పదవీవిరమణ నిధిని పెంచుకోండి 1. ముందుగానే ప్రారంభించండి పదవీ విరమణకు చాలా సమయం ఉంది ఇప్పటినుంచే దాని గురించే ఆలోచించడం ఎందుకని చాలామంది అనుకుంటారు. అందుకే దీనికోసం ప్రణాళిక గురించి ఆలోచించరు. అయితే ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే గణనీయమైన కార్పస్‌ను పొందవచ్చనే విషయాన్ని గ్రహించాలి. ఎక్కువ కాలం పెట్టుబడులు కొనసాగిస్తే సమ్మేళనం ప్రయోజనాన్ని పొందవచ్చు. ఉదాహరణకు, మీకు 35 సంవత్సరాల వయస్సు ఉంటే రాబోయే 25 సంవత్సరాలకు నెలకు రూ .10,000 పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసే సమయానికి, సుమారు రూ. 95 లక్షల కార్పస్‌ను కూడబెట్టుకోగలుగుతారు. (8 శాతం సగటు రాబడి రేటు అయితే). 2. పొదుపు పెంచండి మీ ఆదాయం పెరిగేకొద్దీ, ఎక్కువ ఆదా చేయడానికి ప్రయత్నించండి. కాలక్రమేణా ద్రవ్యోల్బణం పెరుగుతుంది, దీంతో మీరు దాచుకున్న సొమ్ము మీ అవసరాలకు సరిపోదు. అందుకే దానికి తగినట్లుగా పొదుపు, పెట్టుబడులు చేయడం అలవాటు చేసుకోవాలి. నెలవారీ ఖర్చులలో కనీసం 6-12 నెలలు ఖర్చులకు సరిపడా అత్యవసర నిధి ఏర్పాటుచేసుకోవాలి. వాస్తవానికి, మేము ఆర్ధిక శ్రేయస్సుపై మహమ్మారి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సర్వేను నిర్వహించాము. అయితే కరోనా మహమ్మారి తర్వాత ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు కనిపిస్తోంది. ఆర్థిక భద్రత, ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి ప్రాధాన్యత పెరిగిందనే చెప్పుకోవాలి. 3. మీ పెట్టుబడిని పెంచండి మొదట కొంత చిన్న మొత్తంతో ప్రారంభించిన దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ద్రవ్యోల్బణాన్ని అదిగమించి మీ పెట్టుబడులు మీకు తర్వాత సరిపోవాలంటే ప్రతీ ఏడాది ఆదాంయ పెరిగినప్పుడు పెట్టుబడులను పెంచుకుంటూ పోవాలి. 4. రిస్క్ తీసుకోండి పెట్టుబడులలో రిస్క్ తీసుకోకపోవడం అతి పెద్ద రిస్క్. పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని అదిగమించి ప్రయోజనాలను కలిగించాలంటే ఈక్విటీ పెట్టుబడులకు కొంత కేటాయించాలి. అయితే దీనికోసం ఆర్థిక సలహాదారుని సంప్రదించాలి. దానిపై అవగాహన లేకుండా పెట్టుబడులు ప్రారంభిస్తే పూర్తిగా నష్టపోవచ్చు. ఈక్విటీ-ఆధారిత మ్యూచువల్ ఫండ్లను ఎంపిక చేసుకోండి. రిస్క్‌ను సమతుల్యం చేయడానికి కొంత డెట్ ఫండ్లలో కూడా పెట్టుబడులు పెట్టాలి. 5. బీమా ప్రారంభ సంవత్సరాల్లో పెట్టుబడులపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో చేరిన మొదటి నుంచే వ్యక్తిగతంగా, కుటుంబానికి తగిన ఆరోగ్య బీమా తీసుకోవాలి. సంస్థ ఇచ్చే బీమా కాకుండా మీకు పత్యేకమైన బీమా పాలసీలు ఉండాలి. అంతేకాకుండా, ఆకస్మిక మరణం సంభవించినప్పుడు కుటుంబ భవిష్యత్తును భద్రపరచడానికి, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కలిగి ఉండటం తప్పనిసరి. మీ ఆదాయంలో కనీసం 15 రెట్లు జీవిత బీమా ఉండాలి. దీనికి సరైన నామినీని కూడా ఎంచుకోవాలి. 6. అవసరం లేని పథకాల నుంచి తప్పుకోండి ఇంతకుముందు పెట్టుబడులు పెట్టి వాటి గురించి పట్టించుకోకుండామరచిపోయిన పెట్టుబడులు, అనవసరమైన బీమా పాలసీలన్నింటినీ తీసివేయండి. తక్కువ రాబడిని ఇచ్చే లేదా చాలా ఖరీదైన వాటిని ఉపసంహరించుకోండి. ఉదాహరణకు, మీకు ఇప్పటికే బారీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లేదా స్టాక్ పోర్ట్‌ఫోలియో ఉంటే, అందులో ఉపయోగంలేని సెక్యూరిటీలు, రాబడి లేని ఫండ్ల నుంచి నిష్క్రమించి ప్రణాళికతో మీకు ప్రయోజనాన్ని చేకూర్చేవాటికి కేటాయించండి. Tags :