Live Breaking News & Updates on Women diet tips in telugu

Stay informed with the latest breaking news from Women diet tips in telugu on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Women diet tips in telugu and stay connected to the pulse of your community

తనలాంటివారి కోసమే ఆ దుస్తులు!


తనలాంటివారి కోసమే ఆ దుస్తులు!
ఉన్నత చదువులు చదివి ఐదంకెల్లో జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని తెచ్చుకుంది.  జీవితంలో మరో అడుగు ముందుకేయాలనుకున్న సమయంలో మాయదారి అనారోగ్యం ఆమెను చుట్టుముట్టింది.  దవడ వద్ద మొదలైన అరుదైన వ్యాధి కాలివేళ్ల వరకూ వ్యాపించింది. ఉత్సాహానికి మారుపేరుగా ఉండే ఆమె.. కుర్చీకే పరిమితమైపోయింది. మరొకరి సాయం లేనిదే దుస్తులను కూడా ధరించలేని నిస్సహాయ స్థితికి చేరింది. ఆ వేదనే ఓ కొత్త ఆలోచనకు కారణమైంది తనలాంటివారి కోసం దుస్తుల డిజైన్‌ను ప్రారంభించేలా చేసింది... కోల్‌కతాకు చెందిన 34ఏళ్ల  సౌమితాబసు. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్న ఆమె గురించి తెలుసుకుందాం.
అప్పుడు సౌమితకు 21 ఏళ్లు. చదువయ్యాక ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరింది. అందరితోనూ సరదాగా ఉండే ఆమెకు అకస్మాత్తుగా ఓ రోజు దవడ ఎముకలో తెలియని అసౌకర్యం మొదలైంది. చిన్న సమస్యే కదా అనుకుంది. అది రోజురోజుకీ మిగతా అవయవాలకు పాకడం మొదలైంది. వైద్యపరీక్షల్లో అరుదైన కండరాల వ్యాధిగా తేలింది. చికిత్సకు లొంగని ఆ అనారోగ్యం ఆమె శరీరాన్ని పూర్తిగా ఆక్రమించింది. చేతులూ, కాళ్లు కూడా కదపలేని స్థితికి వచ్చింది. క్రమంగా ఆమె పూర్తిగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. ఓవైపు కదల్లేని స్థితి,  మరోవైపు ప్రతి చిన్నవిషయానికి తోటివారి సాయం తీసుకోవాల్సిన అవసరం మరింత కుంగదీశాయి.
ఆ బాధతోనే...
అప్పటివరకు సౌమిత తన దుస్తులను తానే వేసుకోవడానికి ప్రయత్నించేది. కాలం గడిచేకొద్దీ  కండరాలు సహకరించేవి కావు. లోదుస్తులు కూడా వేసుకోలేకపోయేది. దాంతో ఇంట్లోవాళ్లు చేయూతనందించేవారు. అలా వారి నుంచి సాయం తీసుకోవడం ఆమెకు ఇబ్బందిగా ఉండేది. కీళ్లు వంగేవికావు. కండరాలు సహకరించేవి కావు. అప్పుడే తన కజిన్‌కు పెళ్లి  కుదిరింది. కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లడానికి సిద్ధమైంది. తీరా ఆ వేడుకలో ధరించడానికి సరైన దుస్తులు లేవు.  టాప్స్‌ భుజాలపైనుంచి జారిపోయేవి. ఏం చేయాలో అర్థంకాలేదు. దాంతో ఆన్‌లైన్‌లో వెతికింది. ఎక్కడా తనకు సౌకర్యవంతమైన దుస్తులు మాత్రం దొరకలేదు. దాంతో పెళ్లికి వెళ్లడమే మానుకుంది. ఆ సందర్భమే  సౌమితను ఆలోచించేలా చేసింది. తనలాంటివారందరి కోసం తన వంతుగా ఏమైనా చేయాలనుకుందామె.
జైనికా పేరుతో..
దుస్తులు వేసుకోవడానికి కూడా మరొకరిపై ఆధారపడటం బాధాకరం. అంటుంది సౌమిత. ‘దివ్యాంగులు ఇలాంటి సందర్భంలో ఎంతోకొంత వేదనకు గురవుతారన్నది నిజం. ఎందుకంటే  ఇది స్వయంగా నా అనుభవం. ఆ బాధ లేకుండా చేయాలంటే సౌకర్యవంతంగా వారికి వారే ధరించడానికి వీలయ్యేలా దుస్తులను రూపొందించడమే సరైన పరిష్కారం అనిపించింది. అలా మొదలైందే... ‘జైనికా అడాప్టివ్‌  వేర్‌’. నేను దీన్ని ప్రారంభిస్తానని ఇంట్లో చెప్పినప్పుడు అభ్యంతరం చెప్పారు. చేసి చూపించాలనుకున్నా.  ముందుగా నా కోసం దుస్తులను డిజైన్‌ చేసుకున్నా. ప్రత్యేకంగా టైలర్‌ సాయంతో కుట్టించి ధరించా. అవి ఎంతో సౌకర్యవంతంగా అనిపించాయి.  ఇక నా ప్రయోగాలను మొదలుపెట్టా. ఆయా అవయవలోపానికి తగ్గట్లుగా దుస్తులను డిజైన్‌ చేసి కుట్టించేదాన్ని. చేతులు పనిచేయకపోయినా, అసలు చేతులే లేకపోయినా కూడా వీటిని సునాయాసంగా ధరించొచ్చు. వారిలోని శారీరక లోపాన్ని ఏ మాత్రం కనిపించనీయకుండా చేసేవే జైనికా డిజైన్‌ దుస్తులు. చాలామందికి చీరకట్టుకోవాలని ఉంటుంది. అలాంటివారి కోసం ప్రత్యేకంగా చీరను రూపొందించా. ఇందులో కుచ్చిళ్లు పెట్టుకోనవసరం లేదు. స్కర్టులా ధరించేయొచ్చు. దివ్యాంగులు తేలికగా తమ దుస్తులను తామే ధరించే సౌకర్యం వీటిలో ఉంటుంది. ఫలితంగా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆన్‌లైన్‌లో వినియోగదారుల అవసరాలకి తగ్గట్లుగా వారు కోరిన డిజైన్‌, వర్ణాల్లో దుస్తులు తయారు చేసి ఇస్తున్నాం. లోదుస్తులనూ ప్రత్యేకంగా చేసిస్తున్నాం. అలాగే మగవారికి కూడా మా సంస్థ డిజైన్‌ చేస్తోంది. అంతేకాదు, సెరిబ్రల్‌పాల్సీ, ఆటిజం, మానసిక సమస్యలున్న చిన్నారులకూ దుస్తులను డిజైన్‌ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మాకు ఆర్డర్లు వస్తున్నాయి’ అని చెబుతోన్న సౌమిత వినూత్న ఆలోచనకు తాజాగా వాయిస్‌ మిషన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ‘నేషనల్‌  ఎంటర్‌ప్రెన్యూరల్‌ ఐడియా అవార్డు’ వరించింది.
Tags :

తనల-ట-వ-ర , క-సమ , , ద-స-త-ల , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121048050 , Dress

అర్ధరాత్రి ఆకలేస్తోందా...


అర్ధరాత్రి ఆకలేస్తోందా...
డైటింగ్‌లో భాగంగా చాలామంది రాత్రిళ్లు తక్కువగా ఆహారం తీసుకుంటారు. దాంతో అర్ధరాత్రి ఆకలి వేయడంతోపాటు సరిగా నిద్రపట్టదు కూడా. అలాంటప్పుడు త్వరగా జీర్ణమై, తక్కువ కెలొరీలు ఉండే ఆహారం తీసుకుంటే మంచిది. ఇవన్నీ అలాంటివే...
పండ్లు: వీటిలో పోషకాలు ఎక్కువగా కెలొరీలు తక్కువగా ఉంటాయి. ఆయా కాలాల్లో దొరికే పండ్లను తింటే కడుపు నిండటంతోపాటు హాయిగా నిద్రపడుతుంది కూడా.
మరమరాలు: వీటిని నూనె లేకుండా వేయించి ఉప్పూ, కారం కలిపి డబ్బాలో భద్రపరుచుకుంటే అర్ధరాత్రి ఆకలి తీర్చుకోవచ్చు. కాస్త రుచిగా ఉండాలంటే వీటిల్లో వేయించిన పల్లీలు, పుట్నాలు కలపొచ్చు కూడా.
తృణధాన్యాల చిప్స్‌: జొన్నలు, రాగి, కొర్రలతో చేసిన చిప్స్‌ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని తింటే ఆకలి తీరడంతోపాటు పోషకాలూ అందుతాయి.
Tags :

అర-ధర-త-ర , ఆకల-స-త-ద , Eenadu , Vasundhara , Article , General , 1002 , 121046515 , Daiting , Calories , Food

ల్యాబ్‌ చిక్కులకు.. ఇంటి దినుసులు!


ల్యాబ్‌ చిక్కులకు.. ఇంటి దినుసులు!
సాధారణంగా శాస్త్రవేత్తలకు ల్యాబ్‌లు... పరిశోధనలు ఇవే లోకమవుతాయి. డాక్టర్‌ ఫాతిమా బెనజీర్‌ మాత్రం అక్కడ నుంచి మరో అడుగుముందుకేశారు. ‘అజూకా లైఫ్‌ సైన్సెస్‌’ సంస్థను ప్రారంభించి‘టింటో ర్యాంగ్‌’ పేరుతో ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టే ఆ ఆవిష్కరణ మనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..
మీరెప్పుడైనా గమనించారా?... రక్తపరీక్ష కోసం డయాగ్నస్టిక్‌ సెంటర్లకు వెళ్లినప్పుడు మన దగ్గర్నుంచి సేకరించిన శాంపిళ్లని వేరే రసాయనంలో వేసి కలుపుతారు. ఆ తర్వాతే మన వ్యాధిని ఏంటో నిర్ధరిస్తారు. అయితే ఇలా కలిపే రసాయనాలు చాలావరకూ హానికారకాలే ఉంటాయి. అందుకే వాటిని సరైన చర్యలు తీసుకోకుండా భూమిలో కలిపినా ప్రమాదమే. పైగా వీటిని తయారుచేసే సంస్థలు చాలామటుకు విదేశాల్లోనే ఉన్నాయి. అక్కడ నుంచి తెప్పించుకోవడం కూడా ఖరీదైన వ్యవహారమే. బెంగళూరుకు చెందిన డాక్టర్‌ ఫాతిమా ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు ‘టింటో ర్యాంగ్‌’ అనే ఆవిష్కరణ చేశారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తిగా వంటింట్లో దొరికే దినుసులతోనే తయారుచేసి సంచలనం సృష్టించారు.
మాలిక్యులర్‌ బయాలజిస్ట్‌ అయిన డాక్టర్‌ ఫాతిమా మొదట లెక్చరర్‌గా తన కెరీర్‌ని మొదలుపెట్టారు. తర్వాత పరిశోధనలపై ప్రేమతో బెంగళూరులోని ‘ది ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్సీ)’లో పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చర్‌గా తన పరిశోధనలు మొదలుపెట్టారు. పరిశోధనాంశంగా ల్యాబుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించే ‘ఫ్లోరోసెంట్‌ డై’కు ప్రత్యామ్నాయం కనిపెట్టాలనుకున్నారు. కారణం ఈ డైలో ఉండే రసాయనాల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు గుర్తించారామె. సహజసిద్ధమైన పదార్థాలతో రీ ఏజెంట్‌ను రూపొందించాలనుకున్నారు. అందుకు వంటింటి పదార్థాలనే ముడిసరకులుగా మార్చుకున్నారు. ‘నా పరిశోధనకు పూర్తిగా మనం వంటింట్లో వాడే పదార్థాలనే వినియోగించా. మొదట్లో ఎన్నో వైఫల్యాలు ఎదురయ్యాయి. ప్రతిసారీ నిరాశే! ఆ పరిస్థితి నుంచి బయటపడి ఆత్మవిశ్వాసంతో విజయం వైపు నడిచా. చివరకు అనుకున్న ఫలితాన్ని సాధించగలిగా. కచ్చితమైన ఫలితాలు ఇవ్వడంతో... నేను కనిపెట్టిన జెల్‌ లాంటి పదార్థాన్ని ‘టింటో ర్యాంగ్‌’ అని పేరు పెట్టా. దీన్ని పూర్తిగా ఫుడ్‌ గ్రేడ్‌ డై అనొచ్చు. దీన్ని డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ప్రొటీన్‌, సెల్‌ టెస్టింగ్‌ లాంటి పలురకాల పరీక్షల్లో ఉపయోగించవచ్చు. దీన్ని ఐఐఎస్‌సీ, సీసీఎంబీల్లో సైతం వినియోగిస్తున్నారు’ అంటూ వివరించారు డాక్టర్‌ ఫాతిమా.
గతేడాది కరోనా వ్యాప్తి చెందిన సమయంలో ఐఐఎస్‌సీ తరఫున కొవిడ్‌ -19 రెస్పాన్స్‌ టీమ్‌గా డాక్టర్‌ ఫాతిమా బృందం ఎంపికైంది.  ఇందులో భాగంగా ఆమె చేసిన పరిశోధనలు ఎంతో కీలకంగా మారాయి. కరోనా రోగి నుంచి సేకరించిన స్వాబ్‌ ల్యాబ్‌కు చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాంటప్పుడు నమూనాలు మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే పరీక్షలు చేసిన తర్వాత కచ్చితమైన ఫలితాలు రాకపోవచ్చు కూడా. అలా కాకుండా స్వాబ్‌కు సరైన రక్షణనందించే ప్రత్యేక గాజునాళాన్ని ‘ఆర్‌ఎన్‌ఏ రేపర్‌’  పేరుతో డాక్టర్‌ ఫాతిమా బృందం రూపొందించింది. ఈ గాజునాళంలో స్వాబ్‌ సాధారణ వాతావరణంలో కూడా వారంరోజులపాటు ఎలాంటి మార్పునకు గురికాకుండా భద్రంగా ఉంటుంది. ఈ రేపర్‌ ఆమెకు ఎన్నో ప్రశంసలను తెచ్చిపెట్టింది. త్వరలో ఎవరికివారు ఇంట్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకునేందుకు వీలుగా ఒక కిట్‌ని తయారుచేస్తానని చెబుతున్నారు ఫాతిమా.
Tags :

ల-య-బ , చ-క-లక , ఇ-ట , ద-న-స-ల , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121046534 , Lab

వంటకు ఏ నూనె మంచిది...


వంటకు ఏ నూనె మంచిది...
వంటకు ఏ నూనె వాడితే మంచిదనే విషయంలో మనకు ఎన్నెన్నో సందేహాలు వస్తుంటాయి. ముందుగా ఏయే నూనెల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయో తెలుసుకుంటే వాటిని ఎంచుకోవడం తేలికవుతుంది.
సన్‌ఫ్లవర్‌ నూనె: దీంట్లో శాచురేటెడ్‌ ఫ్యాటీయాసిడ్లు తక్కువ. మెనోశాచురేటెడ్‌, పాలీ అన్‌ శాచురేటెడ్‌ కొవ్వులు చాలా ఎక్కువ. కాబట్టి ఈ నూనె గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ఉండే యాసిడ్లు రక్తంలో కొవ్వు తగ్గేందుకు తోడ్పడతాయి. అలాగే కీళ్ల ఆరోగ్యానికీ మేలు చేస్తాయి.
ఆవనూనె: ఈ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మోనోశాచురేటెడ్‌ కొవ్వులతోపాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. కాలేయం చుట్టూ కొవ్వు ఏర్పడకుండా చేస్తుంది. అలాగే గుండెపోటు రాకుండానూ కాపాడుతుంది.
ఆలివ్‌నూనె: ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే మెనోశాచురేటెడ్‌ ఫ్యాటీయాసిడ్లు ఈ నూనెలో ఎక్కువగా ఉంటాయి. ఇవి లోడెన్సిటీ లైపో ప్రొటీన్‌ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఈ నూనె దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచడానికీ తోడ్పడుతుంది.
వేరుసెనగ నూనె: దీంట్లో విటమిన్‌-ఇ, మోనో శాచురేటెడ్‌ కొవ్వులు, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-6 యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇది కంటిచూపు, రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.
నువ్వుల నూనె: దీంట్లో మోనోశాచురేటెడ్‌, పాలీఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీయాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. ఈ నూనెతో చేసిన వంటకాలు తినడం వల్ల చాలా వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
Tags :

వ-టక , , , మ-చ-ద , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121045761 , Oil

ఆ యువరాణి... ఆమె రక్షణలో!


ఆ యువరాణి... ఆమె రక్షణలో!
 
అది 1920...  ఈజిప్టు నుంచి తెచ్చిన ఓ యువరాణిని నిజాం ప్రభువుకు కానుకగా ఇచ్చాడు అతని అల్లుడు.. అపురూపమైన ఆ బహుమతిని ఆయన ఎంతో భద్రంగా దాచిపెట్టారు.  వందేళ్ల తరువాత కూడా ఆమెను ఇంకా అబ్బురంగానే చూస్తున్నారు.  యువరాణీ ఏంటి... దాచిపెట్టడం ఏంటి  అనేగా మీ అనుమానం. అవును... ఆమె 2500 సంవత్సరాల నాటి మమ్మీ. దక్షిణభారతదేశంలో ఉన్న ఈ ఏకైక మమ్మీ సంరక్షణకుచీఫ్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు బి. గంగాదేవి...
యువరాణి నిషూహూ... 2500 సంవత్సరాల కిందటి టోలెమీ రాజవంశానికి చెందిన అమ్మాయి. సుమారుగా 20 ఏళ్ల వయసులో ఆమె మరణించిన తర్వాత ఆ భౌతికకాయాన్ని మమ్మీగా మార్చి భద్రపరిచారు ఆనాటి రాజవంశీయులు. చాలాకాలంపాటు ఇది ఈజిప్టులోనే ఉంది. 1920లో నిజాం కుటుంబానికి చెందిన నజీర్‌ నవాజ్‌ జంగ్‌ దాన్ని వెయ్యి పౌండ్లకు కొని తన మావయ్య ఆఖరి నిజాం ప్రభువుకు కానుకగా ఇచ్చేందుకు హైదరాబాద్‌ తీసుకొచ్చారు. 1930 నుంచి తెలంగాణా ఆర్కియాలజీ మ్యూజియంలో ఓ గాజుపెట్టెలో భద్రంగా ఉంది. దక్షిణభారతదేశంలో ఉన్న ఏకైక మమ్మీ కూడా ఇదే కావడం విశేషం.
మమ్మీల సంరక్షణ అంత తేలికైన విషయమేమీ కాదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అవి క్షీణించిపోతుంటాయి. అదే జరిగితే మనం తర్వాతి తరాలకు అపురూపమైన ఈ సంపదని అందించలేం. కానీ ఈ పనిని ఎంతో సమర్థంగా చేస్తున్నారు గంగాదేవి. 2012లో తెలంగాణ ఆర్కియాలజీ మ్యూజియంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా చేరిన ఈమె అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి మమ్మీ బాధ్యతను పూర్తిగా తీసుకున్నారు. ‘మొదట్లో ఇది ఓ చెక్క బాక్సులో ఉండేది. క్రమంగా వాతావరణంలోని తేమ ఈ మమ్మీకి శత్రువుగా మారింది. దాంతో దానికి చుట్టి ఉంచిన 60 మీటర్ల వస్త్రం అక్కడక్కడా చిరగడం మొదలయ్యింది. కాలివేలు ఒకటి బయటికి వచ్చింది. దాంతో ఈ సంపదను కాపాడుకోవడానికి ఏం చేయొచ్చా అని ఆలోచించాను.
నిపుణుల కోసం దేశమంతా గాలించాను. చివరకు ఛత్రపతి శివాజీ మ్యూజియంలో పనిచేస్తున్న ఓ నిపుణుడు దొరికాడు. అతని సాయంతో మమ్మీకి సీటీ స్కాన్‌, ఎమ్మారై స్కాన్‌ చేయించా. పక్కటెముకలు, వెన్నెముక స్వల్పంగా దెబ్బతిన్నట్లు గుర్తించా. మిగతా భాగమంతా చెక్కుచెదరకపోవడం కొంత వరకు అదృష్టమే అనుకున్నా. తిరిగి దీన్ని పాత పద్ధతిలోనే దాచిపెడితే ప్రయోజనం లేదనిపించింది. ఆక్సీకరణ చర్య జరగకుండా అడ్డుకునేందుకు జర్మనీ నుంచి ప్రత్యేకంగా గాజుపెట్టెను తెప్పించా. ఆక్సిజన్‌ ఫ్రీ షోకేస్‌గా పిలిచే ఈ పెట్టెలో పూర్తిగా నైట్రోజన్‌ వాయువు మాత్రమే  ఉండేలా మిషన్‌ను ఏర్పాటు చేశా. మరో 25 ఏళ్లకు పైగా ఈ మమ్మీ చెక్కు  చెదరదు’ అంటున్నారు గంగాదేవి.
మాది కడప జిల్లాలోని ఎర్రగుంట్ల. వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. చదువుపై నాకున్న ఆసక్తిని గమనించిన నాన్న ఎంతకష్టమైనా చదివించాలనుకున్నాడు. ఎంఏ చేసిన వెంటనే ఈ ఉద్యోగం వచ్చింది. ఇక్కడి 12 గ్యాలరీల సంరక్షణ బాధ్యత చూస్తున్నా. నిజాంకాలంలో 18 నుంచి 19వ శతాబ్దానికి చెందిన బంగారం, వెండి, రాగితో చేసిన పురాతన ఆభరణాలు, వస్తు సంపద ఇక్కడ ఉంటుంది. ఆ కాలానికి చెందిన ఆయుధాలు, పురాతన చిత్రలేఖనాలు, కాంస్య విగ్రహాలు నా సంరక్షణలోనే ఉంటాయి.
Tags :

, య-వర-ణ-ఆమ , రక-షణల , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121044987 , Egypt , Mummy

సింధునేత్రం...ఆ నలుగురిది!


సింధునేత్రం...ఆ నలుగురిది!
వేలకిలోమీటర్ల సముద్ర తీరం...  దట్టమైన మంచుతో నిండి, మనుషులు అడుగుపెట్టడానికి వీలులేని చైనా, పాక్‌ సరిహద్దు ప్రాంతాలు... శత్రువులు ఎలా అయినా రావొచ్చు, ఎప్పుడైనా రావొచ్చు..  వాళ్లపై నిరంతరం కన్నేయాలంటే..సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ఓ నిఘానేత్రం అవసరం.  ఆ బాధ్యతలే తీసుకుంది ‘సింధునేత్ర’.  తాజాగా పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగించిన ముఖ్యమైన ఉపగ్రహాల్లో ఇదీ ఒకటి. దీని తయారీలో కీలకపాత్ర పోషించిన మహిళా బృందం వసుంధరతో ముచ్చటించింది...
ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సీ-51 వాహకనౌక నింగిలోకి 19 శాటిలైట్స్‌ని పంపిస్తే వాటిల్లో ‘సింధునేత్ర’(ఆర్‌శాట్‌) నిఘా ఉపగ్రహం ఒకటి. దీనికి డీఆర్‌డీవో నిధులు సమకూర్చగా, బెంగళూరులోని పీఈఎస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మహిళా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు తుదిరూపునిచ్చారు. సముద్ర తీరంలో గస్తీ కాస్తూ శత్రు దేశ నౌకల సమాచారాన్ని మన అధికారులకు చేరవేయడం సింధునేత్ర పని. దీని తయారీలో రీసెర్చ్‌ అసోసియేట్‌గా కీలకపాత్ర పోషించిన కావ్య నిత్యం పరిశోధనల్లో మునిగితేలడంలోనే అంతులేని సంతృప్తి ఉందని అంటున్నారు. గతంలో పీశాట్‌ ఉపగ్రహం తయారీలో పనిచేసిన అనుభవం ఉందామెకు. ఈ ప్రాజెక్టులో అసెంబ్లీ ఇంటిగ్రేషన్‌ టెస్టింగ్‌, ఆన్‌బోర్డ్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌ వంటి వ్యవహారాలని పర్యవేక్షించారామె. ‘ఆరేళ్లుగా సింధునేత్ర కోసం పనిచేస్తున్నా. ఈ ప్రయాణంలో డిజైన్‌, టూల్స్‌పై పట్టు సాధించటం సవాలుగా అనిపించింది. నిత్యం మారుతున్న సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన పెంచుకుంటూ ఉండాలి. ఇదేమంత తేలికైన వ్యవహారం కాదు. చాలా ఓర్పుతో ఉండాలి. నా స్నేహితులంతా ఎంఎన్‌సీల్లో పని చేస్తూ మంచి జీతాలు అందుకుంటున్నారు. వారాంతాల్లో నచ్చినట్టుగా ఉంటారు. నాకు అంతంత వేతనాలు, సౌకర్యాలు లేకపోయినా పరిశోధన రంగంలో నేను సాధించిన ఈ విజయం ఇచ్చిన సంతృప్తి వెలకట్టలేనిది’ అంటోంది కావ్య.
చిన్న ఉపగ్రహమే కానీ...
తక్కువ వ్యయంతో... లక్ష్యాలను చేరుకునే ఉపగ్రహాల తయారీ అంత సులువు కాదు. వీటిని రూపకల్పనకు నేర్పు, ఓర్పు కూడా చాలా అవసరం అంటారు మరో రీసెర్చ్‌ అసోసియేట్‌ అభిరామి. ‘ఉపగ్రహాల తయారీకి వాడే సాఫ్ట్‌వేర్‌లు ప్రతి ఏటా మారిపోతుంటాయి. ఏమాత్రం వెనుకబడినా కష్టమే. అందుకే ఎప్పటికప్పుడు నైపుణ్యాలు పెంచుకోవాలి. ఈ ప్రాజెక్టులో సిస్టమ్‌ అండ్‌ ఇంటిగ్రేషన్‌ కూర్పులు నాకు సవాళ్లు విసిరేవి. పేరుకు చిన్న ఉపగ్రహమే అయినా పెద్ద శాటిలైట్‌కు అవసరమైన డిజైన్లు, ఇంటిగ్రేషన్‌లు సమకూర్చాల్సి వచ్చింది’ అంటారామె.
వైఫల్యాలే పాఠాలుగా...
వైఫల్యాలే తనకు విలువైన పాఠాలు నేర్పాయని అంటున్నారు ఈ ప్రాజెక్టులో శాటిలైట్‌ డిజైన్‌, యాంటెన్నా టెస్టింగ్‌ విభాగాల్లో పనిచేసిన సుష్మ.  
‘ఈ శాటిలైట్‌ కోసం యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్‌లతోనే యాంటెన్నా డిజైన్‌లను రూపొందించా. కానీ అవేమీ నాకు నచ్చలేదు. వైఫల్యం చెందిన ప్రతిసారీ కొత్త డిజైన్‌లు తయారు చేశా. అప్పుడే పుస్తకాల్లో చదివిన దానికీ ప్రత్యక్ష ప్రాజెక్టులకు ఎంత తేడా ఉంటుందో తెలిసొచ్చింది. దీని టెస్టింగ్‌ కోసం రోజూ 50కి.మీల దూరంలోని డీఆర్‌డీఓ కేంద్రానికి వెళ్లేదాన్ని’  అంటోంది సుష్మశంకరప్ప.
విద్యార్థులకు శిక్షణ ఇచ్చి...
ఈ ప్రాజెక్టులో శాస్త్రవేత్తలే కాదు... విద్యార్థులూ పాలుపంచుకున్నారు. దాదాపు 10బ్యాచ్‌లకు చెందిన 50మంది విద్యార్థులు దీంట్లో పని చేశారు. వీరి నైపుణ్యాలను గుర్తిస్తూ వాటిని ప్రాజెక్టు కోసం ఉపయోగపడేలా చేశారు మెంటార్‌ ప్రియాంక అగర్వాల్‌.
-కె. ముకుంద, బెంగళూరు
Tags :

స-ధ-న-త-ర-ఆ , నల-గ-ర-ద , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121044237 , Pslv-c51 , Sindhunethra , Isro

అలా చేశాక జుట్టు ఊడుతుంది?


అలా చేశాక జుట్టు ఊడుతుంది?
నా వయసు 20. హెయిర్‌ స్ట్రెయిట్‌నింగ్‌ చేయించుకున్న తర్వాత జుట్టు బాగా పలచగా అయ్యింది. పెరగడం లేదు కూడా. అలాగే హెల్మెట్‌ పెట్టుకోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చిందనుకుంటున్నా. వెంట్రుకలు ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి?
- ఓ సోదరి
తరచూ స్ట్రెయిట్‌నింగ్‌ చేయించడం వల్ల వెంట్రుకలు చిట్లి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. అలాగే ఈమధ్య కొందరు కెరటిన్‌ ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకుంటున్నారు. దీనివల్ల తాత్కాలికంగా మెరిసినా దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. రసాయనాలు ఎక్కువగా ఉండే చికిత్సలేవీ  మంచివికావు.
ఇతర కారణాలు: పోషకాహార లోపం, థైరాయిడ్‌, తీవ్ర ఒత్తిడి, మితిమీరిన డైటింగ్‌, సంరక్షణ సరిగా లేకపోవడం, గాఢత ఎక్కువగా ఉండే షాంపులు వాడటంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్నా జుట్టు ఊడిపోతుంది. అవసరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. చేపలు, గుడ్లు, నట్స్‌, ఆకుకూరలను తరచూ తినాలి. తప్పనిసరిగా వ్యాయామాలు, ధ్యానం చేయాలి. తగినంత నిద్రా ఉండాలి. రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు
తాగాలి. జంక్‌ఫుడ్‌ని తగ్గించాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వెంట్రుకలు ఎక్కువుగా రాలిపోతుంటే  వైద్యులను సంప్రదించండి. వారి సలహాతో జుట్టు పెరుగుదలకు కావాల్సిన విటమిన్లు, బయోటిన్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవచ్చు.
హెల్మెట్‌ సరిగా వాడితే ఎలాంటి సమస్యా ఉండదు. జుట్టు తడిగా ఉన్నప్పుడు దీన్ని పెట్టుకుని ఎక్కువ గంటలపాటు ప్రయాణించడం మంచిది కాదు. అలా చేస్తే చుండ్రు పెరిగే అవకాశముంది. ముందుగా కాటన్‌ స్కార్ఫ్‌ చుట్టుకుని దానిపై హెల్మెట్‌ పెట్టుకోవాలి. ఇలాచేస్తే చెమట పట్టినా స్కార్ఫ్‌ పీల్చేస్తుంది.
Tags :

అల , చ-శ-క , జ-ట , ఊడ-త-ద , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121043433 , Helmet

నేను వాళ్ల రోల్‌మోడల్‌గా ఉండాలనుకున్నా!


నేను వాళ్ల రోల్‌మోడల్‌గా ఉండాలనుకున్నా!
‘పెళ్లంటే ఒకరి బాధ్యతల్ని మరొకరు ఇష్టంగామోయడం... మా అమ్మానాన్నలు ఆ పనిని ఎంతో ఇష్టంగా చేశారు..’ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఆయన భార్య లత నలభయ్యో పెళ్లిరోజుని ఉద్దేశించి కూతురు ఐశ్వర్య చేసిన ట్వీట్‌ ఇది. దేశం మెచ్చిన నటుడు రజనీ ఎదుగుదలలో లత పాత్ర చిన్నదేం కాదు.. ముఖ్యంగా పిల్లల విషయంలో పూర్తిగా బాధ్యతలు తలకెత్తుకున్నారు. వివిధ సందర్భాల్లో పిల్లల పెంపకం గురించి లత చెప్పిన విషయాలివి...
రజనీకి పిల్లలతో గడిపే అవకాశం ఉండేదికాదు. అందుకే వాళ్లని స్కూల్లో చేర్పించడం నుంచి పెద్దైన తర్వాత వారి ఇష్టాయిష్టాలను గుర్తించి ప్రోత్సహించడం వరకూ అన్నీ నేనే చేసేదాన్ని. అంటే అన్నీ నా ఇష్టం అని కాదు. నేను చేసే ప్రతిపనీ, వేసే ప్రతి అడుగూ ముందుగా ఆయనతో చెప్పే చేసేదాన్ని. ఏ నిర్ణయమైనా ఇప్పటికీ ఇద్దరం కలిసే తీసుకుంటాం.
మేం మంచి స్నేహితులం. ఆ తర్వాతే దంపతులం. అందుకే బిడ్డల బాధ్యత నాకు కష్టమనిపించలేదు. పిల్లలపై సినిమాల ప్రభావం పడకుండా చాలా సాదాసీదా జీవితాన్ని పిల్లలకు అలవాటు చేశా. ఎందుకుంటే నేనూ, ఆయనా  కూడా చాలా సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవాళ్లమే. అందుకే అమ్మ నుంచి నేర్చుకున్న కుటుంబ విలువలను నా పిల్లలకు అందిస్తున్నా
నా చిన్నప్పుడు అమ్మ మా అందరికీ రోల్‌మోడల్‌. ఓ భార్యగా, తల్లిగా ఆమె నిర్వర్తించే బాధ్యతలను దగ్గరుండే గమనించేదాన్ని. అలాగే నా పిల్లలకు నేను కూడా  రోల్‌మోడల్‌గా ఉండాలనుకున్నా. వారిని అలాగే పెంచాను కూడా. పిల్లలంటే నా దృష్టిలో
ప్రపంచాన్ని అందంగా మార్చడానికి భగవంతుడు పంపిన దేవదూతలు.
నాకు పిల్లలంటే చాలా ఇష్టం. స్కూల్‌రోజుల్లోనే మా ఇంటి వరండాలో పేద పిల్లల కోసం చిన్న గ్రంథాలయమే ఏర్పాటు చేశా. చుట్టుపక్కల పిల్లలందరికీ కథలు చెప్పి, పాటలు పాడి సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేదాన్ని. యతిరాజ్‌ కాలేజీలో చదివేటప్పుడు తొలి పాప్‌ బ్యాండ్‌ను ప్రారంభించా. నాకు నలుగురు స్నేహితురాళ్లు ఉండేవాళ్లు. అందరం కలిసి ప్రపంచమంతా పర్యటించి ఆల్బంలు చేయాలని, పేద పిల్లలకు విద్యనందించాలని అనుకునేవాళ్లం. అలా పిల్లలపై ప్రేమ నన్ను వారి కోసం ‘శ్రీదయా ఫౌండేషన్‌’ను స్థాపించేలా చేసింది.  వీధిబాలల కోసం మొదలుపెట్టిన ఈ సంస్థలో అనాథ చిన్నారులను చేర్చుకుంటున్నాం. ఒకసారి తమిళనాడులో వీధిబాలలు మాయమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. మా ఫౌండేషన్‌ చెన్నైలోని మరికొన్ని ఎన్జీవోలతో కలిసి చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రుల తరఫున ఉండి రాష్ట్రపోలీసు విభాగాన్ని కదిలించాం. అలాగే ఈ పిల్లల కోసం అభయం ప్రాజెక్ట్‌ను రూపొందించాం. ఇందులో ప్రతి పౌరుడూ తన వంతు సేవలందించేలా వేదికనూ ఏర్పాటు చేశాం. ఎక్కడ చిన్నారులు తమ హక్కులను కోల్పోతున్నా లేదా దాడులకు గురవుతున్నా మాకు సమాచారం అందించొచ్చు. అలాంటి వారిని మేం అక్కునజేర్చుకుని విద్య, ఆరోగ్యం వంటివన్నీ అందేలా చేస్తాం. పేద పిల్లల ముఖాలపై చిరునవ్వు చెదరకుండా ఉండటానికి కృషి చేస్తున్నా. అలా చాలామంది అనాథ పిల్లలకు తల్లినయ్యా.
నావల్ల రజనీ క్షణంకూడా బాధపడకూడదనుకుంటా. ఆయన చేసే ప్రతి పాత్రనూ ఎంజాయ్‌ చేయడంలో నా తర్వాతే ఎవరైనా. అలాగే నేను పాడే ప్రతిపాటకు మొదటి శ్రోత ఆయనే. మేమిద్దరం ప్రతి విషయాన్ని పంచుకున్నట్లే, కొన్ని సందర్భాల్లో ఒకరినొకరం ప్రశంసించుకుంటాం.  ప్రతి నిమిషం మమ్మల్ని మేం తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఇదే మా నుంచి పిల్లలు నేర్చుకోవాలని కోరుకుంటాం.
కొన్ని విషయాల్లో మనం వాళ్లకి నేర్పించేదానికన్నా వారి నుంచి నేర్చుకోవాల్సిందే ఎక్కువగా ఉంటుందేమో అనిపిస్తుంది. పిల్లల్లోని ప్రతిభను గుర్తించగలగాలి. అలాగే వారి అభిప్రాయాలనూ గౌరవించాలి. ఇదే సూత్రాన్ని ఐశ్వర్య, సౌందర్య విషయంలోనూ పాటించా. వీరిద్దరిలో సహజమైన సృజనాత్మకత ఉంది. మంచి రచయిత్రులు కూడా. కష్టపడాలనే తత్త్వం వీళ్లని సొంతంగా ఆలోచించేలా చేసి, ఇష్టమైన రంగాల్లో అడుగుపెట్టేలా చేసింది. అందుకే ఐశ్వర్య దర్శకురాలిగా, నిర్మాతగా మారితే సౌందర్య యానిమేషన్‌ రంగంలో విజయం సాధించింది.
Tags :

, వ-ళ-ల , ర-ల-మ-డల-గ , ఉ-డ-లన-క-న , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121042705 , Rajani

ఆ కళాకారుడి ఆవేదన కదిలించింది...


ఆ కళాకారుడి ఆవేదన కదిలించింది...
 
ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ పోస్ట్‌ ఆమెను కదిలించింది... ఓ వ్యక్తి రెండు చేతులూ జోడించి ‘ఆకలితో ఉన్నా.. ఆదుకోండి’ అంటూ ఉన్న ఆ పోస్టు గురించి ఆరా తీసింది. అదో నృత్యకళాకారుడిది. దాంతో ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చిందామెకు. ఎందుకంటే ఆమె కూడా ఓ నృత్యకళాకారిణే. ఆ క్షణంలో ఆమెకొచ్చిన ఆలోచన ఆ ఫొటోలో ఉన్న వ్యక్తికే కాదు.. అటువంటి వందలాదిమంది కళాకారుల కడుపు నింపింది
37 ఏళ్ల డాక్టర్‌ భావన. ‘సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్‌’ పిలుపుతో కళాకారులకు భరోసా ఇస్తున్న ఆమె తన గురించి తెలిపారిలా...
మాది విజయవాడ. చిన్నప్పుడు నేను బరువు తగ్గాలని అమ్మ నన్ను నృత్యంలో చేర్పించింది. కారణమేదైనా నాకు మాత్రం నృత్యం అంటే ప్రాణంగా మారింది. అందుకే జీవీఆర్‌ మ్యూజిక్‌  ¥లేజీలో డిప్లొమా చేశా. ఆ తర్వాత కూచిపూడి కళాక్షేత్రలో ఎమ్‌ఏ డ్యాన్స్‌ పూర్తి చేశా. పెళ్లైన తర్వాత హైదరాబాద్‌ వచ్చా. కూచిపూడి నృత్యప్రదర్శనలిస్తూ, సొంతంగా ‘శారదా కళాక్షేత్ర డాన్స్‌ అకాడమీ’  స్థాపించి 150 మంది విద్యార్థులకు కూచిపూడిలో శిక్షణనిస్తున్నా.  
రోడ్డున పడి...
ఫేస్‌బుక్‌లో  మా రంగంలో ఉన్నవారందరికీ ఓ గ్రూప్‌ ఉంది. గతేడాది మార్చి మొదటివారంలో అందులో ఓ పోస్ట్‌ను చూశా. ఓ నృత్యకళాకారుడి ఆవేదన అది. ఆ ఫొటోను చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. కడుపులో మెలిపెట్టినట్లు అయ్యింది. ఆయన చిత్తూరుకు చెందిన ఓ కూచిపూడి కళాకారుడు. కొవిడ్‌ కారణంగా  ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆ రోజంతా ఆయన నా కళ్లెదుటే ఉన్నట్లనిపించింది.  ఏదో ఒకటి చేయాలని ఆలోచించా. వెంటనే తెలిసిన వారందరినీ సంప్రదించా. ఇలా మరెందరో కళాకారులు ఆకలితో అలమటిస్తూ ఉంటారు కదా.. అటువంటి వారందరినీ ఆదుకోవాలనిపించింది.  
‘సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్‌’...
కూచిపూడి శిక్షణా పథకం కింద దాదాపు 400 మంది కళాకారులకు గతంలో ఉద్యో గాలుండేవి. అయితే ప్రభుత్వం మారినప్పుడు ఉపాధి కోల్పోయారు. తర్వాత వారంతా ఓ బృందంగా ఏర్పడ్డారు. ఆ గ్రూపును సంప్రదించా. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన కళాకారులందరికీ చేయూతనివ్వడానికి నా ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో ఓ  ఆలోచన వచ్చింది. ‘సేవ్‌ కూచిపూడి ఆర్టిస్ట్‌’ పేరుతో  ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ఒక లైవ్‌ ప్రోగ్రాం  ప్రారంభించా. ఇందులో రోజుకొక కళాకారుడితో వారి కష్టాలను చెప్పించేదాన్ని. ప్రభుత్వం చేయుత´తనివ్వాలని కోరేదాన్ని. రెండుమూడు గంటలపాటు జరిగే ఆ కార్యక్రమం సోషల్‌మీడియాలో  చాలా స్పందనను తెచ్చింది. లైవ్‌ మొదలైన రెండో రోజునే కూచిపూడి కళాకారుడు వెంపటి వెంకట్‌ స్పందించారు. ఆ తర్వాత మరెందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆర్థికంగా చేయూతనందించడానికి చాలామంది ముందుకొచ్చారు. ఆ నగదుని ఓ ట్రస్టు ద్వారా సేకరించాం. మరోవైపు దయనీయ స్థితిలో ఉన్న నృత్యకళాకాలందరినీ గుర్తించడానికి జిల్లాలన్నింటిలో వాలంటీర్లుగా పనిచేయడానికి కొందరు  ముందుకొచ్చారు.  ఇలా ఆంధ్రలో 600, తెలంగాణలో 800 మంది కళాకారులను గుర్తించి అందరికీ తక్షణసహాయంగా తలా రూ.1000 చొప్పున ముందుగా అందించాం. హైదరాబాద్‌, మెదక్‌ ప్రాంతాల్లో ఉండేవారికి నిత్యావసర వస్తువులనూ పంపిణీ చేశాం. అలా నాలుగునెలలపాటు పేద కళాకారులకు సాయం అందేలా  కృషి చేశా. దేశంలోనే కాదు.. అమెరికా, లండన్‌ దేశాల నుంచి కూడా పలువురు కళాకారులు తమ  వంతు చేయూతనందించారు. ఒక్కొక్కరు రూ.500 పంపితే, మరొకరు రూ. లక్ష  కూడా ఇచ్చారు. ఆ నాలుగునెలలూ ఓ కార్పొరేట్‌ సంస్థ సిబ్బందిలా పని చేశాం. వృద్ధులకు  ఆసుపత్రి ఖర్చులు తలా అయిదువేలు పంపించేవాళ్లం. మొత్తం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఆర్థికసాయంతోపాటు నిత్యావసర వస్తువులనూ పంపిణీ చేశాం.
పింఛను ఇప్పించి...
లాక్‌డౌన్‌ తర్వాత కళాకారులకు ఉపాధి దొరకడం కష్టమైంది. దాంతో పలు కార్పొరేట్‌ సంస్థల  సహాయం తీసుకుంటున్నాం. ఆలయాల్లో కళాకారుల నృత్యప్రదర్శన ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఇటీవల జేఎస్‌పీఎల్‌ సంస్థ ద్వారా 12 మంది వృద్ధకళాకారులకు వారి జీవితాంతం తలా రెండున్నరవేల రూపాయలు నెలనెలా పింఛను అందేలా చేశా. దానికి కన్నీళ్లతో వారు చెప్పే కృతజ్ఞతలు నాపై మరింత బాధ్యతను పెంచాయి. త్వరలో అంతర్జాతీయ  కూచిపూడి సమాఖ్యను ప్రారంభించనున్నా. ఇందులో ప్రతి కళాకారుడు సభ్యుడిగా చేరొచ్చు. వెంపటి  చినసత్యంగారి జ్ఞాపకార్థం ఏటా అక్టోబరు 15న ‘వరల్డ్‌ కూచిపూడి డే’గా జరుపుకోవడం  గతేడాది నుంచి ప్రారంభించాం.
Tags :

, కళ-క-ర-డ , ఆవ-దన-కద-ల-చ-ద , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121041958 , Artist , Ladies

డెబ్భైఏడేళ్ల వయసులోనూ అదే ఉత్సాహం!


డెబ్భైఏడేళ్ల వయసులోనూ అదే ఉత్సాహం!
గ్యాస్‌ సిలెండర్‌ త్వరగా అయిపోతే ఈసారైనా జాగ్రత్తగా వాడి ఖర్చులను కాస్త తగ్గించుకోవాలనుకుంటాం.
కానీ విమల్‌డిగే మాత్రం సిలెండర్‌తో పనిలేకుండానే పదహారేళ్లుగా వంట చేస్తూ పొదుపు చేస్తున్నారు.
పుణెకు చెందిన విమల్‌ ఓరోజు టీవీలో వంటింటి వ్యర్థాలతో బయోగ్యాస్‌ తయారీ గురించి ప్రత్యేక కార్యక్రమాన్ని చూశారు. పర్యావరణ హితానికి తోడ్పడే పనులను చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. కూరగాయలు, పండ్లు, బియ్యం కడిగిన నీళ్లను పెరట్లోని మొక్కలకు పోసేవారు. నెలవారీ సరుకులు కొనాలన్నా కాటన్‌ బ్యాగునే తీసుకెళ్లేవారు. అదే స్ఫూర్తితో ఆమె  ఇంట్లోనూ బయోగ్యాస్‌ ప్లాంటును ఏర్పాటుచేయాలని ఆలోచించారు. దీన్ని కొడుకుతో పంచుకుని పుణెలోని రూరల్‌ టెక్నాలజీ సంస్థను సంప్రదించి తమ మేడ మీద బయోగ్యాస్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచీ వంటకు ఈ గ్యాస్‌నే వాడటంతో వారి కుటుంబానికి గ్యాస్‌ సిలెండర్‌తో పనిలేకుండా లేకుండా పోయింది.  
ఎలా పనిచేస్తుందంటే...
ఈ బయోగ్లాస్‌ యూనిట్‌లో రెండు నీటి ట్యాంకులు ఉంటాయి. కింది దాని సామర్థ్యం వెయ్యి లీటర్లు ఉంటుంది. పైట్యాంకు దీనికంటే చిన్నగా ఉంటుంది. దీంట్లో నిల్వ ఉండే బయోగ్యాస్‌ పైప్‌లైన్‌ ద్వారా వంటింట్లోకి సరఫరా అవుతుంది. రెండు ట్యాంకులకూ ఉండే పైపుల్లో వ్యర్థాలను వేయొచ్చు. కూరగాయల ముక్కలు, టీపొడి, మిగిలిన ఆహార పదార్థాలు లాంటి వాటిని ఇందులో వేశారు. ఇవి వేసిన తర్వాత నాలుగు లీటర్ల నీళ్లు పోసి ఆవు పేడతో నింపారు. మూడు వారాల్లోనే గ్యాస్‌ సిద్ధమైంది. ఇది పదహారేళ్లుగా ఎలాంటి రిపేరూ లేకుండా పనిచేస్తోంది. పెద్దలే కాకుండా పిల్లలూ ఆహార వ్యర్థాలను సులువుగా దీంట్లో వేయొచ్చు.
మనుమరాలు శ్రేయాకు ఏడేళ్లు ఉన్నప్పుడు ఈ బయోగ్యాస్‌ను ఏర్పాటుచేశారు. ‘నా చిన్నతనంలో నాన్నమ్మ చొరవతోనే ఇంట్లో బయోగ్యాస్‌ ప్లాంటును ఏర్పాటుచేశారు. ఈ వయసులోనూ నాన్నమ్మ ఎంతో చురుగ్గా ఉంటుంది. పాఠ్యపుస్తకాల్లో లేని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మాకు చెబుతుంటుంది. ఎప్పుడైనా పండగలు, ఇతర వేడుకల సమయంలో ఎక్కువ ఆహార పదార్థాలను వండాల్సి వచ్చినప్పుడు.. చాలా అరుదుగా మాత్రమే ఎల్‌పీజీ సిలెండర్‌ను వాడతాం’ అంటోంది శ్రేయ.
Tags :

డ-బ-భ-ఏడ-ళ-ల-వయస-న , అద , ఉత-స-హ , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121040527 , Waste , Biogas