‘పెద్దయ్యాక ఏదేదో కావాలని చిన్నప్పుడు కలలు కంటాం.. వాటిని చేరుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడమే అసలైన జీవితం’ అంటున్నారు అమెరికాకు చెందిన అమీ పాల్మెరో వింటర్స్. చిన్నతనంలో కారు ప్రమాదంలో తన ఎడమ కాలిని పోగొట్టుకున్న ఆమె.. ‘నా తలరాత ఇంతే!’ అని బాధపడలేదు. పడిలేచిన కెరటంలా పరుగును తన ఆరో ప్రాణంగా మార్చుకుంది. పెట్టుడు కాలితోనే పలు మారథాన్‌లలో పాల్గొని పదికి పైగా ప్రపంచ రికార్డులు తన పేరిట లిఖించుకుంది.