ప్రపంచ సిఇఓలతో భేటీ వాషింగ్టన్ : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అధికారిక పర్యటన నిమిత్తం వాషింగ్టన్ చేరుకున్నారు. ఈ పర్యటనలో అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లతో మోడీ భేటీ కానున్నారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో బైడెన్ అధ్యక్షతన జరిగే క్వాడ్ శిఖరాగ్రసమావేశానికి హాజరవుతారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 76వ సమావేశాల్లో ప్రసంగించనున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో మోడీ పర్యటించడం ఇది ఏడవసారి.