కరోనా బాధితులకు ఊపిరి పీల్చుకొనే కబురిది. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో క్రమేపీ పడకలు అందుబాటులోకి వస్తున్నాయి. మే 15 వరకు నగరంలోని ఆసుపత్రుల్లో పడకల కావాలంటే చాలా కష్టమయ్యేది. తప్పక ఇంట్లోనే చికిత్స పొందుతూ ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి మరణించిన వారు ఎందరో. ఇప్పుడు సాధారణ, ఆక్సిజన్ పడకల లభ్యత పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఐసీయూ పడకలకు మాత్రం అదే డిమాండ్ ఉందని స్పష్టం చేశారు. అయితే కొంత సమయం తరవాత అవీ కేటాయిస్తున్నామని సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. TS News: ఊపిరి పీల్చుకొనే కబురు