Live Breaking News & Updates on Women diet tips in telugu

Stay informed with the latest breaking news from Women diet tips in telugu on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Women diet tips in telugu and stay connected to the pulse of your community

అప్పుడు నాకోసం.. ఇప్పుడు నాలాంటి వాళ్ల కోసం..


అప్పుడు నాకోసం.. ఇప్పుడు నాలాంటి వాళ్ల కోసం..
ఓ భార్య ప్రజారోగ్యం కోసం భర్తతోపాటూ వేల కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి సిద్ధపడింది. ఆ భర్త తన భార్య కోసం లక్షల రూపాయల జీతాన్ని వదిలేసి నిరంతర ప్రయాణీకుడిగా మారాడు.. ఇదో ప్రేమ కథ.. ఒత్తిడి, మానసిక సమస్యలపై పోరుబాటపట్టిన దంపతుల కథ... 
నెల్లూరుకు చెందిన సుధీర్‌ సీఏ విద్యార్థులకు పాఠాలు చెబుతుంటారు. నెలకు లక్షల్లో జీతం. గుంటూరు వాసి వైష్ణవిని 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సాఫీగా సాగుతున్న జీవితం వాళ్లది. కానీ వైష్ణవి మునుపటిలా చలాకీగా ఉండటం లేదు. ఎప్పుడూ దిగులుగా...ప్రతికూల ఆలోచనలతో సతమతమయ్యేది. ఎవ్వరితో మాట్లాడేది కాదు. దానివల్ల వారి కాపురంలో కలతలు కూడా మొదలయ్యాయి. పరిస్థితులు చక్కబడతాయిలే అని అనుకున్నారు. రోజులు గడిచాయి కానీ. ఫలితం లేదు. చివరికి వైద్యులని సంప్రదిస్తే వైష్ణవికి యాంగ్జైటీ, డిప్రెషన్‌ లాంటి సమస్యలున్నాయని తేలింది. ధ్యానం, మందులు, కొత్త ప్రాంతాల్లో పర్యటించడం... వీటితో ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పారు. దాంతో వైష్ణవి, సుధీర్‌లు చికిత్స తీసుకుంటూనే కొత్త ప్రాంతాలు పర్యటించడం మొదలుపెట్టారు. ఇలా రెండు సంవత్సరాల పాటు చేశారు. ఈ రెండేళ్లలో మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, దిల్లీ, కశ్మీర్‌లు తిరిగారు. కొత్త ప్రాంతాలు, పరిచయం లేని వ్యక్తుల మధ్య మెలగడంతో ఆమె ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడింది. మానసిక వ్యాధి నుంచి బయటపడగలిగింది. ఆత్మహత్య చేసుకునేంత స్థాయికి వెళ్లిన వైష్ణవి.. తిరిగి మామూలు మనిషిగా మారడంతో సుధీర్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
365 రోజుల దండయాత్ర.. ‘చాలా మందికి మానసిక వ్యాధులపై అవగాహనే లేదు. ఉన్నా చికిత్స తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. జీవితాంతం వాటితోనే సతమతమవుతుంటారు. పరిస్థితి చేయి దాటిపోతే తమకు తాము హాని చేసుకునేందుకు కూడా వెనుకాడరు. నా అనుభవంలో ఇవి తెలుసుకున్నా. నా విషయంలో సరైన సమయంలో చికిత్స అందింది. కుటుంబం అండగా నిలిచింది. మరి అలాంటి అవకాశాలు లేని వారి మాటేంటి? అలాంటి వారికోసమే నా భర్తతో కలిసి ఈ ప్రయాణం మొదలుపెట్టా’ అంటోంది వైష్ణవి.  ఒకసారి భార్య కోసం ప్రయాణాలు చేసిన సుధీర్‌.. ఈసారి సమాజం కోసం, భార్యతో కలిసి 365 రోజుల ఉత్తర భారత యాత్రని మొదలుపెట్టారు. ఏడాదిపాటు.. దేశంలోని అన్ని ప్రాంతాలకూ తిరిగేలా ప్రణాళిక వేసుకున్నారు. ‘శరీరంలో మెదడు కూడా ఒక భాగమని, దానికి కూడా అనారోగ్యం వస్తుందనీ మా పర్యటన ద్వారా చెప్పాలనుకుంటున్నాం’ అంటున్న ఈ దంపతులు జనవరి 17న నెల్లూరు నుంచి యాత్రను ప్రారంభించారు.
ఒంటరితనంలో వచ్చే ప్రతికూల ఆలోచనలతో ఒత్తిడి పెరుగుతుంది. వైద్యపరంగా ఒత్తిడిని మానసిక రుగ్మతగా వర్ణించారు. దీనివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. మేము పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ప్రతిక్షణం భయపడ్డాం. మానసిక సమస్యలతో బాధపడేవారికి కావాల్సిన మద్దతుని అందించడం కూడా మా యాత్ర ముఖ్య ఉద్దేశం.
- వైష్ణవి
అంతా కారులోనే.. ఏడాదిపాటు నిర్వహించే ఈ యాత్ర కోసం సుధీర్‌ ఒక కారుని కొనుగోలు చేశారు. ఈ కారులోనే నిద్రపోయేందుకు, వండుకునేందుకు వీలుగా పరుపు, వంట సామగ్రి వంటివి సిద్ధం చేసుకున్నారు. యాత్ర ఎన్నో రోజుకు చేరుకుందో తెలుసుకునేందుకు వీలుగా కారు వెనుక ఒక బోర్డును ఏర్పాటు చేసుకున్నారు. వెళ్లిన ప్రతి ప్రాంతంలో కరపత్రాలు పంపిణీచేస్తూ... మానసిక వ్యాధుల గురించి చైతన్యం తీసుకొస్తున్నారు. ఇలాంటి జబ్బులు నయమవుతాయని, మందులు ఉన్నాయంటూ కలిసిన వారికి వివరిస్తున్నారు.
- షేక్‌ మంజూర్‌, నెల్లూరు
Tags :

అప-ప-డ , న-క-స , ఇప-ప-డ , న-ల-ట , వ-ళ-ల , క-స , Eenadu , Vasundhara , Article , General , 1001

ఆటిజం పిల్లలకు ఆన్‌లైన్‌ అమ్మ!


ఆటిజం పిల్లలకు ఆన్‌లైన్‌ అమ్మ!
‘బడులు ఎప్పుడు తెరుస్తారో.. వీళ్ల అల్లరికి ఎప్పుడు చెక్‌పడుతుందో’ అని అనుకోని అమ్మలు లేరేమో! మామూలు పిల్లల విషయంలోనే తల్లులు ఇంతలా విసిగిపోతే మరి ప్రత్యేక అవసరాలుండే స్పెషల్‌ కిడ్స్‌ మాటేంటి? అటువంటి పిల్లల అవసరాలని అర్థం చేసుకుని వారికోసం ఆన్‌లైన్‌, వాట్సాప్‌ తరగతులు నిర్వహిస్తున్నారు జక్కిలింకి శారదా శ్రీరామ్‌...
సింధు పుట్టిన తర్వాత శారద జీవితానికో లక్ష్యం ఏర్పడింది. కారణం... సింధు ఆటిజం ఉన్న అమ్మాయి. శిక్షణ ద్వారా మంచి ఫలితాలు రావొచ్చని వైద్యులు చెప్పడంతో సొంతూరు రాజమహేంద్రవరం నుంచి ఆ పాపను తీసుకుని దిల్లీ వెళ్లారు. అక్కడి ‘యాక్షన్‌ ఫర్‌ ఆటిజం’ అనే సంస్థలో తన చిన్నారిని చేర్చారామె. బిడ్డపై ఆమెకున్న శ్రద్ధను చూసిన అక్కడి సిబ్బంది ‘మీరు టీచర్‌గా శిక్షణ తీసుకోవచ్చుగా’ అన్నారు. దాంతో శారద డిప్లమో ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో ప్రత్యేక కోర్సు పూర్తి చేశారు. పాపను తీసుకుని రాజమహేంద్రవరం వచ్చాక.. తన కుమార్తెలా ఆటిజం, ఇతర ప్రత్యేక అవసరాలనుకున్న వారికోసం ఏదైనా చేయాలనుకున్నారు. అలా ఐదేళ్ల క్రితం ఆరంభ్‌ అసోసియేషన్‌ ఫర్‌ ఆటిజం పేరుతో ఒక పాఠశాలను ప్రారంభించారు. స్పెషల్‌ బీఈడీ చేసిన పది మంది టీచర్లు, ఏడుగురు వాలంటీర్లతో ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు. దాతలు, వైకల్యంతో బాధపడే చిన్నారుల తల్లిదండ్రుల సహకారంతోనే ఈ పాఠశాల నడుస్తోంది. ‘దివ్యాంగ చిన్నారులు ఎవరికీ భారం కాకూడదనేదే నా లక్ష్యం. మ్యూజిక్‌, డాన్స్‌, డ్రాయింగ్‌, కంప్యూటర్‌, యోగాతోపాటూ కూరగాయలు కోయడం, వంట చేయడం వంటి విషయాల్లో మేం చిన్నారులకు శిక్షణ ఇస్తుంటాం. స్పీచ్‌థెరపీ, మ్యూజిక్‌థెరపీ, ఆక్యుపేషన్‌ థెరపీలనూ అందిస్తాం. ముఖ్యంగా ఇలాంటి పిల్లలకు బయట ఎలా ఉండాలో  తెలియదు. అది తెలియజెెప్పడం కోసం దుకాణంలో వస్తువులు ఎలా కొనాలి? ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఎలా నడుచుకోవాలి? ఇలాంటి విషయాలని మేం ప్రాక్టికల్‌గా వాళ్లకు నేర్పిస్తాం. కానీ లాక్‌డౌన్‌ సమయంలో ఇలాంటి చిన్నారులకు శిక్షణ అందకపోవడం బాధనిపించింది. అందుకే వారికోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ కోర్సులు ప్రారంభించా’ అంటారు శారద.
ఆన్‌లైన్‌లోనే శిక్షణ...
ఆటిజం వంటి సమస్యలుండే పిల్లల్ని నెలలు తరబడి ఇంట్లోనే ఉంచడం మంచిది కాదు. 24 గంటలూ ఇంట్లోనే ఉండటంవల్ల వారిలో విపరీతమైన ఒత్తిడి, భావోద్వేగాలు పెరుగుతాయి.. దాంతో ఒక్కోసారి ఇంట్లో వారిని కొట్టడం, రక్కడం, సామాన్లు పగలగొట్టడం, పెద్దగా అరవడం, బయటకు పారిపోవడం లాంటి పనులు కూడా చేస్తుంటారు. ఇందుకు పరిష్కారంగా వారికోసం ఆన్‌లైన్‌ కోర్సులని తీసుకొస్తున్నారు శారదాశ్రీరామ్‌. లాక్‌డౌన్‌ తర్వాత ప్రత్యేకంగా వీడియోలని చేసి వాట్సాప్‌లో తల్లిదండ్రులకు పంపేవారు. ఆపై విద్యార్థులతో మాట్లాడేందుకు వీలుగా గత అక్టోబర్‌ నుంచీ ఆన్‌లైన్‌ తరగతుల్ని నిర్వహిస్తున్నారు. రోజూ గంటపాటు సాగే ఈ తరగతులకు రాజమహేంద్రవరం పరిసరాల్లోని వారే కాకుండా హైదరాబాద్‌, తుని, కాకినాడ, విశాఖపట్నం లాంటి దూరప్రాంతాల పిల్లలు కూడా ఇందులో భాగస్వాములవుతున్నారు. మాస్కు ఎలా పెట్టుకోవాలి? వంట ఎలా చేయాలి? ఆటలు పాటలు ఇలా రోజుకో అంశంపై ఆన్‌లైన్‌లో దివ్యాంగ చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు శారద.  
- అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌, రాజమహేంద్రవరం
Tags :

ఆట-జ , ప-ల-లలక-ఆన-న , అమ-మ , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121023811 , Kids , Children

వెయ్యిమంది దంపతుల తారక మంత్రం శ్రమయేవ జయతే!


వెయ్యిమంది దంపతుల తారక మంత్రం శ్రమయేవ జయతే!
భార్య భర్త ఒకే కార్యాలయంలో పనిచేయడం మనం చూస్తుంటాం! అదే కార్యాలయమంతా భార్యభర్తలే పనిచేస్తుంటే...నెల్లూరుజిల్లాలోని అపాచీ సంస్థ దంపతులకు కలిసి పనిచేసే అవకాశాన్ని ఇస్తోంది. అటువంటి అవకాశాన్ని వాడుకుని వెయ్యిమంది మహిళలు తమ కుటుంబాలకు ఇరుసుగా మారిన  కథ ఇది...
సాధారణంగా ఒకే శాఖలో కొలువులు సాధించిన భార్యభర్తలను చూసుంటాం.. కానీ ఒకే కార్యాలయంలో పనిచేసే దంపతులను తక్కువగానే చూస్తాం. కానీ ఇలా కొన్ని వందల జంటలు ఒకే చోట కొలువుతీరడం మాత్రం చూసుండం. ‘ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూసొలుపేమున్నదీ’ అని పాడుకుంటూ కలిసిమెలిసి పనిచేసే భార్యభర్తల్ని చూడాలంటే మాత్రం తడ మండలం మాంబట్టు సెజ్‌లో ఉన్న అపాచీ బూట్ల తయారీ పరిశ్రమలో అడుగుపెట్టాల్సిందే. తడ మండలంలో ఈ విదేశీ పరిశ్రమ 2006లో కొలువు దీరింది. భర్త ఒక చోట, భార్య మరో చోట కాకుండా ఇద్దరూ ఉపాధి పొందే అవకాశం కల్పించిందీ సంస్థ. దాంతో నాడు కూలీలుగా జీవనం భారంగా నెట్టుకొచ్చిన కొందరు, నేడు ఉద్యోగులుగా చేరి నెలవారీజీతం పొందుతున్నారు. పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఉపాధి దొరకడంతో చాలీచాలని వేతనాలతో నలిగిపోయిన వారి జీవితాల్లో వెలుగులు తొంగిచూశాయి. పట్టణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా పల్లెల్లోనూ పక్కా ఇళ్లు వెలుస్తున్నాయి. పిల్లల్ని కార్పొరేటు పాఠశాలల్లో చేర్పించి మెరుగైన విద్య అందిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ జంటగా వెళ్లి విధులు ముగించుకుని ఆఫీసు బస్సుల్లోనే క్షేమంగా ఇంటికి చేరుతున్నారు. అటు ఉపాధి, ఇటు భద్రత ఉండడంతో కార్మికులు నిశ్చింతగా ఉంటున్నారు.  పరిశ్రమలో దంపతులు ఒకరినొకరు చేర్పించుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. ముందుగా భర్త కార్మికుడిగా పనిచేస్తుంటే.. పెళ్లయ్యాక భార్యను చేర్పించుకోవచ్చన్నమాట. ఇలా దంపతుల సంఖ్య ఈపరిశ్రమలో ఎక్కడా లేని విధంగా అంతకంతకూ పెరుగుతూపోతోంది. ఈ పరిణామం మాకు ఆనందదాయకమేనని యాజమాన్యం చెబుతోంది.  
బేల్దారి పని నుంచి...
దయాకర్‌, రాజేశ్వరి దంపతులది మన్నారు పోలూరు ప్రాంతం. అపాచీలో చేరక ముందు బేల్దారి కూలీ పనులకు వెళ్లే వాడు దయాకర్‌. ఒక రోజు పని ఉంటే మరో రోజు ఉండేది కాదు. తొలుత తాను పరిశ్రమలో చేరాడు. పెళ్లయ్యాక భార్యను కూడా పరిశ్రమలో చేర్పించాడు. పదేళ్లుగా ఇద్దరూ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఒకరి జీతం ఇంటి అవసరాలకు సరిపోగా రెండో జీతం మిగులుతోంది. పరిశ్రమలో చేరాక ఇద్దరికీ కలిపి రూ.40వేలు దాకా జీతం వస్తోంది. ఓ యాక్సిడెంట్‌లో దయాకర్‌ కాలు విరిగి ఆసుపత్రి పాలయినా... ఇంటిని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిపిస్తున్నాడంటే కారణం అతని భార్య రాజేశ్వరి జీతమే.  
* అక్కంపేటకు చెందిన వెంకటరమణయ్య, అరుణ దంపతులది నిరుపేద కుటుంబం. వెంకటరమణయ్య రోజు కూలీగా పనిచేసేవాడు. కుటుంబ అవసరాలకు చాలా అప్పులు చేశాడు.  అపాచీలో చేరిన తర్వాత వాళ్ల జీవితాల్లో వెలుగులు పూయడం మొదలయ్యింది. 15 ఏళ్లుగా భార్యభర్తలిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. రమణకి అరుణ జీతం కూడా తోడైన తర్వాత వాళ్ల పిల్లల్ని ఇంగ్లీషు మీడియం పాఠశాలలో చదివిస్తున్నారు. కొత్త ఇల్లు కట్టుకున్నారు. ‘ఒక్క జీతంతో ఇవన్నీ సాధ్యమవ్యేవి కావు. అరుణ జీతం వల్లే మా జీవితాల్లో కొత్త వెలుగులు పూస్తున్నాయి’ అంటున్నాడు వెంకటరమణయ్య. ఇలాంటి జీవితాలు ఇక్కడ ఎన్నో కనిపిస్తాయి.
- చిల్లకూరు చంద్రమోహన్‌రెడ్డి, తడ
Tags :

వ-య-మ-ద , ద-పత-ల , త-రక , మ-త-ర , శ-రమయ-వ , జయత , Eenadu , Vasundhara , Article , General , 1001

నాటుకోడితో కోట్లు కూడగట్టారు!


నాటుకోడితో కోట్లు కూడగట్టారు!
రూపాయి అంటే తేలిగ్గా తీసుకుంటాం. కానీ... వాళ్లు వారానికి అర్ధరూపాయి కోసం కష్టపడ్డారు..అంతా కలిసి నెలకి రూ. 20 పోగేసి నాటుకోళ్లను  పెంచడం మొదలుపెట్టారు. ఈరోజు వాళ్ల వ్యాపారం విలువ రూ.14 కోట్లు. వాళ్లలో ఆ చైతన్యాన్ని నింపింది చంద్రకాళి...
మధ్యప్రదేశ్‌లోని దిండోరీ జిల్లాలో ఉంటారు బార్గా తెగ ఆదివాసీలు. బాహ్య ప్రపంచానికి దూరంగా.. అటవీ జీవనం సాగిస్తారు. వర్షాధారంపై ఆధారపడి ఏవో చిన్నా చితకా పంటలు వేస్తుంటారు కానీ ఆ గింజలు చేతికి రావడం కష్టమే! అందుకే చంద్రకాళి అన్నయ్యలు పనికోసం అడవి విడిచి నగరాల బాట పట్టారు. ఆ తెగలో అమ్మాయిలు ఐదో తరగతి చదువుకుంటే గొప్ప. ఎంతమొత్తుకున్నా వినకుండా... చంద్రకి ఐదో తరగతిలోనే చదువు మాన్పించి, పదకొండేళ్లకే పెళ్లి చేశాడు ఆమె తండ్రి. తెగలో అందరి ఆడపిల్లల్లానే తలవంచి తాళి కట్టించుకుంది. 19 ఏళ్లు వచ్చేసరికి.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా ప్రధాన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోని ఓ పొదుపు సంఘంలో సభ్యురాలిగా చేరింది. ఆ సంస్థకు చంద్రలోని చురుకుదనం నచ్చింది. చంద్రకు కూడా పొదుపులోని శక్తి ఏంటో అర్థమైంది. వర్షాధారంపై ఆధారపడి పంటలు పండించేకన్నా ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలనుకుంది. అంతకంటే ముందు తోటి ఆదివాసీ సభ్యులను ఏకం చేసింది. అయితే వాళ్లంతా ఇంట్లో మగవాళ్లపై ఆధారపడ్డవాళ్లు. దాంతో వారానికి అర్ధరూపాయి చొప్పున పోగేయడం కూడా కష్టమయ్యింది. మొదటినెల అంతా కలిస్తే 20 రూపాయలే వచ్చింది. ఆ డబ్బుతోనే నాటుకోళ్లను పెంచడం మొదలుపెట్టారు. వాళ్ల పొదుపు గురించి పక్క ఊరుకి కూడా తెలిసింది. వాళ్లూ తోడయ్యారు. రోజులు... నెలలు... సంవత్సరాలు గడిచాయి. చంద్రలో పట్టుదల పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. అలాగే చిన్న పొదుపు సంఘం కాస్త... పెద్ద కోపరేటివ్‌ సంస్థగా మారింది. అర్ధరూపాయితో మొదలై ప్రస్తుతం రూ.14 కోట్ల వ్యాపారంగా మారింది. అంతటితో ఆగిపోకుండా చంద్ర ఆధ్వర్యంలో పుట్టగొడుగుల పెంపకం, కాయగూరల తోటలు వేసి ఆ మహిళలు లాభాల్ని ఆర్జిస్తున్నారు. ఈ మార్పునకు కారణమైన చంద్ర కృషిని గుర్తిస్తూ సీఐఐ ఫౌండేషన్‌ ఆమెకి ఈ ఏడాది మూడులక్షల రూపాయల బహుమతిని ప్రకటించింది. ‘ఈ డబ్బుతో మోటార్‌ సైకిల్‌ని కొనుక్కుంటా.’ అంటోంది చంద్రకాళి.
Tags :

న-ట-క-డ-త , క-ట-ల , క-డగట-ట-ర , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121021716 , Country-chicken , Inspirational

21 ఏళ్లకే వ్యాపార పాఠాలు!


21 ఏళ్లకే వ్యాపార పాఠాలు!
అనారోగ్యంపాలైన తండ్రి స్థానంలో కుటుంబానికి అండగా ఉండేందుకు... పశువుల కొట్టంలో అడుగుపెట్టింది శ్రద్ధ...  వ్యాపారం అనే పదానికి అర్థం తెలియని పసివయసులో..   పాలవ్యాపారానికి సంబంధించి పాఠాలు నేర్చుకుంది.. చదువుకుంటూనే, యువ వ్యాపారవేత్తగా మారిన 21 ఏళ్ల శ్రద్ధా ఇప్పుడు యువతకు వ్యాపార పాఠాలు చెబుతోంది....
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే నిఘోజ్‌ గ్రామానికి చెందిన సత్యాధావన్‌ది పాలవ్యాపారం. అతను పెద్దగా చదువుకోలేదు. అందుకే తన కూతురు శ్రద్ధాధావన్‌, కొడుకు కార్తీక్‌లను బాగా చదివించాలనుకున్నాడు. కానీ అనుకోకుండా వచ్చిన అనారోగ్యంతో అతని పాలవ్యాపారం కుంటుపడింది. చూసేవాళ్లు లేకపోవడంతో ఒక్క పశువుని మాత్రం తన వద్ద ఉంచుకుని, తక్కిన వాటిని అమ్మేశాడు. చూస్తుండగానే కుటుంబ పోషణతోపాటూ పిల్లల చదువులూ అతనికి భారంగా మారాయి. తన తర్వాత తన కుటుంబాన్ని, ఉన్న చిన్నపాటి పాలవ్యాపారాన్ని ఎవరికి అప్పగించాలో తెలియలేదు. ఆ సమయంలో అతని కళ్ల ఎదురుగా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే శ్రద్ధాధావన్‌ కనిపించింది. ‘అమ్మా... నువ్వు మన పాలవ్యాపారాన్ని చూసుకోగలవా?’ అని తండ్రి అడగ్గానే ఉత్సాహంగా ఊఁ కొట్టిందా పిల్ల. అప్పటికి ఆ చిన్నారి వయసు 11 ఏళ్లే. అయినా పరిస్థితులను అర్థం చేసుకుని పశువుల కొట్టంలోకి అడుగుపెట్టింది.
వ్యాపారం అనే పదానికి అర్థం కూడా తెలియని ఆ పసివయసులో తండ్రిని అడిగి ఎన్నో విషయాలు శ్రద్ధగా అడిగి తెలుసుకునేది. కొట్టాన్ని శుభ్రం చేయడం, పాలు తీయడం వంటి పనులని శ్రద్ధగా చేసేది. సైకిల్‌పై పాలకేంద్రాలకు పాలను తరలించేది. పశువులకు ఆరోగ్య సమస్యలొస్తే పశువైద్యులను సంప్రదించేది. అన్నింటికంటే ముఖ్యంగా సేంద్రియపద్ధతిలో పెంచిన గ్రాసాన్ని మాత్రమే వాటికి ఆహారంగా వేసేది. దాంతో పశువులు ఆరోగ్యంగా ఉండి పాలు పుష్కలంగా ఇచ్చేవి. దాంతో మిగిలిన పాలను గ్రామంలో అవసరమైనవారికీ అమ్మేది. బాధ్యతలు పెరిగేసరికి సైకిల్‌ని వదిలి బైకు నడపడం నేర్చుకుంది.
రెండు అంతస్థుల్లో పశువుల కొట్టం..
గ్రామంలో బైకుపై తిరుగుతూ పాలను విక్రయించే మొదటి ఆడపిల్ల అయ్యింది శ్రద్ధా. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదామె. స్కూల్‌కు ఒక్కసారికూడా గైర్హాజరు అయ్యేదికాదు. హోంవర్క్‌కు ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించుకుని ఆ పని పూర్తిచేసేది. శ్రద్ధా తమ్ముడు ఆమె కన్నా నాలుగేళ్లు చిన్నోడు. ‘నేను బాగా చదివితేనే, వాడు నన్ను స్ఫూర్తిగా తీసుకుంటాడు. అందుకే ఓవైపు పాలవ్యాపారాన్నీ, మరోవైపు చదువును సమన్వయం చేసుకుంటున్నాను. ప్రస్తుతం డిగ్రీ పాసయ్యా. ఫిజిక్స్‌ అంటే ఇష్టం. అందుకే ఈ సబ్జెక్ట్‌లో మాస్టర్స్‌  చేయాలనుకుంటున్నా.  నా చేతిలోకి ఈ పాలవ్యాపారం వచ్చేసరికి నా వయసు 11 ఏళ్లే. అప్పటికి మా పశువుల కొట్టంలో ఒక్క పశువు మాత్రమే ఉండేది. ఇప్పుడు 80 వరకు ఉన్నాయి. వీటికోసం రెండు అంతస్థుల్లో పశువుల కొట్టం నిర్మించా. మా గ్రామంలోని రైతుల నుంచి సేంద్రియపద్ధతిలో పండించే గడ్డినే పశువులకు ఆహారంగా తీసుకుంటా. ఈ పదేళ్లలో అనుభవంతోపాటూ ఎన్నో మెలకువలనూ  తెలుసుకున్నా. మావూర్లో అందరూ చదివి, పట్నాలకు వెళుతున్నారు. నేను మాత్రం ఈ పాలవ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేస్తా. త్వరలో పాల ఉత్పత్తుల తయారీని ప్రారంభించాలనుకుంటున్నా. ఈ రంగంలో అడుగుపెట్టినందుకు నేను సిగ్గుపడటం లేదు. కుటుంబ బాధ్యతలను కాస్తంత ముందుగా తీసుకున్నా అంతే. ఇప్పుడు మా డైయిరీ నుంచి రోజుకి 450 లీటర్ల పాలను విక్రయిస్తున్నాం. వీటిని తరలించడానికి జీపు డ్రైవింగ్‌ కూడా నేర్చుకున్నా. నెలకు ఆరులక్షల రూపాయల ఆదాయం వస్తోంది. యువత ఈ పరిశ్రమలోకి అడుగుపెడితే మరిన్ని విజయాలు సాధించొచ్చు. ఈ రంగంపై అందరికీ అవగాహన కలిగించేదిశగా ఆన్‌లైన్‌లో పలు సంస్థల తరఫున అతిథిగా ప్రసంగిస్తున్నా’ అని చెబుతోంది శ్రద్ధాధావన్‌.
Tags :

21 , ఏళ-లక , వ-య-ప-ర , ప-ఠ-ల , Eenadu , Vasundhara , Article , General , 1002 , 121019417 , Milk-booth

మిగిలిన అన్నాన్ని...అమృతంగా మార్చి!


మిగిలిన అన్నాన్ని...అమృతంగా మార్చి!
పిడికెడు పొట్ట నింపుకోవడానికి... పట్టెడన్నం చాలు.  కానీ దానికోసమే రోజంతా రెక్కలు ముక్కలు చేసుకునే వాళ్లు మాత్రం ఎందరో. అలా తమ దుకాణంలో ఆకలితో పనిచేస్తోన్న పనివారికి రోజూ భోజనం పెట్టాలనుకుందో మహిళ. ఆ సంకల్పమే ఇంతింతై... ‘అమృతమయి ఛారిటబుల్‌ ట్రస్టు’ ద్వారాఇప్పుడు నిత్యం వేలాది మంది కడుపు నింపుతోంది. ఆ మహిళే గుంటూరుకి చెందిన కొప్పురావూరి రజని.
రెండొందల మందికి అంచనా వేసుకుని గుంటూరు నగరంలో పుట్టినరోజు వేడుక నిర్వహించిందో కుటుంబం. కానీ భారీ వర్షం కారణంగా వందమంది మాత్రమే హాజరయ్యారు. దాంతో వండిన పదార్ధాలన్నీ మిగిలిపోయాయి. ఆ విషయం తెలుసుకున్న అమృతమయి వాహనం అక్కడికి చేరుకుంది. వాటిని సేకరించి నేరుగా రైల్వేస్టేషన్‌ కూడలికి వెళ్లి నిలిపింది. అంతే ఆకలితో ఉన్నవారంతా లైను కట్టారు. నిమిషాల్లోనే భోజనం అయిపోయింది. ఇది ఒక ఉదాహరణే కావొచ్చు కానీ...ఫలానా హోటల్లో, ఫంక్షన్‌లో ఎక్కడ ఆహారం ఉందని చెప్పినా ఇంతే చేస్తారు. ఆ పదార్థాలతో ఆకలిగా ఉన్నవారి కడుపు నింపుతారు రజని. ఈ ఆలోచన వెనక ఓ పెద్ద కథే ఉంది అంటారామె. ‘ముప్పై ఏళ్ల క్రితం గుంటూరులో ఓ దుస్తుల దుకాణం ప్రారంభించాం. షాపులో పనిచేసేవారు ఎప్పుడో పొద్దున్న తెచ్చుకున్న ఆహారం మధ్యాహ్నానికి పాడైపోయి తినలేని పరిస్థితి ఉండేది. అలాగని చేతిలో ఉన్న కొద్ది డబ్బులూ ఖర్చుచేసి బయట తినలేక అలానే ఉపవాసం ఉండేవారు. ఓ సారి ఈ విషయం నా దృష్టికి వచ్చింది. దాంతో మా దగ్గర పనిచేసే అందరికీ మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో వాళ్లకి నా ఆలోచన చెప్పడంతో ప్రోత్సహించారు. అలా మొదలయ్యింది ఈ కార్యక్రమం. ఈ పని మా ఇంటిల్లిపాదికీ సంతోషం కలిగించేది. తర్వాత  మరో అడుగు ముందుకేశా. తర్వాత రోజు నుంచి  గుంటూరు ఫీవర్‌ ఆసుపత్రిలో రోజూ నూటయాభైమందికి అన్నం వండి పెట్టడం మొదలుపెట్టా’ అంటారు రజని.
ఆహారం వృథా కానివ్వకుండా...  కుటుంబ సభ్యుల పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి సందర్భాలను కూడా అన్నదానం చేయడానికి ఉపయోగించుకున్నారు రజని. ‘ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా...సరే మా ఇంటి నుంచి అనాథ శరణాలయాలు, వసతిగృహాలు, రోడ్డు పక్కన ఉండేవారికి భోజనం పెట్టడాన్ని ఆనవాయితీగా చేసుకున్నాం. కానీ ఆకలితో ఇంకా ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. అందుకే అందరి సహకారమూ తీసుకోవాలనుకున్నా. శుభకార్యాలు, ఇతర వేడుకల్లో మిగిలిపోయిన ఆహారాన్ని వృథాకానివ్వకుండా నిస్సహాయులకు పంచితే... అనే ఆలోచన వచ్చింది. కానీ ఇది అనుకున్నంత సులువేం కాదు..ఏ మాత్రం తేడా వచ్చినా ఆరోగ్యంతో చెలగాటం ఆడినట్లే అందుకే ప్రత్యేక నిబంధనలు ఏర్పరుచుకున్నాం. జాగ్రత్తలూ తీసుకుంటాం. ఇందుకోసం సుమారు పదిలక్షల రూపాయలు వెచ్చించి ఆహార రవాణాకు ఓ వాహనం, డ్రైవరు, కొంత సామగ్రి ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ ఆహారం ఎక్కువగా ఉన్నా మాకు ఫోన్‌ చేయండి అంటూ కరపత్రాలు పంచాం. కల్యాణ మండపాలు, ఫంక్షనుహాలులో పోస్టర్లు వేశాం’ అంటారు రజని.
మూడులక్షల మందికి పైగా... రజని ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది.  క్యాటరింగ్‌ నిర్వాహకులు, కల్యాణ మండపాల వారు సమాచారం ఇస్తున్నారు. అలా ఆహారాన్ని సేకరించి ఇప్పటివరకూ సుమారు మూడులక్షలమందికి పైగా భోజనం అందించింది ఆమె సంస్థ. నెలకు రూ.లక్ష  నుంచి రూ.లక్షన్నర సొమ్ము వెచ్చిస్తున్నారు. ‘అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కడా అన్నం దొరక్కపోయినా మా వాహనాల్లో ఉంటుంది. నగరంతోపాటు పరిసర ప్రాంతాలైన సత్తెనపల్లి, తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోనూ మా వాహనం సేవలు అందిస్తోంది. ఇప్పటివరకూ సొంత డబ్బులతోనే ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం.  భవిష్యత్తులో ఫ్రీజర్లు ఏర్పాటుచేసి ఆహారం నిల్వచేసే ఆలోచన ఉంది’ అంటున్నారు రజని.
-పెనికలపాటి రమేష్‌, ఈనాడు, గుంటూరు
Tags :

మ-గ-ల-న , అన-న-అమ-త-గ , మ-ర-చ , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121015729 , Trust , Food

అడయారు అమ్మ!


అడయారు అమ్మ!
నెల్లూరు నుంచి వచ్చిన లక్ష్మి ఆసుపత్రిలో బెంచిపై కూర్చుంది. క్యాన్సర్‌ అని చెప్పి డాక్టర్‌ ఆమెను అక్కడకు పంపించారు.  ఇంతలో ఓ వృద్ధురాలు కారిడార్‌లోకి వస్తోంది. అందరూ చేతులు జోడించి లేచి నిలబడ్డారు. లక్ష్మి కూడా
నుంచుంది. నవ్వుతూ దేవతలా ఉన్న ఆమె...  డాక్టర్‌ వి శాంత. లక్ష్మి తన అనారోగ్యం గురించి ఆమెకు చెప్పింది. ‘భయపడకు... అంతా తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండు. డబ్బుల్లేవని బాధపడకు. చికిత్స అయ్యేవరకు ఇక్కడే ఉండి ఇంటికి వెళుదువుగాని’ అని ఎంతో మృదువుగా చెప్పిన ఆ డాక్టరమ్మ మాటతో లక్ష్మికి మరో జన్మవచ్చినట్లయింది. ఇలాంటి కథలు ఆ ఆసుపత్రి ప్రాంగణంలో ఎన్నెన్నో. తమిళ, కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్‌ సోకిన ఎందరో పేదలకు అడయార్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ దేవాలయం అయితే, దాన్ని ఇంతింతై... అన్నట్లుగా అభివృద్ధి చేసి, అధునాతనంగా మార్చి ఎంతో మంది ఇళ్లలో దీపం పెట్టింది 93ఏళ్ల డాక్టర్‌ శాంత. ఆమె భౌతికంగా లేకున్నా ఎంతో మంది ముఖాలపై చిరునవ్వుగా మిగిలింది...
డాక్టర్‌ శాంత అవివాహితగానే ఉన్నారు. ఈమె అందించిన సేవలకు పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌, రామన్‌ మెగసేసె వంటి అత్యున్నత పురస్కారాలు ఆమెను వరించాయి.
డెబ్భై ఏళ్ల క్రితంనాటి మాట...
23 ఏళ్ల శాంత మద్రాసు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. అప్పట్లో మహిళలు వైద్యవృత్తిలోకి అడుగుపెట్టడమే అరుదు. వచ్చినా గైనకాలజీ వంటి విభాగాలకే పరిమితం. అలాంటి సమయంలో తాను ఆంకాలజీ ఎంచుకున్నారామె. క్యాన్సర్‌ వ్యాధి
వస్తే ఇక బతుకులేదని భావించే కాలమది. వైద్యం చేసేవారూ అరుదు కావడంతో ఆ వ్యాధిపై ఎన్నో అపోహలు. విదేశాల్లో అయితే మెరుగైన వైద్య సౌకర్యాలున్నాయి. కానీ ఆ వ్యాధి ఏంటో కూడా తెలియకుండానే కన్నుమూసే క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులు ఇక్కడ ఎంతోమంది, వారికి సేవలందించాలని నిర్ణయించుకున్నారామె. ఆమె నిర్ణయాన్ని మొదట ఇంట్లో వారంతా వ్యతిరేకించారు. శాంత మాత్రం ధైర్యంగా ముందడుగు వేశారు. ఆ రోజుల్లో క్యాన్సర్‌ స్పెషలిస్టులకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉండేది. శాంతకు కూడా అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. అయినా ఆమె తన నిర్ణయానికే కట్టుబడ్డారు. ఇక్కడే ఉండిపోయారు.  చెన్నైలోని అడయార్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో విధుల్లో చేరారు. అప్పుడు అది కేవలం వైద్యశాల మాత్రమే. 12 పడకలుండేవి. అక్కడ శాంతతోపాటు మరో డాక్టర్‌, ఇద్దరు నర్సులు మాత్రమే ఉండేవారు. కానీ అక్కడకు వైద్యం కోసం చాలా మంది వస్తుండేవారు. వారికి ఈ కొద్దిమందే సేవలు అందిస్తుండేవారు. దీంతో డాక్టర్‌ శాంత ఆసుపత్రి ప్రాంగణంలోని ఓ గదిలోకి  మారిపోయారు. ఇరవై నాలుగ్గంటలూ రోగులకు వైద్యం అందించేవారు. అత్యంత నిరాడంబర జీవితాన్ని గడిపేవారామె. ఆ తరువాతే నెలకు 200 రూపాయల జీతాన్ని ఆసుపత్రి ఈమెకు అందించడం మొదలుపెట్టింది. తర్వాత ఆసుపత్రి విస్తరణకు తీవ్రంగా కష్టపడ్డారు.  ఈ 70 ఏళ్లలో ఈ ఆసుపత్రి సేవలు, పరిశోధనలు... ఇలా అన్ని రకాలుగా విస్తరించింది. 1982లో ప్రభుత్వపరంగా అనుమతిని పొంది అడయార్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో ఆంకలాజిక్‌ సైన్సెస్‌పై ప్రత్యేక కోర్సును ప్రారంభించి దేశంలోనే తొలి అడుగు వేశారు. ఈ వ్యాధిని గుర్తించడం నుంచి చికిత్సనందించేవరకు పరిశోధనా విధానాలను అభివృద్ధి చేశారు. అలాగే చికిత్సా విధానాలనూ పెంచారు. నోటి, గొంతు, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్లపై అధ్యయనం, పరిశోధన చేపట్టడానికి అత్యున్నత సౌకర్యాలున్న పరిశోధనాశాలల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపడుతూ, ఏయే ప్రాంతాల్లో ఏ రకమైన క్యాన్సర్‌ వ్యాధులున్నాయో గుర్తించి అక్కడ సేవలందిస్తున్నారు. ఇప్పుడు ఇనిస్టిట్యూట్‌లో 650 పడకలున్నాయి. రోజూ వందలాదిమంది క్యాన్సర్‌ బాధితులు ఈ ఆసుపత్రి వాకిట్లో అడుగుపెడతారు. అంతేమంది చికిత్స పొంది చిరునవ్వుతో వెనుదిరుగుతారు.
‘‘క్యాన్సర్‌ వస్తే ఇక మరణమే అనుకోవడం తప్పు. ఇది కూడా ఓ రకమైన అనారోగ్యమే అనేవారీమె. వైద్యంతో పాటు మానసిక ధైర్యం తోడుంటే దీన్ని కచ్చితంగా జయించగలమని చెప్పేవారు. రోగుల్లో తమకేమీ కాదనే నమ్మకాన్ని కలిగించేవారామె. ఆమె ఇచ్చిన ధైర్యంతో, చేసిన వైద్యంతో కోలుకున్నవారు వేలల్లో ఉంటారు. వ్యాధి దశను గుర్తించడంలో ఈమెకు ఈమే సాటి. ఎందరో వైద్యులు ఈమె అనుభవాలను పాఠాలుగా నేర్చుకున్నారు.  
జీవితం ఎంతో విలువైంది. నిమిషం కూడా వృథా చేయకూడదు. వేకువజామున నాలుగుగంటలకు నా రోజు మొదలవుతుంది. అవసరమైతే అర్ధరాత్రి కూడా విధులకు  సిద్ధంగా ఉంటా. వైద్యవృత్తి అంటే అంకితభావంతో చేయాలి. ప్రస్తుతం వచ్చే ఆధునిక చికిత్సా విధానాలతో మరికొంత మంది ప్రాణాలను కాపాడే అవకాశం వైద్యులకు ఉంది. దాన్ని నెరవేర్చితే చాలు.’’
- డాక్టర్‌ వి. శాంత
Tags :

అడయ-ర , అమ-మ , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121013425 , Cancer , Doctor , Mbbs

మన విజయను చూసి అమెరికా ఔరా! అంది..


మన విజయను చూసి అమెరికా ఔరా! అంది..
వివాదాలు తలెత్తినప్పుడు... సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆమెలోని న్యాయవాది బుర్ర పాదరసంలా పనిచేస్తుంది.... మంత్రం వేసినట్టుగా సమస్యలని చక్కబెట్టేస్తుంది... అమెరికాలో రాజకీయ విశ్లేషణలు చేసే ‘పొలిటికో’ పత్రిక ఏడాది క్రితం తెలుగమ్మాయి విజయగద్దెపై రాసిన వ్యాసం సారాంశం అది.. ఆ మాటలని అక్షరాలా నిజం చేస్తూ తాజాగా ట్రంప్‌ ట్విటర్‌ ఖాతాను తొలగించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది...
ఏడాది క్రితం... ట్విటర్‌ ఆఫీసులో ఆ సంస్థ సీఈవో జాక్‌డోర్సే తల పట్టుకుని కూర్చున్నాడు. అందుకు కారణం... అంతకు ముందు అమెరికన్‌ ఎన్నికల ప్రచారంలో ఎంతో కీలకంగా పనిచేసింది అని ప్రశంసలు పొందిన ట్విటర్‌ ఇప్పుడు అనేక నిందలని మోయాల్సి వస్తోంది. ఆ సమస్య నుంచి బయటపడే పరిష్కారం ఏంటో అతనికి తెలియడం లేదు. కానీ అతని ఎదురుగా కూర్చున్న సంస్థ న్యాయ సలహాదారు మాత్రం చాలా ప్రశాంతంగా ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించింది. ‘రాజకీయ ప్రకటనలని నిలిపేద్దాం’ అనే ఆమె నిర్ణయం ట్విటర్‌ని ఊపిరిపీల్చుకునేలా చేసింది. ఆ సమస్య నుంచి గట్టెక్కించింది. పదేళ్ల క్రితం విజయ ట్విటర్‌ సంస్థలో అడుగుపెట్టినప్పుడే భవిష్యత్తులో ఆ సామాజిక మాధ్యమ సంస్థ రాజకీయాలని ఎలా ప్రభావితం చేయనుందో గ్రహించగలిగారామె. అందుకనుగుణంగానే ఆమె నిర్ణయాలు తీసుకుంటూ ట్విటర్‌ని ఇతర సామాజిక మాధ్యమాలతో పోటీలో ముందు నిలపగలిగారు.  ఆ కారణంగానే ఫార్చ్యూన్‌ వంటి పత్రికలు సైతం ‘మునుపెన్నడూ చూడని ఎగ్జిక్యూటివ్‌’ అంటూ ఆమెపై ప్రసంశల వర్షం కురిపించాయి. కొన్నేళ్ల క్రితం టర్కీ వంటి దేశాలు ట్విటర్‌ని నిషేధించినప్పుడు ఆమె ధైర్యంగా పోరాడి గెలిచారు. టాప్‌లాయర్‌గా, ఎటువంటి సమస్యనైనా ఇట్టే చక్కబెట్టే ఎగ్జిక్యూటివ్‌గా పేరున్న విజయ మన తెలుగింటి అమ్మాయి కావడం విశేషం. విజయ హైదరాబాద్‌లో పుట్టారు. ఆమె తండ్రి మెక్సికోలోని ఆయిల్‌ రిఫైనరీస్‌లో కెమికల్‌ ఇంజినీర్‌గా పనిచేసేవారు. మూడేళ్ల పాపాయిగా ఉండగా హైదరాబాద్‌ నుంచి టెక్సాస్‌లోని బ్యూమాంట్‌ వెళ్లింది విజయ కుటుంబం. న్యూజెర్సీలో హైస్కూల్‌ చదువుని పూర్తిచేసుకుందామె. కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి ఇండస్ట్రియల్‌ అండ్‌ లేబర్‌ రిలేషన్‌షిప్‌లో డిగ్రీ పూర్తిచేసింది. న్యూయార్క్‌ యూనివర్సిటీ నుంచి న్యాయవాద విద్యను పూర్తిచేసింది. విజయ తండ్రి ఇన్సూరెన్స్‌ పాలసీలను కూడా చేయించేవారు. కానీ స్థానిక ప్రభుత్వం అనుమతి తీసుకుంటేకానీ ఈ పనిచేయడానికి ఆయనకు వీలుపడేది కాదు. ఇలాంటి సమస్యలను ప్రశ్నించాలంటే లా చదవడమే మార్గం అనుకున్నారామె. ‘స్కూల్‌, కాలేజీలో నేనొక్కదాన్నే భారతీయ అమ్మాయిని. అలాంటప్పుడు మన గొంతుక వినిపించడానికి ఎలా సాధ్యమవుతుంది? ఈ వెలితి నాకు బాగా  తెలుసు. అప్పుడే కోట్లాది మందికి చేరువయ్యే సామాజిక మాధ్యమాల శక్తిని గ్రహించాను. ట్విటర్‌ని అందుకు తగ్గట్టుగా తీర్చిదిద్దాను’ అంటారు విజయ. ట్విటర్‌లో రావడానికి ముందు పదేళ్లపాటూ జునిపెర్‌ నెట్‌వర్క్స్‌, విల్సన్‌ సాన్సినీ గుడ్‌రిచ్‌ వంటి సంస్థల్లో న్యాయసలహాదారుగా పనిచేశారు. కొత్త  తరాన్ని ముఖ్యంగా మహిళలని వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు హ్యాష్‌ ఏంజెల్స్‌ పేరుతో మరికొందరు మహిళలతో కలిసి ఇన్వెస్ట్ట్‌మెంట్‌ గ్రూప్‌ని మొదలుపెట్టారు. కాలిఫోర్నియాలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న విజయ ప్రస్తుతం ట్విటర్‌కి చీఫ్‌లీగల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కాల్పనిక సాహిత్యాన్ని ఇష్టపడే విజయ ట్విటర్‌లో తన ఫస్ట్‌ ట్వీట్‌  బ్రేక్‌ఫాస్ట్‌ గురించి అంటారామె.
Tags :

మన , వ-జయన , చ-స , అమ-ర-క , ఔర , అ-ద , Eenadu , Vasundhara , Article , General , 1001

నీకిక భయం లేదమ్మా!హాస్టల్‌కి వచ్చావుగా...


నీకిక భయం లేదమ్మా!హాస్టల్‌కి వచ్చావుగా...
ప్రసవం స్త్రీకి పునర్జన్మ అంటారు... ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇది అక్షరాలా నిజం.  ముఖ్యంగా  గిరిశిఖర గ్రామాల్లో ఉండే మహిళలు తల్లి అవ్వాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్‌లో అలాంటి గ్రామాలు వందల్లోనే ఉన్నాయి. అక్కడ పరిస్థితిని మార్చాలనుకున్నారు ఓ ఐఏఎస్‌ అధికారి. అందుకోసం... కాబోయే అమ్మలకు రెండు వసతి గృహాల్ని ఏర్పాటుచేశారు. అక్కడే ఉంటూ అన్ని రకాల వైద్య సేవలూ ఉచితంగా పొందుతూ, కాన్పు పూర్తయ్యాక పండంటి బిడ్డతో ఇంటికి తిరిగి వెళ్లొచ్చు.
ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో నేటికీ కనీస మౌలిక వసతులు కనిపించవు. రాకపోకలకు వీలుండదు, వైద్య సదుపాయాలూ దూరమే. అందుకే గిరిజన మహిళలకు ప్రసవమంటే ప్రాణాలతో పోరాటమే. అంతేకాదు, గర్భం దాల్చాక ఎలాంటి ఆహారం తీసుకోవాలీ, వైద్య పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలీ... ఇవన్నీ వారికి సరిగ్గా తెలీదు. ఏ అర్ధరాత్రో నొప్పులు వస్తే ఆ కొండల పైనుంచి డోలీలో తీసుకురావాల్సిందే. ఈ కారణాలతోనే పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి పరిధిలో ఉన్న 300 గిరిశిఖర గ్రామాల్లో నవజాత శిశువులు, బాలింతల మరణ వార్తలు తరచూ వినాల్సి వచ్చేది. 2018లో అప్పటి ఐటీడీఏ పీవో లక్ష్మీశ దీనికో పరిష్కారం చూపాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో దేశంలోనే తొలిసారిగా కాబోయే అమ్మలకు సాలూరు, గుమ్మలక్ష్మీపురంలలో వసతి గృహాల్ని ఏర్పాటు చేయించారు. ఈ హాస్టళ్ల రాకతో వారి రాత మారిందనే చెప్పాలి. ఇప్పటివరకూ ఈ హాస్టళ్లల్లో 1060 మంది వరకు గర్భిణులు ఆశ్రయం పొందారు. వారిలో 983 మందికి సహజ ప్రసవాలు చేయడం విశేషం. సగటున వారానికి పది కాన్పులైనా జరుగుతుంటాయి.
గర్భిణులు ఎనిమిదో నెల రాగానే ఇక్కడ వచ్చి చేరి ప్రసవం అయ్యేంత వరకూ ఉండొచ్చు. ప్రతి హాస్టల్‌లో ఒక ఇన్‌ఛార్జి డాక్టర్‌, 24 గంటలూ ఇద్దరు స్టాఫ్‌ నర్సులు అందుబాటులో ఉంటారు. గర్భిణులను హాస్పిటల్‌కు తీసుకువెళ్లేందుకు ఒక అంబులెన్స్‌ ఉంటుంది. హాస్టళ్లలో ఉన్నవారితో రోజూ ఉదయాన్నే యోగా చేయిస్తారు. పాలు, గుడ్లు, రాగి జావ, పండ్లూ అందిస్తారు. ఆకు కూరలు, మాంసం, చేపలు వంటి పోషకాహారం పెడుతున్నారు. ఇవి కాకుండా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే వేరుసెనగ చిక్కీలు, ఖర్జూరం వంటివి కూడా అందుతాయి. రక్తహీనత వంటి సమస్యలతో వచ్చేవారికి ఈ వసతి గృహంలో అన్ని రకాల వైద్య సేవలందిస్తూ వారి ప్రసవ సమయానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తకుండా సుఖప్రసవం అయ్యేలా చేస్తున్నారు. గర్భిణులను వారానికోసారి దగ్గర్లో ఉన్న ప్రభుత్వాసుపత్రులకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తుంటారు. వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆసుపత్రిలోనే గర్భిణులకు సుఖ ప్రసవం జరిగేలా వైద్య సిబ్బంది తీసుకుంటున్న చొరవ గురించి ఎంత చెప్పినా తక్కువే మరి. ఒక్కో హాస్టల్‌లో ఒకేసారి 40 మంది ఉండేందుకు ఏర్పాట్లు ఉన్నాయి.
‘ఈ దీర్ఘకాల సమస్యకి వసతి గృహాలతో పరిష్కారం చూపాలనుకున్నా. వీటివల్ల ఇంతమందికి ప్రయోజనం జరుగుతుందనుకోలేదు. నేను బదిలీ అయి వెళ్లినా దీన్ని అదే స్థాయిలో నిర్వహిస్తుండం గొప్ప విషయం’ అంటారు లక్ష్మీశ. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టరుగా ఉన్నారీయన. ఇలాంటి హాస్టళ్లని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీడీఏలలో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే అరకులోనూ ఓ హాస్టల్‌ని ప్రారంభించారు.
దేశంలోనే తొలిసారిగా ఈ తరహాలో ఏర్పాటుచేసిన వసతి గృహానికి జాతీయ స్థాయిలోనూ గుర్తింపు దక్కింది. ఈ హాస్టల్‌ను నీతి ఆయోగ్‌ కమిటీ సందర్శించి ప్రశంసలు కురిపించింది. ఈ వినూత్న ఆలోచనకు 2019లో జాతీయ స్థాయి పురస్కారం లభించింది.
-లక్కోజు శ్రీనివాసరావు, సాలూరు
- వారాడ అప్పలనాయుడు, గుమ్మలక్ష్మీపురం
Tags :

న-క , భయ , ల-దమ-మ-హ-స-టల-క , వచ-చ-వ-గ , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121007416 , Fear

మా మంచి బ్యాక్టీరియా... ఎక్కడున్నావ్‌?


మా మంచి బ్యాక్టీరియా... ఎక్కడున్నావ్‌?
పిండిని రొట్టెగా మార్చేది ఒకటైతే... పాలను పెరుగుగా మార్చేది ఇంకొకటి... కంటికి కనిపించని సూక్ష్మజీవులు మనిషికి చేసే సహాయం అనంతం... అలాంటి మంచి బ్యాక్టీరియా జాడ కనిపెట్టడమే ఆమె పని. ఒకటి కాదు, రెండుకాదు ఏకంగా 200 రకాల కొత్త బ్యాక్టీరియాలను గుర్తించారు హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్‌ సీహెచ్‌.శశికళ. ఈ పరిశోధనలే ఆమెను ప్రతిష్ఠాత్మకమైన ‘జానకీ అమ్మాళ్‌ నేషనల్‌ అవార్డు’కు ఎంపిక చేశాయి.
టొమాటో కెచప్‌ తెలుసుగా... ఎర్రగా, చూడగానే నోరూరిస్తుంటుంది. అదంత ఆకర్షణీయంగా ఉండడానికి తయారీదారులు రసాయన రంగులు ఉపయోగిస్తారు. రోడో స్పైరిల్లం సల్ఫ్యూరెక్సిజెంట్స్‌ అనే సూక్ష్మజీవులను శశికళ తన పరిశోధనలలో గుర్తించారు. ఇవి లైకోపిన్‌ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేయడాన్నీ గమనించారు. ఈ పదార్థం ప్రస్తుతం టొమాటో కెచప్‌లు, ఆహార ఉత్పత్తుల్లో సహజసిద్ధమైన వర్ణంగా ఉపయోగపడుతోంది. ఈ విధానంలో పలు సంస్థలు లైకోపిన్‌ను తయారుచేయడానికి ముందుకు రావడంతో శశికళ దానిపై పేటెంట్‌ హక్కును తీసుకున్నారు. ఇవే కాదు ఆక్వాకల్చర్‌లో మందులుగా ఉపయోగపడే సూక్ష్మజీవులను కూడా ఆమె గుర్తించారు. ఎన్నో ప్రఖ్యాత సంస్థలు ప్రస్తుతం దేశంలోని పలు చోట్ల చేపలు, రొయ్యల పెంపకంలో వాటిని ఉపయోగిస్తున్నారు. చేపల చెరువుల్లో  వేసిన ఆహారంలో మిగిలింది కుళ్లిపోయి, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌, అమోనియా వంటి రసాయనాలుగా మారతాయి. ఇవి మత్య్స సంపదపై తీవ్రప్రభావం చూపిస్తాయి. ఈ పరిస్థితుల్లో సూక్ష్మజీవులు ఆ రసాయనాలను తినేసి నీటిలో కాలుష్యాన్ని తగ్గిస్తాయి. కోళ్లఫారంలో చేరే వ్యర్థాలకు   ఈ బ్యాక్టీరియాలను కలిపితే దుర్వాసన దూరమవుతుంది. అలాగే  గట్టిపడే క్రూడ్‌ ఆయిల్‌, పెట్రోలు, డీజిల్‌ను ఇవి పలుచగా చేస్తాయి. ఇక భవననిర్మాణాల్లో ఉపయోగించే కాంక్రీట్‌లో ‘బాసిల్లస్‌’ వంటి బ్యాక్టీరియాను కలిపితే క్యాల్షియం కార్బోనేట్‌ అనే క్రిస్టల్స్‌ను ఉత్పత్తి చేసి మధ్యలో ఏర్పడే రంధ్రాలను పూడ్చి, ఆ నిర్మాణానికి ధ్రుఢత్వాన్ని తెస్తుంది. ‘ఇలా రోజువారీ జీవితంలో మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులను కనిపెడుతున్నందుకు వచ్చే ప్రశంసలకన్నా అందరికీ ఉపయోగపడేదే చేస్తున్నా అనే సంతృప్తి ఎక్కువ ఉంటుంది’ అని అంటారీమె.
అదో తపస్సు... సూక్ష్మజీవుల వర్గీకరణ సాధారణ విషయమేం కాదు. ఇవి కంటికి కనిపించవు. నిరంతరం వీటిపై నిఘా నేత్రం ఉండాల్సిందే. ఏ సందర్భంలో ఎలాంటి ఉత్పరివర్తనాలు వస్తున్నాయి. ఎప్పుడు ఎలా మార్పు చెందుతోందనేది అర్థం చేసుకోవడం చాలా సంక్లిష్టమైన విషయం. అనూహ్యంగా జరిగే అనేక మార్పులను గమనిస్తూ, నోట్‌ చేసుకుంటూ, గుర్తిస్తూ... ఇలా ఆమె జీవితం రోజూ ఓ తపస్సులా ఉంటుంది. ఈమె పరిశోధనశాల మొత్తం భద్రపరిచిన సూక్ష్మజీవులే ఉంటాయి. రెండు దశాబ్దాలుగా వేలకొలదీ సూక్ష్మజీవులను విడదీసి పరిశీలించి కొత్తవాటిని గుర్తించి నామకరణం చేస్తున్నారీమె. వీటిని పలు ప్రయోజనాలకు వినియోగించేలా చేసి వాటిపై పేటెంట్‌ హక్కునూ పొందారు. బ్యాక్టీరియాలను గుర్తించే పనిలో సహజసిద్ధంగా నీరు, మట్టి, నాచు వంటివాటినే  శశికళ ఎంచుకుంటారు. గుర్తించిన వాటి ఎదుగుదలకు అవసరమయ్యే ప్రత్యేక పరిస్థితులను కల్పించి వాటిని వృద్ధి చేస్తారు. దీనికి రోజులు, నెలలు కూడా పట్టొచ్చు. రెండు దశాబ్దాలుగా ఈమె చేపడుతున్న ఈ పరిశోధనలలో ఇప్పటి వరకు 200 రకాల కొత్త బ్యాక్టీరియాలను గుర్తించారు. ఆమె ప్రస్తుతం జేఎన్‌టీయూలో సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌, బ్యాక్టీరియల్‌ డిస్కవరీ ల్యాబొరేటరీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. విశ్వవిద్యాలయం ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌కు ఛైర్‌పర్సన్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Tags :

, మ-చ , బ-య-క-ట-ర , ఎక-కడ-న-వ , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121006776 , Bacteria