప్టమ్యాటిక్‌ కొవిడ్‌-19) వారికి సైతం 63.6 శాతం మేర రక్షణ ఉంటుందని వెల్లడైంది. మూడో దశ క్లినికల్‌ పరీక్షల తుది ఫలితాలను భారత్‌ బయోటెక్‌ శనివారం వెల్లడించింది.
టీకా ప్రత్యేకతలివీ
*క్రియారహితం చేసిన మొత్తం సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ (ఇనేక్టివేటెడ్‌ హోల్‌ వైరియన్‌) టీకా అయిన ‘కొవాగ్జిన్‌’ను ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో భారత్‌ బయోటెక్‌ ఆవిష్కరించింది. ఈ టీకాలో ఎంతో వినూత్న ఆల్గెల్‌+ ఐఎండీజీ అడ్జువాంట్‌ వినియోగించారు. దీనివల్ల మెమరీ టీ సెల్‌ స్పందన సాధించడంతోపాటు యాంటీబాడీలు త్వరితంగా అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడుతుంది. ఐఎండీజీని అమెరికాకు చెందిన వైరోవ్యాక్స్‌, నియాడ్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ యూఎస్‌ఏ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. భద్రతా పరంగా కూడా ‘కొవాగ్జిన్‌’ ఎంతో మెరుగైనదని, ఇతర టీకాలతో పోల్చితే ఈ టీకా తీసుకున్న వారిలో నమోదైన వ్యతిరేక రియాక్షన్లు ఎంతో తక్కువని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది.
* రెండు డోసుల టీకా తరవాత ‘కొవాగ్జిన్‌’ బూస్టర్‌ డోసు ఇస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించడానికి ప్రయోగాలు చేపట్టారు. దీనిపై క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఇందులో భాగంగా పలు రకాల కరోనా వైరస్‌ వేరియంట్లపై చూపే ప్రభావాన్ని కూడా పరిశీలించనున్నట్లు పేర్కొంది.
* టీకా అభివృద్ధి, క్లినికల్‌ పరీక్షల్లో భాగస్వాములైన శాస్త్రవేత్తలు, నిపుణులు, వాలంటీర్లకు భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్ల కృతజ్ఞతలు తెలిపారు. టీకాను ఆవిష్కరించడంలో భారత్‌ బయోటెక్‌, ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు శక్తివంచన లేకుండా కృషి చేశారని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ పేర్కొన్నారు. పూర్తిగా మనదేశంలోనే టీకా తయారు చేయగలగడం ఎంతో స్ఫూర్తిదాయక విజయమని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ప్రియా అబ్రహం అన్నారు.
పరిశోధనలకు స్ఫూర్తి
‘కొవాగ్జిన్‌’ టీకా రూపంలో మన సత్తా రుజువు అయినట్లు భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల సంతోషం వ్యక్తంచేశారు. ఇది మనదేశంలో శాస్త్ర-సాంకేతిక పరిశోధనలు విశేషంగా పెరగడానికి స్ఫూర్తినిచ్చే పరిణామమన్నారు. ఈ టీకా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కొవిడ్‌-19 మహమ్మారి నుంచి రక్షణ కల్పిస్తుందని వివరించారు.
Tags :

Related Keywords

United States , India , Priya Abraham , Corona Delta , , Virology Priya Abraham , ஒன்றுபட்டது மாநிலங்களில் , இந்தியா , பிரியா ,

© 2025 Vimarsana