పెట్టుబడి రూ.100... లాభం లక్షల్లో! : vimarsana.com

పెట్టుబడి రూ.100... లాభం లక్షల్లో!


పెట్టుబడి రూ.100... లాభం లక్షల్లో!
బాల్యం నుంచి వ్యాపార రంగంలో అడుగుపెట్టాలని ఆమె కల.. తెలిసిన పాకశాస్త్రాన్నే ఎంచుకుని.. లాభాలు గడించింది. అంతలోనే చోరీకి గురైన ఆమె దుకాణం నష్టాల్లోకి నెట్టేసింది చేతిలో పైసా లేదని కూర్చోలేదు రూ.100 పెట్టుబడితో తిరిగి వ్యాపారిగా నిలదొక్కుకుంది తనను నమ్ముకున్న మహిళలందరికీ తిరిగి ఉపాధిని కల్పించింది  స్ఫూర్తి కథనాలు చదివి ఎదిగిన ఈమె మరెందరికో మార్గదర్శకంగా నిలిచింది.  ఉత్తమ వాణిజ్యవేత్తగా అవార్డునూ అందుకుందీ... కేరళకు చెందిన ఇలవరసీ జయకాంత్‌.  జీరో స్థాయి నుంచి ఎదిగి తనను తాను నిరూపించుకున్న ఈమెపై స్ఫూర్తి కథనం...
ఇలవరసీ ఇంట్లో తాతల కాలం నుంచి తల్లిదండ్రుల వరకు అందరూ స్వీట్లు, కారాలు, చిప్స్‌ తయారుచేసేవారు. వాటిని ఇంటింటికీ తిరిగి విక్రయించేవారు. చుట్టుపక్కల గ్రామాల్లో వారితోపాటు తాను కూడా అమ్ముతూ, తన వంతు సాయం చేసేదీమె. అలాగే అమ్మమ్మ, అమ్మతో కూర్చుని వారు వండే వంటకాల గురించి తెలుసుకుంటూ, అడిగి తయారుచేయడమెలాగో నేర్చుకునేది. తానూ పెద్దైన తరువాత  వారిలాగే ఇదే రంగంలో అడుగుపెట్టి మంచి వ్యాపారవేత్తగా ఎదగాలని చిన్నప్పటి నుంచి కలలు కనేది.
పెళ్లై అత్తారింటికి వచ్చిన ఆమెకి మనసులో ఆలోచన మాత్రం అలాగే ఉండిపోయింది. భర్తతో తన కల గురించి చెప్పింది. అత్తింటి సహకారంతో పలురకాల స్వీట్లు, స్నాక్స్‌ చేసి ఇంటికి చుట్టుపక్కల ఉండే దుకాణాలకు అమ్మేది. వినియోగదారులు ఇష్టపడితే వాటిని మళ్లీ వండి తీసుకొస్తానని చెప్పేది. అలాగే పొరుగువారికీ తన వంటల రుచిని చూపించేది. అలా కొన్నాళ్లకు ఇలవరసీ వంటల రుచికి అందరూ ఫిదా అయిపోయేవారు. ఇళ్లకు, చిన్నచిన్న దుకాణాలకు మాత్రమే కాకుండా చిన్న సూపర్‌మార్కెట్‌లా తెరవాలనుకుంది. అదే విషయం భర్తకు చెప్పి, ఆయన అనుమతితో త్రిసూరులో ప్రారంభించాలనుకున్నారు. దాంతో అప్పటివరకు పొదుపు చేసిన నగదుతోపాటు, తెలిసినవారి వద్ద, బ్యాంకులో రుణాన్ని తీసుకుని రూ.50 లక్షలు పెట్టుబడితో పదేళ్లక్రితం చిన్న మార్ట్‌ను ప్రారంభించింది. ఇందులో రకరకాల స్నాక్స్‌, చిప్స్‌ను ప్రత్యేకంగా ఉంచేది.
విక్రయాలు పెరిగి..
ఇలవరసి వంటకాలను ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొనుగోలు చేసేవారు. నెమ్మదిగా వ్యాపారం అభివృద్ధి చెందింది. 50 మంది పేద మహిళలకు అందులో ఉపాధిని కల్పించింది.  వినియోగదారుల అభిరుచినీ దృష్టిలో ఉంచుకుని రకరకాల వంటకాలను తయారుచేసేదీమె. అలా హల్వా, కేకులు, చిప్స్‌ నుంచి కూరగాయలు, నిత్యావసరవస్తువుల సంఖ్యనూ పెంచింది. నెమ్మదిగా అప్పులు తీరుస్తున్న సమయానికి అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఓ అర్ధరాత్రి  దుకాణంలో దోపిడి జరిగింది. ఓవైపు బ్యాంకు రుణం, తెలిసినవారి వద్ద తీసుకున్న అప్పులు ఆమెను చుట్టుముట్టాయి. దాంతో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలైంది.
కొన్ని నెలలపాటు ఆసుపత్రిలోనే గడిపిన తనకు జీవితమేంటో తెలిసింది అని చెబుతోందీమె. ‘ఆసుపత్రి నుంచి వచ్చాక తిరిగి వ్యాపారం మొదలుపెడదామనుకున్నా. చేతిలో చిల్లిగవ్వ లేదు, ఇంట్లోవాళ్లు వద్దన్నారు. అప్పటికి చేతిలోని రూ.100 పెట్టుబడి అయ్యాయి. ‘అశ్వతి హాట్‌ చిప్స్‌’ పేరుతో త్రిసూరు రైల్వేస్టేషన్‌ వద్ద చిన్న కొట్టు తెరిచా.   గారెలు, చిప్స్‌ను రైలు ప్రయాణికులకు విక్రయించేదాన్ని. అలా కొన్నినెలలపాటు కష్టపడ్డా. నా కష్టం చూసి కుటుంబం అండగా నిలబడింది. అలా ఆర్నెళ్లలో వ్యాపారం నిలదొక్కుకుంది. ఎనిమిదేళ్లలో మొత్తం అప్పులు తీరిపోగా, మరో నాలుగు శాఖలనూ ప్రారంభించాం. ఇప్పుడు నెలకు అయిదు లక్షల రూపాయలను సంపాదించగలుగుతున్నా. మరికొందరు మహిళలకు ఉపాధినీ చూపించగలిగా. నా పట్టుదల, కృషికి గుర్తింపుగా 2019లో ‘ఇంటర్నేషనల్‌ పీస్‌ కౌన్సిల్‌ యుఏఈ అవార్డు’ పేరుతో ఉత్తమ వాణిజ్యవేత్తగా పురస్కారాన్ని అందుకున్నా’ అని చెబుతోంది ఇలవరసి.
Tags :

Related Keywords

, ప ట బడ , ర 100 , ల భ , లక షల ల , Eenadu , Vasundhara , Article , General , 1001 , 121052513 , Business , Shop , Women , Job , Sweets , Chips , Kerala , Vasundara , Eenadu Vasundhara , Successful Women Stories In Telugu , Beauty Tips In Telugu , Women Health Tips In Telugu , Women Fitness Tips In Telugu , Cooking Tips In Telugu , Women Diet Tips In Telugu , Dear Vasundhara , Women Fashions , Girls Fashions , Women Beauty Tips , Women Health Problems , Parenting Tips , Child Care , Women Hair Styles , Financial Tips For Women , Legal Advice For Women , Fitness Tips , Shopping Tips , Top Stories , Telugu Top Stories , ஈனது , வாசுந்தர , கட்டுரை , ஜநரல் , வணிக , கடை , பெண்கள் , வேலை , இனிப்புகள் , சீவல்கள் , கேரள , ஈனது வாசுந்தர , வெற்றிகரமாக பெண்கள் கதைகள் இல் தெலுங்கு , அழகு உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , பெண்கள் ஆரோக்கியம் உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , பெண்கள் உடற்பயிற்சி உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , சமையல் உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , பெண்கள் உணவு உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , அன்பே வாசுந்தர , பெண்கள் ஃபேஷன்கள் , பெண்கள் அழகு உதவிக்குறிப்புகள் , பெண்கள் ஆரோக்கியம் ப்ராப்லம்ஸ் , பெற்றோருக்குரியது உதவிக்குறிப்புகள் , குழந்தை பராமரிப்பு , பெண்கள் முடி பாணிகள் , நிதி உதவிக்குறிப்புகள் க்கு பெண்கள் , உடற்பயிற்சி உதவிக்குறிப்புகள் , கடையில் பொருட்கள் வாங்குதல் உதவிக்குறிப்புகள் , மேல் கதைகள் , தெலுங்கு மேல் கதைகள் ,

© 2024 Vimarsana