Live Breaking News & Updates on ఈన డ

Stay informed with the latest breaking news from ఈన డ on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in ఈన డ and stay connected to the pulse of your community

ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime

Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery. ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime

ఈన-డ , Hotos , Elugu , Ews , Ovies , P , Elangana , Olitical , Ports , Rime , Enadu

ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime

Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery. ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime

ఈన-డ , Hotos , Elugu , Ews , Ovies , P , Elangana , Olitical , Ports , Rime , Enadu

ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime


శుక్రవారం, జూన్ 11, 2021
కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అనుమానితులకు ఇళ్ల వద్దే మందులు పంపిణీ చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌ నారాయణగూడలోని బీసీ భవన్‌లో వైద్య ఆరోగ్య సిబ్బంది మందుల కిట్లను తయారు చేస్తున్నారు. వీటిని హైదరాబాద్‌తో పాటు జిల్లాలకు వాహనాల ద్వారా తరలిస్తున్నారు. -ఈనాడు, హైదరాబాద్‌
బ్యాంకు వద్దకు వెళ్లి డబ్బు కట్టాలన్నా.. తీసుకోవాలన్నా మహిళలు, ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా గుంపుగా ఉంటున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాల కోసం ఒకేసారి వస్తుండడంతో రద్దీగా కనిపిస్తోంది. కానూరు ఇండియన్‌ బ్యాంకు వద్ద కనిపించిన దృశ్యమిది. -ఈనాడు, అమరావతి
సీఎం పర్యటన నేపథ్యంలో తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో 20 నిమిషాల పాటు ట్రాఫిక్‌ నిలిపివేశారు. దీంతో కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్సు. -ఈనాడు, విజయవాడ
కర్ఫ్యూ కారణంగా మధ్యాహ్నం 12గంటల వరకే బయట తిరగడానికి అనుమతి ఉంది. దీంతో ప్రజలు ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా తమకు కావాల్సిన ఆహారాన్ని తెప్పించుకుంటున్నారు. డెలివరీ బాయ్స్‌ తమ ఆర్డర్ల పార్సిల్స్‌ కోసం ఇదిగో ఇలా పోటీ పడుతున్నారు. -ఈనాడు, అమరావతి
ప్రభుత్వాసుపత్రిలో చేరాలంటే ముందుగా ఓపీ చీటీ తప్పనిసరి. మరి ఆ ఓపీ రాసే కౌంటరు ఎక్కడుందీ.. ఇదే కొవిడ్‌ ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగికీ ఎదురవుతున్న ప్రశ్న. కనీసం బోర్డు కూడా లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఈ రోగికి ఓపీ రాయించడానికి వెళ్లిన బంధువులకు ఇదే పరిస్థితి ఎదురైంది. సిబ్బంది కూడా సమాధానం చెప్పేందుకు విసుక్కున్నారు. ఆస్పత్రిలో పడకలు ఖాళీగా ఉన్నా ఇచ్చేందుకు గంటకు పైగా సమయం పట్టింది. అప్పటి వరకు క్యాజువాలిటీ వద్ద బయట అంబులెన్సులోనే రోగికి ఆక్సిజన్‌ అందించారు. -ఈనాడు, విజయవాడ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు
ఈమె పేరు సునీత. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా. వెండితెరపై వెలగాలన్న కలతో పదేళ్ల క్రితం హైదరాబాద్‌ తరలివచ్చారు. చిన్న చిన్న అవకాశాలు పొందారు. ఇప్పటివరకు 50 పైగా చిత్రాల్లో చిన్న వేషాలు వేశారు. కరోనా ఆమె కథను మార్చేసింది. సొంతూరికి తిరిగి వెళ్లలేక.. పొట్టకూటికి పాట్లు పడుతున్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో గురువారం ఇలా ఫుట్‌పాత్‌పై పుచ్చకాయలు విక్రయిస్తూ కనిపించారు.
కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరిగా మారింది. దీనిని పరిగణలోకి తీసుకొని ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికి వరంగల్‌ నగరపాలక సంస్థ విస్తృత ప్రచారం చేపట్టింది. ఈ క్రమంలోనే బల్దియా అధికారులు హన్మకొండలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ కూడలిలో మాస్క్‌ ధరించిన ఓ పెద్ద బొమ్మను ఏర్పాటు చేశారు.
ఇక్కడ కనిపిస్తున్నవి నీటి కుక్కలు. శాస్త్రీయ నామం అట్టర్‌.. క్షీరద రకానికి చెందినవి. ఇప్పుడు ఇవి గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో సందడి చేస్తున్నాయి.
ద్విచక్ర వాహనాలపై చిన్నారులను తీసుకువెళ్లే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చైతన్యపురి వద్ద ఓ వ్యక్తి బాలుడిని బెల్టుతో తన నడుముకు కట్టుకుని స్కూటరుపై తీసుకువెళుతూ ఇలా కనిపించారు.
ఒకవైపు చకచకా పూర్తవుతోంది. మరోవైపు ఎదుగుబొదుగు లేకుండా అక్కడే ఆగిపోయింది. చింతల్‌కుంట వైపు నుంచి ఎల్‌బీ నగర్‌ వైపు నిర్మిస్తున్న పైవంతెన పరిస్థితి ఇది. వాహనాలు దిగాల్సిన వైపు పనుల్లో జాప్యం వల్ల ఇప్పట్లో ఇది అందుబాటులోకి వచ్చేలా లేదు.
బాలానగర్‌లోని నర్సాపూర్‌ చౌరస్తా పేరు చెప్పగానే కిటకిటలాడే ట్రాఫిక్‌ గుర్తుకొస్తుంది. ఆ కూడలి దాటాలంటే నరకం కన్పిస్తున్న పరిస్థితి. ఈ కష్టాలు తీర్చడానికి రూ.330 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పైవంతెన దాదాపు పూర్తికావచ్చింది. తుది మెరుగులద్దుతున్నారు.
మణికొండ పరిధి ల్యాంకోహిల్స్‌లోని చెరువు మొన్నటి వరకు మురుగు, గుర్రపుడెక్కతో నిండి మైదానాన్ని తలపించేది. ఇటీవల ‘ఈనాడు’లో ప్రచురితమైన చిత్రవార్తకు స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో తటాకం నీటితో కళకళలాడుతోంది.
లాక్‌డౌన్‌తో మూతబడ్డ చిరు వ్యాపారాలు.. గురువారం నుంచి సడలింపు సమయం పెంచడంతో తెరుచుకున్నాయి. సాయంత్రం వరకు వ్యాపారాలు కొనసాగడంతో కొంత సంతోషం వ్యక్తం చేశారు. నల్లకుంటలో చెప్పుల దుకాణం తెరిచి పనిలో నిమగ్నమైన మహిళ.
మలక్‌పేట రైల్వే వంతెన పనుల్లో భాగంగా భారీ ఇనుప కడ్డీని తొలగించారు. కానీ దానిని అక్కడే రోడ్డు పక్కన పడేశారు. ఇనుప కడ్డీ పూర్తిగా మొనదేలి ఉండడంతో అటుగా వెళ్లే వాహనదారులు పొరబాటున పడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
లాక్‌డౌన్‌ కారణంగా నగరంలోని యాచకులు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు సంస్థలు అందించే ఆహారం వీరికి దిక్కయ్యింది. సికింద్రాబాద్‌లో ఓ సంస్థ సభ్యులు పీపీఈ కిట్లు ధరించి వృద్ధుడికి భోజన ప్యాకెట్‌ అందిస్తూ కనిపించారు.
మరిన్ని

ఈన-డ , Hotos , Elugu , Ews , Ovies , P , Elangana , Olitical , Ports , Rime , Enadu

ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime

Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery. ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime

ఈన-డ , Hotos , Elugu , Ews , Ovies , P , Elangana , Olitical , Ports , Rime , Enadu

ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime

Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery. ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime

ఈన-డ , Hotos , Elugu , Ews , Ovies , P , Elangana , Olitical , Ports , Rime , Enadu

ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime


శుక్రవారం, మే 21, 2021
అనంతపురం సర్వజనాసుపత్రిలో పడకల కొరతకు ఈ చిత్రమే నిదర్శనం. కొవిడ్‌ ఓపీ కేంద్రంలో నిత్యం ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు చికిత్స పొందుతున్నారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అయినా అధికారులు, నాయకుల్లో చలనం రావడం లేదు. ఇప్పటికైనా పడకల సంఖ్య పెంచి, మెరుగైన వైద్యం అందించాలని బాధితులు కోరుతున్నారు.
కరోనా మహమ్మారి మానవ బంధాలను తుంచేస్తోంది.. సంబంధాలను తెంచేస్తోంది.. ఏ కారణం చేతనైనా మనిషి మృతి చెందితే అంతిమయాత్ర బంధుమిత్రుల బాధాతప్త హృదయాలతో సాగేది. ఆఖరి మజిలీ చూసిన ప్రతి ఒక్కరూ అయ్యోపాపం ఎవరో పోయారే అనుకునేవారు. వైరస్‌ మహమ్మారి దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతుంటే రక్తసంబంధీకులు సైతం దూరంగా ఉండిపోతున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో గురువారం కనిపించిన ఈ చిత్రమే ఉదాహరణ. కనీసం నలుగురితో సాగాల్సిన అంతిమయాత్ర ఇలా ఇద్దరితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైకుంఠ రథంలో తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. - న్యూస్‌టుడే, కదిరి పట్టణం
ప్లాస్టిక్‌ షీల్డ్‌తో సహా వచ్చిన ఈ మాస్కు అందరినీ ఆకట్టుకుంటోంది. విజయవాడ రామలింగేశ్వరనగర్‌లోని ఓ చిరువ్యాపారి వినూత్నంగా ఉన్న ఈ మాస్కు పెట్టుకొని కనిపించారు. -ఈనాడు, అమరావతి
ఊహ తెలియని వయసులో తండ్రిని కోల్పోయి, తల్లి సంరక్షణలో పెరుగుతున్న ఆ ఇద్దరు అమ్మాయిలకు కరోనా మహమ్మారి ఇప్పుడు అమ్మనూ దూరం చేసింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన కవితకు ఇద్దరు కుమార్తెలు. పిల్లలు పుట్టిన కొన్నాళ్లకే భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె కూలీనాలీ చేసుకుంటూ కష్టపడి కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద అమ్మాయి మౌనిక హోటల్‌ మేనేజ్‌మెంట్, చిన్నమ్మాయి యామిని ఇంటర్‌ చదువుతున్నారు. ఈనెల 5న కవిత(52)ను కరోనా బలి తీసుకుంది. దీంతో ఇద్దరికీ పెద్ద దిక్కు లేకుండా పోయింది. పక్షవాతంతో మంచానికే పరిమితమైన నానమ్మ, తాతకు సేవలు చేస్తూ ఆదుకునే వారి కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబం గడిచేదెలా? చదువులు సాగేదెలా? అన్నది వారిని తీవ్రంగా కలచివేస్తోంది.
మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెంలో గురువారం విద్యుదాఘాతంతో 8 పశువులు మృత్యువాత పడ్డాయి. వ్యవసాయానికి జీవనాధారమైన ఆ పశువుల మృతితో బాధిత రైతులు గుండెలవిసేలా రోదించారు. రైతు బానోత్‌ బాలు కుటుంబసభ్యులు మృతి చెందిన ఎద్దుపై పడి రోదిస్తున్న దృశ్యం అక్కడి హృదయాలను పిండేసింది. ఇదే మండలం వస్రాంతండా, లాస్యతండాల్లోని ఏడుగురు రైతులకు చెందిన ఎనిమిది పశువులు పార్వతమ్మగూడెంలోని మిరప చేనులోకి మేతకు వెళ్లాయి. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తెగిన విద్యుత్‌ తీగలు తాకడంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి.
నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బ్లాక్‌ఫంగస్‌ బాధితుల తాకిడి పెరుగుతోంది. కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో గురువారం ఒక్కరోజే 39 మంది చేరారు. ఇప్పటికే ఇక్కడ 90 మంది వరకు చేరారు. ఏడుగురికి శస్త్ర చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. గాంధీలో ఇదే వ్యాధితో 23 మంది చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో కోఠి ఈఎన్‌టీలో పడకలకు కొరత ఏర్పడుతోంది. దీంతో ఆసుపత్రి ఆవరణలో బ్లాక్‌ఫంగస్‌ బాధితులు పడిగాపులు కాస్తున్నారు.
కేదారేశ్వరపేట రైతు బజారు ముందున్న ఈ వాహనాలను చూస్తే లోపల జనం ఎంత మంది ఉన్నారో అంచనా వేయొచ్చు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు అనుమతి ఉండడంతో ఎటు చూసినా రోడ్లు జనాలు, వాహనాలతో రద్దీగా మారాయి. -ఈనాడు, అమరావతి
కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో కొవిడ్‌ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సిబ్బంది కంటే ఉందే కరోనా బాధితులు కేంద్రానికి చేరుకుని చెప్పులను వరుసలో ఉంచి వారు సామాజిక దూరం పాటిస్తూ పక్కన కూర్చుంటున్నారు. -న్యూస్‌టుడే, తిమ్మాపూర్‌
కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కోవెలకుంట్లలోని పాత తహసీల్దార్‌ కార్యాలయంలో కొండచిలువ గురువారం కలకలం సృష్టించింది. బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన ఈ కార్యాలయంలో ప్రస్తుతం రెవెన్యూ అధికారులు రికార్డులు భద్రపరుస్తున్నారు. ఓ గదిలో కొండచిలువ సుమారు 70 గుడ్లను పొదిగి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే పాములు పట్టే వ్యక్తిని పిలిపించి పామును, గుడ్లను బయటకు తీశారు. బనగానపల్లి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కొండచిలువను, గుడ్లను తీసుకెళ్లారు.
ప్రకృతి అందాలకు నెలవు అవిభక్త కొరాపుట్‌ జిల్లా. ఎత్తయిన పర్వత శిఖరాలు, పచ్చని కొండల నడుమ ప్రకృతి అందాలు సందర్శకులను దశాబ్దాలుగా అలరిస్తున్నాయి. లమతాపుట్‌, నందపూర్‌ సమితుల్లో విస్తరించి ఉన్న కొల్లాబ్‌ జలాశయం ప్రాంతంలో మేఘాలు నూతన అందాలను సంతరించుకుంటున్నాయి. గురువారం సిందిపుట్‌ నది ఒడ్డు నుంచి చూస్తే మబ్బులు నింగిలో మాయ చేస్తున్న మాదిరిగా దర్శనమిచ్చాయి. - మాచ్‌ఖండ్‌, న్యూస్‌టుడే
ప్రతి ఆదివారం పట్నా రైలులో బిహార్‌ నుంచి వందల సంఖ్యలో వలస కూలీలు ఆదిలాబాద్‌ చేరుకునేవారు. ఇక్కడి నుంచి తెలంగాణలోని పలు జిల్లాలకు పనులు చేసేందుకు వెళ్లేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తుండటంతో పనులు నిలిచిపోయాయి. 10 రోజుల తరువాత లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారని భావించి.. తమ వద్ద ఉన్న కాసిన్ని డబ్బులతో గడుపుతూ వచ్చారు. లాక్‌డౌన్‌ను ప్రభుత్వం పొడిగించడంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. చేద్దామంటే పని దొరకడం లేదు. చేతిలో డబ్బులు లేవు. రెండు రోజులుగా దాతలు ఇచ్చిన ఆహారంతో కడుపు నింపుకొన్నారు. ఇక సొంతూళ్లకు వెళ్లడమే మేలని భావించి గురువారం ఆదిలాబాద్‌ నుంచి పట్నా రైలులో బయలుదేరి వెళ్లారు.
కరోనా నేపథ్యంలో పర్యాటకుల సందడి లేకపోవటం, చేపల వేట నిషేధంతో సూర్యలంక తీరంలో కాలుష్యం చాలా వరకు తగ్గింది. జన సంచారం లేకపోవడంతో తీరంలో ఎర్ర పీతలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. పొగురు ప్రాంతానికి వెళ్లే మార్గంలో పదుల సంఖ్యలో ఎర్రపీతలు కనిపిస్తున్నాయి. - బాపట్ల, న్యూస్‌టుడే
కాకినాడలో గురువారం రాత్రిఅంబులెన్స్‌ ఢీకొని జగన్నాథపురం ప్రాంతానికి మంచినీటిని సరఫరా చేసే పైపులైను పగిలిపోయింది. 30 అడుగుల ఎత్తున నీరు విరజిమ్ముతూ అరగంటపాటు ప్రవహించింది. వేగంగా వెళ్తున్న అంబులెన్స్‌ డ్రైవర్‌ జగన్నాథపురం పాత వంతెనపై ఉన్న మంచినీటి పైపులైన్ను బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. కర్ఫ్యూ కారణంగా రహదారిపై జనం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ను వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. - న్యూస్‌టుడే, గాంధీనగర్‌(కాకినాడ)
మరిన్ని

ఈన-డ , Hotos , Elugu , Ews , Ovies , P , Elangana , Olitical , Ports , Rime , Enadu

ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime


ఆదివారం, మే 09, 2021
ఈ విశ్రాంత ఉద్యోగి పేరు వెంకటరమణ కంతేటి. వయసు 64 ఏళ్లు. సికింద్రాబాద్‌ శ్రీనివాసనగర్‌ కాలనీ వాసి. ఫిబ్రవరిలో తమ పిల్లలను చూడడానికి ఇంగ్లాండ్‌ వెళ్లారు. అక్కడ మార్చి 22న ఆస్ట్రాజెనెకా(కొవిషీల్డ్‌) టీకా మొదటి డోస్‌ వేయించుకున్నారు. తర్వాత ఇండియాలోనూ రెండో డోస్‌ వేయించుకోచ్చనడంతో హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. వారికి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో రెండో డోస్‌ వేయడానికి స్థానిక సిబ్బంది నిరాకురిస్తున్నారని వాపోతున్నారు.
మల్లయ్య అనే ఈ 80 ఏళ్ల వృద్ధుడు ఇప్పటివరకూ కొవిడ్‌ మొదటి డోస్‌ టీకా వేయించుకోలేదు. శనివారం నుంచి మొదటి డోస్‌ వేయడంలేదన్న విషయం తెలియక ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉదయాన్నే వచ్చారు. అక్కడ ఎవరిని అడిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉసూరుమంటూ తిరిగి ఇంటి బాట పట్టారు.
ఉచిత అంబులెన్స్‌ సేవలతో కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు సదాశివపేటకు చెందిన సయ్యద్‌ అంజద్‌. గత ఫిబ్రవరిలో అంబులెన్స్‌ వాహనాన్ని కొని.. ఇద్దరు సిబ్బందితో దీనిని నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలున్న వారికి ప్రాధాన్యమిస్తూ సదాశివపేట నుంచి సంగారెడ్డి, హైదరాబాద్‌లలోని ఆస్పత్రులకు ఉచితంగా తీసుకెళ్తున్నారు. మరణించిన వారి మృతదేహాలనూ అంబులెన్స్‌లో ఉచితంగా తరలిస్తున్నారు.
విశాఖపట్నంలో కొవిడ్‌ టీకా రెండో డోసు కోసం శనివారం ఉదయం నుంచే ప్రజలు ఆరోగ్య కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి.
కొవిడ్‌ వైద్య సేవల్లో కీలకంగా ఉన్న సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో పలుచోట్ల ఫ్యాన్లు చెడిపోయి తిరగకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నామని రోగులు వాపోతున్నారు. కరోనాతో అసలే ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న బాధితులను ఇది మరింత వేధిస్తోంది. సిబ్బందికి చెప్పినా పట్టించుకోకపోవడంతో ఫోన్లలో కుటుంబసభ్యులకు చెప్పి టేబుల్‌ ఫ్యాన్లు తెప్పించుకుంటున్నారు. బాధితుల బంధువులు ఫ్యాన్లు కొనుగోలు చేసి ఆసుపత్రి వద్దకు వచ్చినా.. లోపలికి వెళ్లడానికి పోలీసులు అనుమతించకపోవడంతో కొందరు వెనుదిరిగారు.
చేపల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు శనివారం మహారాష్ట్రలోని సోలాపుర్‌ సమీపంలో బురద కుంటలో బోల్తా పడింది. అనంతరం ఆ కుంటలో చేపలను పట్టుకునేందుకు ఎగబడుతున్న స్థానిక ప్రజలు.
మరిన్ని

ఈన-డ , Hotos , Elugu , Ews , Ovies , P , Elangana , Olitical , Ports , Rime , Enadu

ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime

Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery. ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime

ఈన-డ , Hotos , Elugu , Ews , Ovies , P , Elangana , Olitical , Ports , Rime , Enadu

ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime


మంగళవారం, ఏప్రిల్ 20, 2021
కరోనా మహమ్మారి నివారణకు ఉద్దేశించిన వ్యాక్సిన్ల రూపంలో తయారు చేసిన కేకులు. హంగేరీలోని ఓ బేకరీలో విక్రయానికి సిద్ధంగా ఉంచారు.
దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌ సమీపంలోని పర్వతంపై కార్చిచ్చు రేగడంతో పెద్ద ఎత్తున వ్యాపించిన దట్టమైన పొగ.. మంటలు.
కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు నిర్ధారణ పరీక్షలకు, టీకా వేయించుకునేందుకు పీహెచ్‌సీలకు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు వరుస కడుతున్నారు. కొవిడ్‌ పరీక్షల కోసం విశాఖపట్నం మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పెద్ద ఎత్తున జనం రావడంతో భవనంలో ఖాళీ లేక చెట్ల కిందే నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గువాహటిలోని ఇండోర్‌స్టేడియంలో కొవిడ్‌ బాధితుల కోసం పడకలను సిద్ధం చేస్తున్న కార్మికులు.
హైదరాబాద్‌లో క్రిమి సంహరణ చర్యలు ఉద్ధృతమయ్యాయి. కోరలు చాస్తున్న కరోనాను ఇది కొంతమేర అడ్డుకుంటుందని భావిస్తున్నారు. ఎర్రగడ్డ మెట్రోస్టేషన్‌ వద్ద సోమవారం సోడియం హైపోక్లోరైట్‌ పిచికారి చేశారు.
సూక్ష్మ కళాకారిణి చటువారిమల్లి విష్ణువందన సీతారాముల కల్యాణానికి లక్షా 11 వేల 111 బియ్యపు గింజలపై శ్రీరామ అని రాసి భక్తిని చాటుకున్నారు. ఈ నెల 21న కల్యాణంలో వినియోగించేందుకు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో అందించారు.
మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌ జిల్లా చిమ్నాపూర్‌కు చెందిన రాజ్‌పండిత్‌కు చెందిన ఈ ఎద్దు పేరు బోలా. వయసు 25 సంవత్సరాలు. మూడు అడుగుల పొడవున్న కొమ్ములతో ఇది ఆకట్టుకుంటోంది. ఈ ఎద్దును ప్రతీ ఆర్నెల్లకోసారి చిలుకూరు బాలాజీ దేవాలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేయిస్తామని యజమాని తెలిపారు. సంగారెడ్డి పట్టణం మీదుగా హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా ‘ఈనాడు’ కెమెరా క్లిక్‌మనిపించింది.
కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో దాని నుంచి రక్షణ పొందేందుకు బెల్జియానికి చెందిన కళాకారుడు అలైన్‌ వెర్స్‌చురెన్‌ తలకు ‘పోర్టబుల్‌ ఒయాసిస్‌’తో బ్రస్సెల్స్‌ వీధుల్లో ప్రదర్శన చేస్తున్నాడు. కొవిడ్‌ బారిన పడకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నట్లు అలైన్‌ పేర్కొన్నాడు.
మరిన్ని

ఈన-డ , Hotos , Elugu , Ews , Ovies , P , Elangana , Olitical , Ports , Rime , Enadu

ఈనాడు : Telugu News | Latest Telugu News | Breaking Telugu News


or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the

ఈన-డ , Telugu , News , Latest , Breaking , Eenadu , Tagsrelatednews , Ap-20elections , Ap-panchayat-elections , Ap-elections , ఏప-ప-చ-యత-ఎన-న-కల