ప్రపంచంల

ప్రపంచంలోనే తెలివైన విద్యార్థిని నటాషా పేరీ


ప్రపంచంలోనే తెలివైన విద్యార్థిని నటాషా పేరీ
84దేశాలు..19 వేలమంది పాల్గొన్న ఎంట్రన్స్‌
ప్రథమురాలిగా నిలిచిన 11 ఏళ్ల ఎన్‌ఆర్‌ఐ
ప్రకటించిన అమెరికా యూనివర్సిటీ
వాషింగ్టన్‌, ఆగస్టు 3: భారత సంతతికి చెందిన 11 ఏళ్ల నటాషా పేరీ.. ప్రపంచంలోనే తెలివైన విద్యార్థినిగా ఖ్యాతి గడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్లోంచి మెరికల్లాంటివారిని, విద్యాపరమైన వారి ప్రతిభావిశేషాల ఆధారంగా గుర్తించడానికి అమెరికాలోని విద్యాలయాలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఒక ఎంట్రన్స్‌లో 84 దేశాలకు చెందిన 19వేలమందితో పోటీపడి నటాషా మేటిగా నిలిచారు. ప్రతిష్ఠాత్మకమైన జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ 2021 సంవత్సరానికిగాను ఈ ప్రతిభా పరీక్షను నిర్వహించింది. విద్యార్థుల ప్రతిభను పరీక్షించే (స్కూలాస్టిక్‌ అసె్‌సమెంట్‌ టెస్ట్‌), ఏసీటీ (అమెరికన్‌ కాలేజీ టెస్టింగ్‌) ఎంట్రన్స్‌లో నటాషా అద్భుత ప్రతిభ ప్రదర్శించినట్టు వర్సిటీ ప్రకటించింది. ‘ప్రపంచంలోనే తెలివైన విద్యార్థుల్లో ఆమె ఒకరు’ అని ప్రశంసించింది. ప్రస్తుతం న్యూజెర్సీలోని థేల్మా ఎల్‌ సాండ్‌మేయర్‌ ఎలిమెంటరీ స్కూలులో నటాషా ఐదో తరగతి చదువుతోంది. తనను తాను మెరుగుపరుచుకోవడానికి జేఆర్‌ఆర్‌ టోల్కెన్స్‌ నవలలు ఎంతగానో ఉపకరించాయని ఆమె తెలిపారు. 

Related Keywords

Jersey , United States , India , , United States University , Jersey Elementary School , United States Schools , New Jersey Elementary School , ஜெர்சி , ஒன்றுபட்டது மாநிலங்களில் , இந்தியா , ஒன்றுபட்டது மாநிலங்களில் பல்கலைக்கழகம் , ஒன்றுபட்டது மாநிலங்களில் பள்ளிகள் ,

© 2025 Vimarsana