న్యాయపాల

న్యాయపాలనలో కొత్త పవనం


న్యాయపాలనలో కొత్త పవనం
‘ఒక స్వేచ్ఛాయుత సమాజంగా మన మనుగడకు చట్టబద్ధపాలనే అత్యుత్తమ ఆధారం. మనమేకాలంలో నివసిస్తున్నా, మన పాలకులు ఎవరైనా, పాలనా పద్ధతులు ఏవైనా సరే సమన్యాయపాలన తన ప్రాధాన్యాన్ని, ప్రాసంగికతను కోల్పోదు. ఎందుకంటే సమన్యాయపాలన లేదా చట్టబద్ధపాలన అనేది మానవ నాగరికతా వికాస గాథ’.
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ 
సత్యమేవ జయతే. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఎన్‌విరమణ నేతృత్వంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం మన రాజ్యాంగ విలువలను సంపూర్ణంగా పరిరక్షించగలదనే భరోసా కలుగుతోంది. అత్యున్నత స్థానాలలోని వారు వివేకశీలురు అయినప్పుడు న్యాయం తప్పక వర్ధిల్లుతుంది. గత నెల 30à°¨ జస్టిస్ పిడి దేశాయి స్మారకోపన్యాసాన్ని వెలువరిస్తూ వివిధ అంశాలపై సిజెఐ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన న్యాయవిజ్ఞతకు అద్దం పట్టాయి. 
‘ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పాలకులను మార్చివేసే హక్కు ప్రజలకు ఉన్నంత మాత్రాన నిరంకుశ పాలన నుంచి మనకు రక్షణ లభిస్తుందని చెప్పలేమని’ సిజెఐ అన్న మాట అక్షరాలా సత్యం. ‘న్యాయవ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు దాన్ని ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ, నియంత్రించకూడదు. న్యాయవ్యవస్థను కట్టడి చేస్తే చట్టబద్ధపాలన ఒక భ్రమగా మిగిలిపోతుంది’ అని సిజెఐ స్పష్టం చేశారు. ప్రభుత్వాలను విమర్శించడం, నిరసనలు తెలుపడం పౌరుల హక్కు అని ఆయన నొక్కి చెప్పారు. ‘వివేచనాయుతమైన చర్చ అనేది మానవ హుందా స్వతస్సిద్ధ లక్షణం. ప్రజాస్వామ్యం సక్రమంగా పని చేసేందుకు అది చాలా ముఖ్యం. విమర్శలు, నిరసనలు ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతర్భాగాలు’ అని సిజెఐ ఉద్ఘాటించారు. ‘న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా, నిర్భయంగా తీర్పులు వెలురించాలి. ఎవరి పట్ల వాత్స్యలం లేదా దుర్భావం చూపకూడదు. రాజ్యాంగ ధర్మాన్ని నిలబెట్టడం, చట్టాల అమలు కచ్చితంగా ఉండేలా చూడడమే న్యాయమూర్తుల బాధ్యత’ అని అన్నారు. ‘సామాజిక న్యాయసాధనకు దోహదం చేయడం న్యాయవాదుల విధ్యుక్త ధర్మం. కులమతాలు, జెండర్, వర్గపరమైన వ్యత్యాసాలు పాటించకూడదు. వృత్తిధర్మ నిర్వహణలో స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వకూడదు’ అని హితవు చెప్పారు. కొవిడ్ సంక్షోభాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు తప్పటడుగులు వేశాయని చెబుతూ ప్రస్తుత దశలో మహమ్మారి నుంచి ప్రజలను సంరక్షించడంలో చట్ట బద్ధపాలనను ఏ మేరకు ఉపయోగించామో నిష్పక్షపాతంగా సమీక్షించుకోవల్సి వుంది’ అని సిజెఐ సంయమనస్వరంతో చెప్పారు. ఇవన్నీ ఒక వివేచనాశీలి మాటలు. ఆయన మార్గదర్శకత్వంలో న్యాయవ్యవస్థ, గతి తప్పిన భారత ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ సరైన మార్గంలోకి తీసుకురాగలదనే నమ్మకం కలుగుతోంది.
న్యాయవ్యవస్థతో సహా మన ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్థలను ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తున్న నరేంద్ర మోదీ–అమిత్ à°·à°¾ పాలనలో ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడగలగడం చాలా సాహసోపేతమైన విషయం. సిజెఐ రమణకు ముందు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్నవారు వెలువరించిన తీర్పులతో, పదవీలాలసతో వ్యవహరించిన తీరుతో సుప్రీంకోర్టు ప్రతిష్ఠ ఎంతగా మసకబారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటువంటి దౌర్భాగ్య తరుణంలో భారత ప్రధాన న్యాయమూర్తిగా రమణ రావడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం మళ్ళీ పూర్వప్రతిష్ఠను సమకూర్చుకోగలదనే విశ్వాసం ప్రజల్లో అంకురించింది. 
సిజెఐ ప్రసంగం విలువ, విశిష్టత ఏమిటి? ప్రస్తుత దేశపాలకుల ఆధ్వర్యంలో భారత ప్రజాస్వామ్య పరిస్థితి అమితంగా కలవరం కలిగిస్తోందని (పరోక్షంగానే అయినప్పటికీ) నిర్మొహమాటంగా రమణ చెప్పారు. పాలకులపై ఈ దోషారోపణ కంటే ముఖ్యమైనది ‘చట్టబద్ధ పాలన’ లేదా సమన్యాయపాలన’ (రూల్ ‌ఆఫ్‌ లా) పై ఆలోచనలు రేకేత్తించిన ఆయన వ్యాఖ్యలు. ‘ఒక స్వేచ్ఛాయుత సమాజంగా మన మనుగడకు చట్టబద్ధపాలనే ఒక అత్యుత్తమ ఆధారం’ అని సిజెఐ అన్నారు. ‘మనమే కాలంలో నివసిస్తున్నా, మన పాలకులు ఎవరైనా, పాలనా పద్ధతులు ఏవైనా సరే సమన్యాయపాలన తన ప్రాధాన్యాన్ని, ప్రాసంగికతను కోల్పోదు. ఎందుకంటే సమన్యాయ పాలన లేదా చట్టబద్ధపాలన అనేది మానవ నాగరికతా వికాస గాథ’. 
చట్టం అనేది సాధారణ అర్థంలో సామాజిక నియంత్రణా సాధనం. అయితే ఇది సమగ్ర నిర్వచనం కాదు. చట్టాన్ని రెండంచుల కత్తిలా కూడా ఉపయోగించవచ్చు. న్యాయం చేసేందుకే కాకుండా అణచివేతను సమర్థించేందుకు కూడా దానిని ఉపయోగించవచ్చు. కనుక న్యాయం, సమానత్వం ఆదర్శాల స్ఫూర్తిని నింపుకుని చట్టాన్ని నిజంగా ఒక చట్టంగా పరిగణించలేమని సిజెఐ రమణ అన్నారు. చట్టాన్ని అలా దుర్వినియోగపరచడాన్ని వివరిస్తూ బ్రిటిష్ వారు మన దేశాన్ని ‘చట్టబద్ధపాలన’తో కాకుండా ‘చట్టంతో పాలన’ (రూల్ బై లా) దృక్పథంతో పాలించారని ఆయన అన్నారు. భారత ప్రజ

Related Keywords

Dharma , India General , India , United Kingdom , British , Mahatma Gandhi , Amit Shah , Narendra Modi , Ramana Satyameva Jayate , Supreme Court Image , Constitution Office , India Main , Constitution Dharma Making , Rule Law , Ramana Her , His India , Hanna Issue , தர்மம் , இந்தியா , ஒன்றுபட்டது கிஂக்டம் , பிரிட்டிஷ் , மகாத்மா காந்தி , அமித் ஷா , நரேந்திர மோடி , உச்ச நீதிமன்றம் படம் , ஆட்சி சட்டம் , அவரது இந்தியா ,

© 2025 Vimarsana