లక్షణాలు జబ్బుల కిటికీలు సమస్యను త్వరగా గుర్తించటానికివే కీలకం. అయితే ఇవి ఆయా వ్యాధులకే ప్రత్యేకం కాకపోవచ్చు. కొన్ని లక్షణాలు పలు రకాల జబ్బుల్లోనూ కనిపించొచ్చు. కొన్ని తీవ్రమైనవైతే.. మరికొన్ని మామూలు సమస్యలకు సంబంధించినవి కావొచ్చు. ఇక్కడే చాలామంది బోల్తా పడుతుంటారు. తీవ్రమైన జబ్బులకు చెందిన వాటినీ మామూలువేనని పొరపడుతుంటారు. ఇలాంటి లక్షణాల విషయంలో అప్రమత్తత అత్యవసరం. లేకపోతే పెద్ద ముప్పులో పడ్డట్టే. బోల్తా పడొద్దు