మందులు, ఆక&#

మందులు, ఆక్సిజన్‌, బెడ్‌... పేదలకు ఉచితమిక్కడ!


మందులు, ఆక్సిజన్‌, బెడ్‌... పేదలకు ఉచితమిక్కడ!
రెండు రకాల టిఫిన్లు, ఏ పూటకాపూట మారే మెనూ! దుస్తులు ఉతికేందుకు వాషింగ్‌ మెషిన్లు... ఇరవై నాలుగ్గంటలూ పర్యవేక్షించే డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది... అందుబాటులో అంబులెన్సులూ, మందులూ, ఆక్సిజన్‌ సిలిండర్లూ... ఈ సౌకర్యాలన్నీ ఏ కార్పొరేట్‌ ఆసుపత్రి ప్రాంగణంలోనే అనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఇవి... నిలువ నీడలేక, చూసుకునే దిక్కులేని పేదలకోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉచిత ఐసోలేషన్‌ కేంద్రాల్లోని సౌకర్యాలు. వీటి ఏర్పాటు వెనక ఉన్నది హోప్‌ఫర్‌లైఫ్‌ ఫౌండేషన్‌ హిమజ, ప్యూర్‌ సంస్థ సంధ్య గోళ్లమూడి. ఆ వివరాలు వారి మాటల్లోనే....
వైద్యసిబ్బంది పర్యవేక్షణలో...
- హిమజ, నిర్వాహకురాలు, హోప్‌ఫర్‌ లైఫ్‌
కరోనా మొదటి వేవ్‌లో అనాథాశ్రమాలు, నిరుపేదలకు... నిత్యావసరాలు, శానిటరీ న్యాప్‌కిన్లు ఉచితంగా అందించేదాన్ని. రెండో దశలో పరిస్థితి మారిపోయింది. మందుల కొరత పెద్ద ఎత్తున కనిపించింది. దాంతో వాటినీ కిట్లలా తయారుచేసి పంపిణీ చేయడం మొదలుపెట్టా. అప్పుడు బస్తీల్లో నివసించే కొందరు మాకూ ఇప్పించండని అడిగారు. వారి పరిస్థితి ఆరాతీస్తే... రోగులతో సహా కుటుంబం మొత్తం ఒకే గదిలో సర్దుకుపోతున్నారని తెలిసింది. ఎంతో మంది అలాంటి దుస్థితిలోనే నివసిస్తున్నారని తెలుసుకున్నా. వాళ్లకోసం ఏం చేయగలనా అని ఆలోచిస్తున్నప్పుడు దిశ ఫౌండేషన్‌ నిర్వాహకురాలు సుస్మిత ఫోన్‌ చేసి తక్కువ, మధ్యస్థ లక్షణాలు ఉండి, ఇంట్లో చికిత్స తీసుకోలేని వ్యక్తులకు ఉచితంగా ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగలవేమో ఆలోచించు అంది. కానీ ఇది ఆషామాషీ కాదు. భవనం, బెడ్లు, మందులు... ఇలా బోలెడు అంశాలకు అనుమతులు కావాలి. రోగులను కంటికి రెప్పలా కాచుకోవాలి. వైద్య సిబ్బందిని నియమించుకోవాలి. వీటన్నింటి కోసమూ అవసరమైతే యుద్ధమూ చేయాలి.
వీడియోకాల్స్‌తో పర్యవేక్షణ...
ఎన్నో పనులు చేస్తున్నాం... ఇది మాత్రం ఎందుకు చేయలేం అనుకుని ముందడుగు వేశాం. ఈ కార్యక్రమంలో దిశతో పాటు అభయం ఫౌండేషన్‌ కూడా సహకారమందిస్తోంది. అల్వాల్‌, కేపీహెచ్‌బీలలో రెండు కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశాం. ఒక్కో భవనానికి వంద బెడ్‌ల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం నలభై పడకలతో ఈ కేంద్రాల్ని నిర్వహిస్తున్నాం. మరికొందరికి మందులు, ఆన్‌లైన్‌ వైద్య సేవలు అందిస్తున్నాం. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి కేంద్రాలను పెడదామనుకున్నా... స్థానికుల వ్యతిరేకత, ఇతరత్రా సమస్యలు ఎదురయ్యాయి. అందువల్ల జీహెచ్‌ఎంసీ సహకారంతో కమ్యూనిటీ భవనాల్లో ఈ రెండింటినీ ఏర్పాటు చేశాం. నలుగురు డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించుకున్నాం. మందులు, ఆహారం ఉచితం. మరికొంతమంది డాక్టర్లు షిప్టుల వారీగా రోగులతో వీడియో కాల్స్‌ మాట్లాడుతుంటారు. అత్యవసరమైతే రోగులను తరలించేందుకు నాలుగు కార్పొరేట్‌ ఆసుపత్రులతో టైఅప్‌ అయ్యాం. అంబులెన్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచాం. పోస్ట్‌ కొవిడ్‌ పేషెంట్లకు ఆక్సిజన్‌ ఇబ్బందులు లేకుండా సాయం చేస్తున్నాం.
మేమేం చేస్తామంటే...
నేనో ప్రైవేట్‌ ఉద్యోగినిని. కుటుంబ పరిస్థితుల వల్ల అమ్మమ్మ నన్ను అనాథాశ్రమంలో ఉంచి చదివించింది. తోటివారిని ప్రేమించడం అక్కడే మొదలుపెట్టా. ఆరేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మా హోప్‌ఫర్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ పనిచేస్తోంది. ఆరోగ్యం, విద్య అనే అంశాలపై ప్రాథమికంగా పనిచేస్తుంది. రెండు రాష్ట్రాల్లోనూ సుమారు 4500 మంది చిన్నారులను మా సంస్థ చదివిస్తోంది. క్యాన్సర్‌, లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి సమస్యలతో బాధపడే నిరుపేద రోగులకు చికిత్స చేయిస్తున్నాం. ప్రతినెలా ఖమ్మం, భద్రాచలం, మన్యం ప్రాంతాల్లోని నాలుగువేలమంది మహిళలకు శానిటరీ ప్యాడ్లను ఉచితంగా ఇస్తున్నాం. మధ్యలోనే చదువు ఆపేసిన ఆడపిల్లలకు వృత్తివిద్యాశిక్షణ అందిస్తున్నాం. తెలుగురాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ సాగుతున్నాయి. ఇందుకు నిధులను సామాజిక మాధ్యమాలు, స్నేహితుల సాయంతో సేకరిస్తున్నా.
హెల్ప్‌లైన్‌ :
9182735664
ఏ రోజుకారోజు మారే మెనూతో!
- సంధ్య గోళ్లమూడి, నిర్వాహకురాలు, ప్యూర్‌ సంస్థ
కరోనా విపత్తునుంచి గట్టెక్కాలంటే ఒకరికొకరు తోడుగా నిలబడాలి. గతేడాది లాక్‌డౌన్‌ కాలంలో వలసకార్మికుల కోసం పండ్లు, ఆహారాన్ని అందించాం. కొందరిని సొంతూళ్లకు పంపించాం. రెండో వేవ్‌లో మా అవసరం... తగిన చికిత్స, ఆలనా పాలనకు నోచుకోని ఆపన్నులకు ఉందని భావించాం. అందుకే ఉచిత కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకున్నాం. చాలా కుటుంబాలు ఒకే గది ఉన్న ఇంట్లో నివసిస్తున్నాయి. తమ వల్ల మిగిలిన వారికీ వైరస్‌ వ్యాపిస్తుందనే భయంతో కొందరు ఫుట్‌పాత్‌ల మీదే తలదాచుకుంటున్నారు. ఇంకొందరిని కుటుంబ సభ్యులు, ఇంటి యజమానులు లోనికి రానివ్వడం లేదు... అలాంటి వారికి తగిన సౌకర్యాలతో ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. హైదరాబాద్‌లో రెండు కేంద్రాల్ని ఏర్పాటు చేశాం. ఒకటి బండ్లగూడ జాగీర్‌లో, మరొకటి పాతబస్తీలోని హుస్సేనీ ఆలంలో. వీటికి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రత్యేక అనుమతులు తీసుకున్నాం.
గుడ్డుతో మెనూ...
ఈ సెంటర్లలో సేవలన్నీ ఉచితమే. నిత్యం డాక్టర్లు, నర్సులు, ఆయాలు.... అందుబాటులో ఉంటారు. ఓ మేనేజర్‌నీ ఏర్పాటు చేశాం. రోగులు కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చేయొచ్చు. రాగానే ఓ బుట్ట చేతికిస్తాం. అందులో దుస్తుల నుంచి బ్రష్‌ వరకూ అన్నీ ఉంటాయి. మందులు, పోషకాహారం వంటివన్నీ మూడు పూటలా అందిస్తాం. ఇడ్లీ, ఉప్మా, రాగి, అంబలి, పండ్లు, గుడ్డు వంటివన్నీ మెనూలో ఉంటాయి. రోగుల దుస్తులు ఉతికేందుకు ప్రత్యేకంగా వాషింగ్‌ మెషిన్లనూ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ సూచనల ప్రకారం 93 శాతం కంటే ఎక్కువ ఆక్సిజన్‌ లెవెల్స్‌ ఉన్నవారిని మాత్రమే ఇక్కడ చేర్చుకుంటున్నాం. అంబులెన్స్‌లు, ఆక్సిజన్‌ సిలిండర్లతో సహా కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నాం. వంద పడకల సామర్థ్యం గల ఈ కేంద్రాల్లో ప్రస్తుతం 40 మంది చొప్పున బాధితులకు సేవలందిస్తున్నాం. మా ప్యూర్‌ సంస్థ దేశవ్యాప్తంగా విద్యాసౌకర్యాల కల్పనకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ఇందుకు అవసరమైన నిధులను విదేశంలో ఉండే మా అమ్మాయి శైల తాళ్లూరి, ఆమె స్నేహితులు అందిస్తున్నారు.
హెల్ప్‌లైన్‌ :
7386140040, 7075940040
మంచిమాట
మహిళలకు భద్రత ఎప్పుడూ ఉండదు. మీరు సురక్షితంగా ఉన్నామని అపోహ పడకండి. అప్రమత్తతే రక్ష.
- శశి దేశ్‌పాండే, రచయిత్రి
Tags :

Related Keywords

, మ ద ల , Enadu , Vasundhara , Article , Eneral , 001 , 21114632 , Medicines , Bed , Oxygen , Women , Poor , Free , Eenadu Vasundhara , Successful Women Stories In Telugu , Beauty Tips In Telugu , Women Health Tips In Telugu , Women Fitness Tips In Telugu , Cooking Tips In Telugu , Women Diet Tips In Telugu , Dear Vasundhara , Women Fashions , Girls Fashions , Women Beauty Tips , Women Health Problems , Parenting Tips , Child Care , Women Hair Styles , Financial Tips For Women , Legal Advice For Women , Fitness Tips , Shopping Tips , Op Stories , Elugu Top Stories , வாசுந்தர , படுக்கை , ஆக்ஸிஜந் , பெண்கள் , புவர் , இலவசம் , ஈனது வாசுந்தர ,

© 2025 Vimarsana