Live Breaking News & Updates on Ooking tips in telugu

Stay informed with the latest breaking news from Ooking tips in telugu on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Ooking tips in telugu and stay connected to the pulse of your community

పంచదారకు ప్రత్యామ్నాయాలు!

టీ కాఫీలు, పండ్ల రసాలు... ఇలా అన్నింటిలోనూ చక్కర వేస్తాం. పండగలూ, పర్వదినాలూ అంటూ స్వీట్లు లాగిస్తాం. వీటన్నింటిలోనూ చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu , Ear-vasundhara , Omen-fashions , Irls-fashions , Omen-beauty-tips

జుట్టు పెరిగేందుకు మెంతులు


జుట్టు పెరిగేందుకు మెంతులు
జుట్టు పెరిగేందుకు మెంతులు
కొంతమంది జుట్టు చిట్లిపోయి పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. ఈ వర్షాకాలం ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కప్పు నానబెట్టిన మెంతులు, కాస్త వేపాకు, కరివేపాకు కలిపి రుబ్బాలి. ఆ పేస్టును కొబ్బరి నూనెలో బాగా మరగనివ్వాలి. అది గోరు వెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి మర్దనా చేయాలి. అరగంటాగి తలస్నానం చేస్తే... చుండ్రు ఇబ్బంది తగ్గుతుంది.
* సమపాళ్లలో తీసుకున్న ఆముదం, కొబ్బరి నూనె మిశ్రమంలో పావుకప్పు మెంతులు వేసి మరిగించాలి. చల్లారాక అందులో రెండు చుక్కల లావెండర్‌ నూనె కలిపి తలకు పట్టించి మునివేళ్లతో మాడుని రుద్దాలి. ఇలా చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది. జుట్టు పెరిగేలా ఫాలికల్స్‌ పునరుత్తేజం చెందుతాయి.
* జుట్టు మరీ పల్చగా, మెరుపు తగ్గిపోయి ఇబ్బంది పెడుతుంటే... ఆవనూనెలో గుడ్డు తెల్లసొన కలిపి బాగా గిలకొట్టాలి. ఆపై అరచెక్క నిమ్మరసం పిండి వెంట్రుకలకు పట్టించాలి. పూర్తిగా ఆరాక తర్వాత తలస్నానం చేయాలి. గుడ్డులోని విటమిన్లూ, మినరల్స్‌ తలకి పట్టి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
Tags :

Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu , Ear-vasundhara , Omen-fashions , Irls-fashions , Omen-beauty-tips

స్నాక్‌..ఆరోగ్యంగా!


స్నాక్‌..ఆరోగ్యంగా!
స్నాక్‌..ఆరోగ్యంగా!
కొవిడ్‌ కారణంగా నిర్ణీత పనిగంటలంటూ లేకుండా పోయాయి. తిండి, నిద్రవేళల్లో మార్పు లొచ్చాయి. దీంతో అర్ధరాత్రులు విశ్రాంతి సమయంలో చాలామంది జంక్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారట. ఇది ఆరోగ్యంపైనే కాకుండా తర్వాతి రోజు పనిపైనా చూపుతోందనేది అధ్యయనాలు చెబుతున్న మాట. మరి ప్రత్యామ్నాయమేంటి?
బాదం, వాల్‌నట్స్‌, జీడిపప్పు, పిస్తా.. ఇలా నచ్చిన వాటిని కొద్దిగా నెయ్యిలో వేయించుకోండి. కావాలనుకుంటే కొద్దిగా ఉప్పు, మిరియాలపొడీ జోడించవచ్చు. వీటిల్లో మోనోసాచ్యురేటెడ్‌, పాలీఅన్‌సాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లతోపాటు ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. బాదం, వాల్‌నట్స్‌ మంచి నిద్రకూ సాయపడతాయి.
* మకనా లేదా తామర విత్తనాల్లో తక్కువ కొలెస్టరాల్‌ ఉంటుంది. ప్రొటీన్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మైక్రో, మాక్రో న్యూట్రియంట్లు వీటి సొంతం. కొద్దిగా ఎండబెట్టి వేయించి, చాట్‌ మసాలా కలుపుకుంటే సరి! రుచీ, ఆరోగ్యం.
* 100 గ్రాముల పెరుగుకి పావు కప్పు పండ్ల ముక్కలు, కొంత తేనె కలిపి మిక్సీ పట్టండి. ఆరోగ్యమైన స్మూతీ రెడీ.
*మీగడ తీసిన పెరుగుకి, నచ్చిన పండ్ల ముక్కలను జోడించి, డీప్‌ ఫ్రిజ్‌లో కొంతసేపు పెట్టి తినండి. ఐస్‌క్రీమ్‌ బదులుగా దీన్ని ప్రయత్నించి చూడండి. పండ్లలో శరీరానికి మేలు చేసే ఫైబర్‌, విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. అరటి, కివీ మంచి నిద్రనీ ఇస్తాయి.
Tags :

Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu , Ear-vasundhara , Omen-fashions , Irls-fashions , Omen-beauty-tips

ఆ ఫొటోకు నాలుగు గంటలు పట్టింది...

అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఆమె చేతుల్లోకి తీసుకుంటే చాలు...  కెమెరా లెన్స్‌కు ఫోజులిచ్చేస్తారు. తను కూడా ఆ బోసినవ్వులను ఫ్రేంలో బంధించడానికి గంటల తరబడి ఎదురుచూసి మరీ తాననుకున్నది సాధిస్తుంది.

Bangalore , Karnataka , India , United-states , Rajahmundry , Andhra-pradesh , Guntur , Man-new , Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu

కేంబ్రిడ్జి మెచ్చిన టీచరమ్మ!

పిల్లల జీవితాలను మార్గనిర్దేశం చేసేది ఉపాధ్యాయులే. కానీ ఆమె కేవలం దారి చూపి వదిలేయట్లేదు. ఎలా నిలదొక్కుకోవాలో కూడా నేర్పిస్తోంది. అందుకే ఆమె పిల్లల ఫేవరెట్‌ అయ్యింది.

Bangalore , Karnataka , India , Uganda , Republic-of-uganda , Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu

ఆరోగ్యానికి ఈ నాలుగు!

అన్ని వయసుల మహిళలు ఈ నాలుగు వ్యాయామాలను చేస్తూ ఆరోగ్యాన్ని పొందవచ్చు. దీనికి పది నిమిషాల నుంచి అరగంట వరకూ వెచ్చిస్తే చాలు..

Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu , Ear-vasundhara , Omen-fashions , Irls-fashions , Omen-beauty-tips

ఆటోడ్రైవరు కూతురు.. ఆక్సిజన్‌ అందిస్తోంది

ఆమెది సాధారణ కుటుంబం. తండ్రి ఆటోడ్రైవర్‌. ఈ కొవిడ్‌ సమయంలో తనూ సాయం చేయాలనుకుంది. ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్న వారికి సిలిండర్లు సరఫరా చేస్తోంది. ఆమే.. హబీ బున్నిసా.

Bangalore , Karnataka , India , College-itis , Eenadu-vasundhara , Uccessful-women-stories-in-telugu , Eauty-tips-in-telugu , Omen-health-tips-in-telugu , Omen-fitness-tips-in-telugu , Ooking-tips-in-telugu , Omen-diet-tips-in-telugu

సముద్రానికి అండ!


సముద్రానికి అండ!
మార్పు కోరుకుంటే సరిపోదు... ఆ దిశగా అడుగులు వేయగలగాలి! అందుకోసం పెద్ద చదువులు అక్కర్లేదు... ఆశయం గట్టిదై ఉండాలి. అందుకు ఉదాహరణ తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన తాడి దీపిక. తొమ్మిదో తరగతి మాత్రమే చదువుకున్న ఈవిడ సముద్ర కాలుష్యంపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తోంది. ఆ చొరవే... ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ఆన్‌లైన్‌ కార్యక్రమంలో మన దేశం తరఫున పాల్గొనే అవకాశాన్ని అందించింది. ఆ వివరాలు ఆమె మాటల్లో...
సమస్త జీవులకు నీరే ప్రాణాధారం. అలాంటి నీటికి కాలుష్యంతో వచ్చే అనర్థాలు ఇన్నీ అన్నీ కావు. సముద్ర జలాలు విషతుల్యాలమై పెరిగి మానవాళి మనుగడ సంక్లిష్టంగా మార్చేశాయి. ముఖ్యంగా మత్స్య సంపద కాలుష్య కోరల్లో పడి విలవిల్లాడిపోతోంది. వాతావరణ పరిస్థితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది అని సంస్థ ప్రతినిధులు చెప్పిన మాటలు నన్ను ఆలోచింపజేశాయి. ఈ దిశగా అందరిలోనూ చైతన్యం కలిగించాలని నిర్ణయించుకున్నా. నేను తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నా. మా వారు ప్రదీప్‌తో కలిసి వ్యవసాయ పనులు చేసుకునేదాన్ని. పర్యావరణ కాలుష్యం, రసాయన పంటల గురించి చాలాసార్లు విన్నప్పటికీ ఎలా అడ్డుకట్ట వేయాలో తెలిసేది కాదు. మా ఊరు అంతర్వేది సాగర సంగమ ప్రదేశంగానే కాకుండా ప్రసిద్ధ లక్ష్మీనృసింహ దివ్యక్షేత్రం కూడా. నిత్యం భక్తులు, పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఫిషింగ్‌ హార్బర్‌ ఉంది. పెద్ద సంఖ్యలో మత్స్యకారులు చేపల వేటకొస్తుంటారు. ఇక్కడే అసలు సమస్య ఉంది. వీటన్నింటి వల్ల అందమైన మా ఊరి సాగర తీరం కలుషితమైపోయింది. దీనికి ప్రధాన కారణం ప్లాస్టిక్‌ వ్యర్థాలే. ఇవి నదీ జలాల ద్వారా సముద్రంలోకి పెద్ద ఎత్తున చేరడంతో నీళ్లు విషతుల్యమవుతున్నాయి. దీని ప్రభావం మత్స్య సంపదపైనా పడింది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. గత ఫిబ్రవరిలో మా ఊరిలో గ్రీన్‌ వార్మ్‌, స్మార్ట్‌ విలేజ్‌ మూవ్‌మెంట్‌ సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సహకారంతో జీరో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. స్వతహాగా పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి ఉన్న మేం మొదట ఉపాధి కోసమే ఇందులో చేరాం.
ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి...
గ్రామంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి కేంద్రానికి తీసుకురావడం నిత్యం మా పని. ప్లాస్టిక్‌ ఇంత హాని చేస్తుందని నాకు అప్పటి వరకూ తెలియదు. తెలిశాక తీరంలో ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నివారించేందుకు నా బాధ్యతగా చొరవ తీసుకున్నాను. స్థానిక నిర్వాహకులు, ప్రతినిధులు చెప్పిన విషయాలన్నీ ఆకళింపు చేసుకున్నా. అదే నాకు ఈ రోజు ఈ గొప్ప అవకాశాన్ని తెచ్చిపెట్టింది. మరెన్నో విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించింది. గ్రీన్‌వార్మ్‌ ప్రాంతీయ ప్రతినిధి అక్షయ్‌ గుంటేటి, సమన్వయకర్త గంటా సునీల్‌, స్మార్ట్‌ విలేజ్‌ మూవ్‌మెంట్‌ రాష్ట్ర డైరెక్టర్‌ వై.ఎస్‌.మైఖేల్‌ ప్రోత్సాహంతో నా భర్తతో కలిసి గ్రామంలో ప్లాస్లిక్‌ వ్యర్థాలను సమూలంగా నిర్మూలించే దిశగా కార్యాచరణ చేపట్టాను. ఇళ్లు, దుకాణాల దగ్గర కూడళ్లలో, బీచ్‌ల్లో వ్యర్థాల కోసం ప్రత్యేకంగా ఇనుప బుట్టలను ఏర్పాటు చేశాం. అందులోని చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి జీరో వేస్ట్‌ కేంద్రానికి తీసుకొచ్చి వాటిని విభజిస్తున్నాం. ప్రస్తుతం ఎక్కడా వ్యర్థాలు కనిపించడం లేదు. తీరం ఆహ్లాదకరంగా మారుతోంది. మాకు ఇద్దరు పిల్లలు అబ్బాయి కెన్నీబాబు పది, అమ్మాయి బ్లెస్సీ నాలుగో తరగతి చదువుతున్నారు. వారిని బాగా చదివించడం, మా కృషిని విస్తరించడం మా లక్ష్యం. మేం చేస్తున్న పనితో భవిష్యత్తు తరాలూ బాగుంటాయనేది మా ఆలోచన.
- కె.త్రినాథస్వామి, మామిడికుదురు
- సీహెచ్‌.నరసింహస్వామి, అంతర్వేది
Tags :

సమ-ద-ర-న-క- , Enadu , Vasundhara , Rticle , Eneral , 002 , 21114621 , Ea , Plastic , Wastage , Sour

మందులు, ఆక్సిజన్‌, బెడ్‌... పేదలకు ఉచితమిక్కడ!


మందులు, ఆక్సిజన్‌, బెడ్‌... పేదలకు ఉచితమిక్కడ!
రెండు రకాల టిఫిన్లు, ఏ పూటకాపూట మారే మెనూ! దుస్తులు ఉతికేందుకు వాషింగ్‌ మెషిన్లు... ఇరవై నాలుగ్గంటలూ పర్యవేక్షించే డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది... అందుబాటులో అంబులెన్సులూ, మందులూ, ఆక్సిజన్‌ సిలిండర్లూ... ఈ సౌకర్యాలన్నీ ఏ కార్పొరేట్‌ ఆసుపత్రి ప్రాంగణంలోనే అనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఇవి... నిలువ నీడలేక, చూసుకునే దిక్కులేని పేదలకోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉచిత ఐసోలేషన్‌ కేంద్రాల్లోని సౌకర్యాలు. వీటి ఏర్పాటు వెనక ఉన్నది హోప్‌ఫర్‌లైఫ్‌ ఫౌండేషన్‌ హిమజ, ప్యూర్‌ సంస్థ సంధ్య గోళ్లమూడి. ఆ వివరాలు వారి మాటల్లోనే....
వైద్యసిబ్బంది పర్యవేక్షణలో...
- హిమజ, నిర్వాహకురాలు, హోప్‌ఫర్‌ లైఫ్‌
కరోనా మొదటి వేవ్‌లో అనాథాశ్రమాలు, నిరుపేదలకు... నిత్యావసరాలు, శానిటరీ న్యాప్‌కిన్లు ఉచితంగా అందించేదాన్ని. రెండో దశలో పరిస్థితి మారిపోయింది. మందుల కొరత పెద్ద ఎత్తున కనిపించింది. దాంతో వాటినీ కిట్లలా తయారుచేసి పంపిణీ చేయడం మొదలుపెట్టా. అప్పుడు బస్తీల్లో నివసించే కొందరు మాకూ ఇప్పించండని అడిగారు. వారి పరిస్థితి ఆరాతీస్తే... రోగులతో సహా కుటుంబం మొత్తం ఒకే గదిలో సర్దుకుపోతున్నారని తెలిసింది. ఎంతో మంది అలాంటి దుస్థితిలోనే నివసిస్తున్నారని తెలుసుకున్నా. వాళ్లకోసం ఏం చేయగలనా అని ఆలోచిస్తున్నప్పుడు దిశ ఫౌండేషన్‌ నిర్వాహకురాలు సుస్మిత ఫోన్‌ చేసి తక్కువ, మధ్యస్థ లక్షణాలు ఉండి, ఇంట్లో చికిత్స తీసుకోలేని వ్యక్తులకు ఉచితంగా ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగలవేమో ఆలోచించు అంది. కానీ ఇది ఆషామాషీ కాదు. భవనం, బెడ్లు, మందులు... ఇలా బోలెడు అంశాలకు అనుమతులు కావాలి. రోగులను కంటికి రెప్పలా కాచుకోవాలి. వైద్య సిబ్బందిని నియమించుకోవాలి. వీటన్నింటి కోసమూ అవసరమైతే యుద్ధమూ చేయాలి.
వీడియోకాల్స్‌తో పర్యవేక్షణ...
ఎన్నో పనులు చేస్తున్నాం... ఇది మాత్రం ఎందుకు చేయలేం అనుకుని ముందడుగు వేశాం. ఈ కార్యక్రమంలో దిశతో పాటు అభయం ఫౌండేషన్‌ కూడా సహకారమందిస్తోంది. అల్వాల్‌, కేపీహెచ్‌బీలలో రెండు కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశాం. ఒక్కో భవనానికి వంద బెడ్‌ల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం నలభై పడకలతో ఈ కేంద్రాల్ని నిర్వహిస్తున్నాం. మరికొందరికి మందులు, ఆన్‌లైన్‌ వైద్య సేవలు అందిస్తున్నాం. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి కేంద్రాలను పెడదామనుకున్నా... స్థానికుల వ్యతిరేకత, ఇతరత్రా సమస్యలు ఎదురయ్యాయి. అందువల్ల జీహెచ్‌ఎంసీ సహకారంతో కమ్యూనిటీ భవనాల్లో ఈ రెండింటినీ ఏర్పాటు చేశాం. నలుగురు డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించుకున్నాం. మందులు, ఆహారం ఉచితం. మరికొంతమంది డాక్టర్లు షిప్టుల వారీగా రోగులతో వీడియో కాల్స్‌ మాట్లాడుతుంటారు. అత్యవసరమైతే రోగులను తరలించేందుకు నాలుగు కార్పొరేట్‌ ఆసుపత్రులతో టైఅప్‌ అయ్యాం. అంబులెన్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచాం. పోస్ట్‌ కొవిడ్‌ పేషెంట్లకు ఆక్సిజన్‌ ఇబ్బందులు లేకుండా సాయం చేస్తున్నాం.
మేమేం చేస్తామంటే...
నేనో ప్రైవేట్‌ ఉద్యోగినిని. కుటుంబ పరిస్థితుల వల్ల అమ్మమ్మ నన్ను అనాథాశ్రమంలో ఉంచి చదివించింది. తోటివారిని ప్రేమించడం అక్కడే మొదలుపెట్టా. ఆరేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మా హోప్‌ఫర్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ పనిచేస్తోంది. ఆరోగ్యం, విద్య అనే అంశాలపై ప్రాథమికంగా పనిచేస్తుంది. రెండు రాష్ట్రాల్లోనూ సుమారు 4500 మంది చిన్నారులను మా సంస్థ చదివిస్తోంది. క్యాన్సర్‌, లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి సమస్యలతో బాధపడే నిరుపేద రోగులకు చికిత్స చేయిస్తున్నాం. ప్రతినెలా ఖమ్మం, భద్రాచలం, మన్యం ప్రాంతాల్లోని నాలుగువేలమంది మహిళలకు శానిటరీ ప్యాడ్లను ఉచితంగా ఇస్తున్నాం. మధ్యలోనే చదువు ఆపేసిన ఆడపిల్లలకు వృత్తివిద్యాశిక్షణ అందిస్తున్నాం. తెలుగురాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ సాగుతున్నాయి. ఇందుకు నిధులను సామాజిక మాధ్యమాలు, స్నేహితుల సాయంతో సేకరిస్తున్నా.
హెల్ప్‌లైన్‌ :
9182735664
ఏ రోజుకారోజు మారే మెనూతో!
- సంధ్య గోళ్లమూడి, నిర్వాహకురాలు, ప్యూర్‌ సంస్థ
కరోనా విపత్తునుంచి గట్టెక్కాలంటే ఒకరికొకరు తోడుగా నిలబడాలి. గతేడాది లాక్‌డౌన్‌ కాలంలో వలసకార్మికుల కోసం పండ్లు, ఆహారాన్ని అందించాం. కొందరిని సొంతూళ్లకు పంపించాం. రెండో వేవ్‌లో మా అవసరం... తగిన చికిత్స, ఆలనా పాలనకు నోచుకోని ఆపన్నులకు ఉందని భావించాం. అందుకే ఉచిత కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకున్నాం. చాలా కుటుంబాలు ఒకే గది ఉన్న ఇంట్లో నివసిస్తున్నాయి. తమ వల్ల మిగిలిన వారికీ వైరస్‌ వ్యాపిస్తుందనే భయంతో కొందరు ఫుట్‌పాత్‌ల మీదే తలదాచుకుంటున్నారు. ఇంకొందరిని కుటుంబ సభ్యులు, ఇంటి యజమానులు లోనికి రానివ్వడం లేదు... అలాంటి వారికి తగిన సౌకర్యాలతో ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. హైదరాబాద్‌లో రెండు కేంద్రాల్ని ఏర్పాటు చేశాం. ఒకటి బండ్లగూడ జాగీర్‌లో, మరొకటి పాతబస్తీలోని హుస్సేనీ ఆలంలో. వీటికి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రత్యేక అనుమతులు తీసుకున్నాం.
గుడ్డుతో మెనూ...
ఈ సెంటర్లలో సేవలన్నీ ఉచితమే. నిత్యం డాక్టర్లు, నర్సులు, ఆయాలు.... అందుబాటులో ఉంటారు. ఓ మేనేజర్‌నీ ఏర్పాటు చేశాం. రోగులు కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చేయొచ్చు. రాగానే ఓ బుట్ట చేతికిస్తాం. అందులో దుస్తుల నుంచి బ్రష్‌ వరకూ అన్నీ ఉంటాయి. మందులు, పోషకాహారం వంటివన్నీ మూడు పూటలా అందిస్తాం. ఇడ్లీ, ఉప్మా, రాగి, అంబలి, పండ్లు, గుడ్డు వంటివన్నీ మెనూలో ఉంటాయి. రోగుల దుస్తులు ఉతికేందుకు ప్రత్యేకంగా వాషింగ్‌ మెషిన్లనూ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ సూచనల ప్రకారం 93 శాతం కంటే ఎక్కువ ఆక్సిజన్‌ లెవెల్స్‌ ఉన్నవారిని మాత్రమే ఇక్కడ చేర్చుకుంటున్నాం. అంబులెన్స్‌లు, ఆక్సిజన్‌ సిలిండర్లతో సహా కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నాం. వంద పడకల సామర్థ్యం గల ఈ కేంద్రాల్లో ప్రస్తుతం 40 మంది చొప్పున బాధితులకు సేవలందిస్తున్నాం. మా ప్యూర్‌ సంస్థ దేశవ్యాప్తంగా విద్యాసౌకర్యాల కల్పనకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ఇందుకు అవసరమైన నిధులను విదేశంలో ఉండే మా అమ్మాయి శైల తాళ్లూరి, ఆమె స్నేహితులు అందిస్తున్నారు.
హెల్ప్‌లైన్‌ :
7386140040, 7075940040
మంచిమాట
మహిళలకు భద్రత ఎప్పుడూ ఉండదు. మీరు సురక్షితంగా ఉన్నామని అపోహ పడకండి. అప్రమత్తతే రక్ష.
- శశి దేశ్‌పాండే, రచయిత్రి
Tags :

మ-ద-ల- , Enadu , Vasundhara , Rticle , Eneral , 001 , 21114632 , Edicines , Bed , Oxygen , Women

Health Tips: మెంతులు... ప్రయోజనాలు బోలెడు

మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మహిళలకు మరీ మంచిది. రోజూ తీసుకుంటే మేలంటున్నారు నిపుణులు... Health Tips: మెంతులు... ప్రయోజనాలు బోలెడు

Health , Ips-మ-త-ల , Enadu , Vasundhara , Rticle , Eneral , 002 , 21113143 , Ill , Uses , Huse