దిగ్గజ ప్రభుత్వరంగ సంస్థ ‘విశాఖ నౌకాశ్రయం’ ముందు ఎన్నో సవాళ్లు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో ఎదురవనున్న పరిణామాలను తట్టుకొని నిలబడగలిగేలా వ్యూహాలకు పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమయింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మితమవుతున్న పలు నౌకాశ్రయాలతో పాటు ప్రైవేటు నౌకాశ్రయాల నుంచి వచ్చే పోటీలో నిలబడితేనే దిగ్గజ సంస్థలో ఉద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. ఈ అంశంపై ఇప్పటికే అంతర్గత చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ‘ఓడ’కుండా వ్యూహముందా!?