అర్ధరాత్రి ఆకలేస్తోందా... డైటింగ్‌లో భాగంగా చాలామంది రాత్రిళ్లు తక్కువగా ఆహారం తీసుకుంటారు. దాంతో అర్ధరాత్రి ఆకలి వేయడంతోపాటు సరిగా నిద్రపట్టదు కూడా. అలాంటప్పుడు త్వరగా జీర్ణమై, తక్కువ కెలొరీలు ఉండే ఆహారం తీసుకుంటే మంచిది. ఇవన్నీ అలాంటివే... పండ్లు: వీటిలో పోషకాలు ఎక్కువగా కెలొరీలు తక్కువగా ఉంటాయి. ఆయా కాలాల్లో దొరికే పండ్లను తింటే కడుపు నిండటంతోపాటు హాయిగా నిద్రపడుతుంది కూడా. మరమరాలు: వీటిని నూనె లేకుండా వేయించి ఉప్పూ, కారం కలిపి డబ్బాలో భద్రపరుచుకుంటే అర్ధరాత్రి ఆకలి తీర్చుకోవచ్చు. కాస్త రుచిగా ఉండాలంటే వీటిల్లో వేయించిన పల్లీలు, పుట్నాలు కలపొచ్చు కూడా. తృణధాన్యాల చిప్స్: జొన్నలు, రాగి, కొర్రలతో చేసిన చిప్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వీటిని తింటే ఆకలి తీరడంతోపాటు పోషకాలూ అందుతాయి. Tags :