దానిమ్మ చ&#x

దానిమ్మ చెట్టుకు డబ్బు కాయలు


దానిమ్మ చెట్టుకు డబ్బు కాయలు
కోర్టు చెప్పింది 2 వేలు.. అధికారులు ఇస్తున్నది 14 వేలు
‘సోమశిల’లో చెట్లకు కోట్లలో లెక్కింపు
40 ఏళ్ల వివాదంలో మరో వింత చిక్కు
2వేలు పరిహారం నిర్ణయించిన హైకోర్టు
చెల్లింపునకు ఈనెల 13 వరకు గడువు
జిల్లాస్థాయిలో మారిపోయిన లెక్కలు
చెట్టుకు రూ.14 వేల పరిహారం నిర్ణయం
అవసరంలేకున్నా 1992 నుంచి వడ్డీ
70 లక్షల పరిహారం 5 కోట్లకు చేరిక
కింది నుంచి వచ్చిన నివేదికలను కళ్లుమూసుకుని ఆమోదించిన వైనం
అప్పుడెప్పుడో... ఒక్కో దానిమ్మ చెట్టుకు పరిహారంగా 30 రూపాయలు చెల్లించారు. అది సరిపోదు... చెట్టుకు రూ.2 వేలు చెల్లించాలని ఇప్పుడు కోర్టు చెప్పింది. అంటే... ఒక్కో చెట్టుకు ఇంకో రూ.1970 చెల్లించాలి. కానీ... అధికారులు దానిమ్మ చెట్లకు ‘కాసులు’ కాయించారు. ఒక్కో చెట్టుకు రూ. 14 వేలు ఇవ్వాలని తేల్చేశారు. అసలే.. 40 ఏళ్లుగా వివాదంలో నలుగుతూ, న్యాయ చిక్కుల నుంచి ఇటీవలే సోమశిల- కండలేరు పరిహార సమస్య కొలిక్కి వచ్చింది. అందులోనే ఈ లెక్కల గోల్‌మాల్‌!
పోలవరం చెట్లకు ఎంతో..?
సోమశిల-కండలేరులో కేవలం 3543 దానిమ్మ చెట్లకే రూ.5 కోట్లు చెల్లించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ లెక్కన విస్తీర్ణంలో ‘బాహుబలి’ అయిన పోలవరం ప్రాజెక్టు పరిధిలో జరిపిన భూ సమీకరణ సందర్భంగా అందులో గుర్తించిన చెట్లకు పరిహారం ఇవ్వాలంటే ఎన్ని వందల కోట్లవుతుందోనని రెవెన్యూ వర్గాలే విస్మయం చెందుతున్నాయి.
(అమరావతి- ఆంధ్రజ్యోతి)
సోమశిల-కండలేరు భూపరిహారం వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. విచారణ పూర్తయి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసే విషయంలో రెవెన్యూ శాఖ ఊహకందని చిత్ర విచిత్రాలు ప్రదర్శిస్తోంది. రూపాయి ఇవ్వాల్సిన చోట ఏడున్నర రూపాయలు ఇస్తామంటూ ఎక్కడా లేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూశాఖ తీరు ఒకేలా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంట్రాక్టర్లకి, సప్లయర్స్‌కి, వెండర్స్‌కి పెండింగ్‌ బిల్లులు, ఉద్యోగులకు డీఏలు ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి పనులు చేసిన వారికి, సరఫరా చేసిన వారికి కనీసం ఆ బిల్లులు పెట్టుకునే అవకాశం కల్పించకపోగా, ఆ పెండింగ్‌ బిల్లులతో తమకు సంబంధమే లేదన్నట్టు వాటికి బడ్జెట్‌ కూడా కేటాయించడం లేదు. కానీ, ‘సోమశిల- కండలేరు’ చెట్ల పరిహారం విషయంలో మాత్రం ఎందుకింత ఉదారతో తెలియడం లేదు. 
ఆ వివరాల్లోకి వెళితే.. దాదాపు 40 ఏళ్ల క్రితం సోమశిల కండలేరు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూసమీకరణ చేసింది. భూములకి, ఆ భూముల్లో ఉన్న చెట్లకు కూడా లెక్కలు కట్టి చెల్లింపులు పూర్తి చేసింది. కానీ, పరిహారం సరిపోలేదంటూ కోర్టులో దాదాపు 100 పిటిషన్లు పడ్డాయి. కింది కోర్టుల్లో పిటిషనర్లకు చుక్కెదురైనా, 2017లో హైకోర్టులో అనుకూల తీర్పు వచ్చింది. ఆ తర్వాత మరికొందరు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లారు. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోబోమంటూ సుప్రీంకోర్టు 2020లో చెప్పింది. దీంతో హైకోర్టు తీర్పే ఫైనల్‌ అయింది. హైకోర్టు తీర్పు ప్రకారం మళ్లీ పరిహారం ఇప్పించేందుకు రెవెన్యూ శాఖ తీవ్రంగా కసరత్తు చేసి ఒక లెక్కల పత్రాన్ని తయారుచేసింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఒక్కో దానిమ్మ చెట్టుకి రూ.2000 చెల్లించాలి. అందులో 1992లో రూ.30 ప్రభుత్వం చెల్లించింది. అంటే ఇంకా ఒక్కో చెట్టుకి రూ.1970 చెల్లించాలి. కానీ, నెల్లూరు జిల్లా రెవెన్యూ à°¯ ంత్రాంగం నుంచి రాష్ట్ర స్థాయిలో సీసీఎల్‌ఏ వరకూ అందరూ కోర్టు చెప్పిన పరిహారాన్ని దాదాపు రూ.14,378 అందేలా లెక్కలు సిద్ధంచేశారు. దీంతో 3543 చెట్లకు గాను దాదాపు రూ.70 లక్షలు చెల్లించాల్సిన పరిహారం కాస్త రూ.5.9 కోట్లకు చేరుకుంది. ఈ లెక్క కేవలం ఆరు పిటిషన్లకు సంబంధించినదే కావడం గమనార్హం. ఇలాంటి పిటిషన్లకు వంద వరకు ఉన్నాయి. 
ఇలా పెంచేశారు.. 
ఒక్కో దానిమ్మ చెట్టుకి కోర్టు చెప్పిన రూ.1970 పై రెవెన్యూ అధికారులు 30శాతం సొలాషియం, 12 శాతం అదనపు మార్కెట్‌ విలువ జోడించారు. అంటే కట్టాల్సిన మొత్తానికి ప్రాథమికంగా 42 శాతం మేర పెంచారు. ఆ వచ్చిన మొత్తంపై 1992 నుంచి ఏడాది పాటు అంటే 1993 వరకు 9 శాతం వడ్డీ రేటు, ఆ తర్వాత 1993 నుంచి 2020 వరకు 15 శాతం వడ్డీని అమలు చేశారు. అంటే మొత్తం 3,543 చెట్లకు (ఆరుగురు పిటిషనర్లు) చెల్లించాల్సిన రూ.69,79,710కి సొలాషియం, అదనపు మార్కెట్‌ విలువ రూపంలో 42 శాతం జోడిస్తే అది రూ.99,11,188కి చేరుకుంది. దీనిపై ఏడాది పాటు 9శాతం వడ్డీ అంటే రూ.8,92,006, తర్వాత 2020 వరకు 15 శాతం వడ్డీ అంటే రూ.4,01,40,311కి చేరుకుంది. అంటే కోర్టు చెప్పిన అసలు, సొలాషియం, అదనపు మార్కెట్‌ విలువ, రెండు రకాల వడ్డీలు కలుపుకుని మొత్తం పరిహారం రూ.5,09,43,505కి పెరిగింది. ఈ మొత్తాన్ని పరిహారం రూపంలో ఇవ్వాలంటూ జిల్లా రెవెన్యూ యంత్రాంగం నుంచి వచ్చిన లెక్కల పత్రాన్ని ఎలాంటి సవరణలు లేకుండా à°

Related Keywords

Nellore District , Andhra Pradesh , India , Polavaram , Chitra , Uttar Pradesh , New Delhi , Delhi , , Everyone Court , A High Court , Law Ministry , Water Resources The Department , Revenue The Department , Supreme Court , Ministry Of Justice , Supreme Court New Delhi , High Court , Nellore District Revenue , District Revenue Machinery , Water Resources , File Revenue , File Amendment , Telugu Ganga , நெல்லூர் மாவட்டம் , ஆந்திரா பிரதேஷ் , இந்தியா , போலவாரம் , சித்ரா , உத்தர் பிரதேஷ் , புதியது டெல்ஹி , டெல்ஹி , சட்டம் அமைச்சகம் , உச்ச நீதிமன்றம் , அமைச்சகம் ஆஃப் நீதி , உச்ச நீதிமன்றம் புதியது டெல்ஹி , உயர் நீதிமன்றம் , தண்ணீர் வளங்கள் , கோப்பு வருவாய் , தெலுங்கு கங்கா ,

© 2025 Vimarsana