నేడు ప్రభుత్వ ఐటిఐ అసోసియేషన్ రాష్ట్ర సదస్సు సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి అధికారులతో చెప్పిన మాటలకు... క్షేత్ర స్థాయిలో పరిస్థితికి పొంతనే లేదు. సి.ఎం ఆదేశాలన్నీ సమావేశాలకే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి నైపుణ్యంపై ప్రభుత్వం దృష్టే పెట్టడం లేదు. కనీసం పరిశ్రమలతో సమన్వయం కూడా చేయడం లేదు. ఐటిఐ లలో శిక్షణ ఇచ్చేందుకు కూడా అధ్యాపకులు లేరంటే ప్రభుత్వం ఎంత చిన్న చూపు చూస్తోందో అర్ధం చేసుకోవచ్చు.