మన రామప్ప&#x

మన రామప్పకు విశ్వమంత గుర్తింపు


మన రామప్పకు విశ్వమంత గుర్తింపు
ప్రపంచ వారసత్వ కట్టడంగా ఎంపిక 
కాకతీయుల కళావైభవానికి యునెస్కో గుర్తింపు
2019లో భారత్‌ నుంచి రామప్ప ఒక్కటే నామినేట్‌ 
ఎంపిక ప్రక్రియలో నాటకీయ పరిణామాలు
రామప్పను చేర్చడంపై నార్వే అభ్యంతరం 
రష్యా చొరవ.. తక్షణం జాబితాలో చేర్చాలని పట్టు
24 దేశాల్లో 17 మనకు అనుకూలం
దౌత్యపరంగా మద్దతు కూడగట్టిన భారత్‌ 
ఆలయ విశిష్టతను వివరించిన ప్రతినిధులు
ప్రధాని హర్షం.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు
భారీ కసరత్తు తర్వాతే..
తొలుత ప్రభుత్వాలు జాబితాను పంపాలి
ఆ తర్వాత సలహా మండలి పరిశీలన
తుది జాబితా ప్రపంచ వారసత్వ కమిటీకి
10 అంశాల్లో పాసైతేనే వారసత్వ గుర్తింపు
ఇసుక పునాదులు! తేలే ఇటుకలు! రాయిని మీటితే రాగాలు! నల్ల రాతిపై సొగసైన మదనికలు! సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మ శిల్పాలు! విభిన్న రూపాల్లో వందలాది ఏనుగుల బొమ్మలు! అదరహో అనిపించే శిల్ప కళా వైభవం.. ఇప్పటికీ అబ్బుర పరిచే అప్పటి ఇంజనీరింగ్‌ టెక్నాలజీ విశ్వవిఖ్యాతమైంది! అంతర్జాతీయ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించింది! తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి గుర్తింపు లభించిన తొలి కట్టడం రామప్ప!!
రామప్పకు వెళ్లండి..
‘అద్భుతం! రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించినందుకు అందరికీ.. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ఘనకీర్తి గల కాకతీయుల అద్భుత నిర్మాణ కౌశలానికి రామప్ప ఆలయం గొప్ప ప్రతీక. ప్రజలారా.. ఈ అద్భుత ఆలయానికి వెళ్లండి. ఆలయ ఠీవిని ప్రత్యక్షంగా తిలకించి ఆ అనుభూతిని సొంతం చేసుకోండి’  
- ట్విటర్‌లో మోదీ
 à°¦à±‡à°¶à°‚లోనే ప్రత్యేకం! 
రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించడానికి మద్దతునిచ్చిన యునెస్కో సభ్య దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అత్యంత సృజనాత్మకత, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో కాకతీయులు సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద రామప్ప ఆలయం. ఇది దేశంలోనే ప్రత్యేకమైనది. స్వయం పాలనలో తెలంగాణ ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. 
- సీఎం కేసీఆర్‌
కాకతీయుల ఘనమైన శిల్పకళా వైభవానికి, అద్భుత నిర్మాణశైలికి ప్రతీక, 800 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సుప్రసిద్ధ రామప్ప ఆలయం వైపు ఇప్పుడు విశ్వమంతా అబ్బురపడి చూస్తోంది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి అరుదైన గౌరవం లభించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. చైనాలోని ఫ్యూజు వేదికగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ (యూడబ్ల్యూహెచ్‌సీ) సమావేశం వర్చువల్‌గా జరుగుతోంది. ఆదివారం సాయంత్రం 4:36 గంటలకు డబ్ల్యూహెచ్‌సీ ప్రతినిధులు రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి చేర్చారు. రామప్పకు మద్దతుగా రష్యా సహా 17 దేశాలు ఓటు వేశాయి. రామప్పకు అరుదైన గుర్తింపు లభించడం పట్ల తెలంగాణ సహా దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. 
ఎంపికలో నాటకీయ పరిణామాలు
ఇప్పటికే పలుమార్లు యునెస్కోకు నామినేట్‌ అయిన రామప్పకు ఈసారి ‘గుర్తింపు’ అంత తేలిగ్గా ఏమీ లభించలేదు. రామప్ప ఎంపిక పరంగా సమావేశంలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ వారసత్వ జాబితాలోకి రామప్పను చేర్చడాన్ని నార్వే  వ్యతిరేకించింది. రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు తొమ్మిది లోపాలు ఉన్నట్లుగా 2019లో పాలంపేటను సందర్శించిన పురావస్తు కట్టడాలు, క్షేత్రాల అంతర్జాతీయ మండలి (ఐసీవోఎంవోఎస్‌) ప్రతినిధులు తమ నివేదికలో ప్రస్తావించారు. అయితే తక్షణమే రామప్పను వారసత్వ కట్టడంగా గుర్తించేలా రష్యా ప్రత్యేక చొరవ తీసుకుంది. 2019 నాటి ఐసీవోఎంవోఎస్‌ నివేదికను తోసిరాజని 22.7 నిబంధన కింద రామప్పను కట్టడాల నామినేషన్లలో పరిగణనలోకి తీసుకునేలా చేసింది. అటు భారత్‌ కూడా దౌత్య పద్ధతిలో రాయబారం నెరిపింది. చారిత్రక కట్టడాలను ఎంపిక చేసేందుకు విచ్చేసిన ప్రతినిధుల తాలూకు 24 దేశాలకు చారిత్రక కట్టడంగా రామప్ప విశిష్టత గురించి వివరించింది. ఇది ఫలితాన్నిచ్చింది.
రామప్పకు మద్దతుగా 24 దేశాల్లో రష్యా సహా ఇథియోపియా, ఒమన్‌, బ్రెజిల్‌, ఈజిప్ట్‌, స్పెయిన్‌, థాయ్‌లాండ్‌, హంగరీ, సౌదీ అరేబియా, సౌత్‌ ఆఫ్రికా తదితర 17 దేశాలు ఓట్లు వేశాయి. 2019లో భారత్‌ నుంచి యునెస్కోకు రామప్ప ఆలయం ఒక్కటే నామినేట్‌ అయింది. రామప్పకు మనదేశం నుంచి ఇతర కట్టడాలేవీ పోటీలో లేకపోవడమూ కలిసొచ్చింది. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం తొమ్మిదేళ్లుగా ప్రయత్నాలు సాగాయి. రామప్ప తొలిసారిగా 2012లో యునెస్కోకు నామినేట్‌ అయింà°

Related Keywords

Norway , India , China , Saudi Arabia , Ellora Caves , Maharashtra , Russia , Telangana , Andhra Pradesh , Tamil Nadu , , International Heritage , Heritage Committee Main , Heritage Committee , Heritage Center It , International Nature , International Council , Prime Minister , Telugu States Similar , Heritage United Nations Education , Prime Minister Modi , Heritage Norway , United Nations , Agra Fort , நோர்வே , இந்தியா , சீனா , சவுதி அரேபியா , எல்லோரா குகைகள் , மகாராஷ்டிரா , ரஷ்யா , தெலுங்கானா , ஆந்திரா பிரதேஷ் , தமிழ் நாடு , சர்வதேச பாரம்பரியம் , பாரம்பரியம் குழு , சர்வதேச இயற்கை , சர்வதேச சபை , ப்ரைம் அமைச்சர் , ப்ரைம் அமைச்சர் மோடி , ஒன்றுபட்டது நாடுகள் ,

© 2025 Vimarsana