అమ్మ కోరికను తీర్చాలని... ఏడేళ్ల వయసులోనే యాంకర్ అవతారమెత్తిందా అమ్మాయి. ఆపై చిన్నితెరపై అవకాశాలు... వరుసకట్టడంతో నటిగా మారింది. తన పాత్రల్లో ఒదిగిపోయి... అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమే మోనీషా. ఎప్పటికైనా వెండితెరపైనా తన ముద్ర వేయాలన్నది లక్ష్యమంటోన్న ఆమెతో వసుంధర ముచ్చటించింది... నన్ను తెరపై చూడాలనుకున్న అమ్మ కోరికే... ఈ రోజు నటిగా నాకో గుర్తింపు తెచ్చింది. నాకు చిన్నప్పటి నుంచీ చదువన్నా, పాటలన్నా ఎంతో ఇష్టం. ...