‘దేశంలో ప్రస్తుతం యూకే వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొంత కాలంగా డబుల్ మ్యూటెంట్ వేగంగా వ్యాప్తి చెందినా, ప్రస్తుతం యూకే రూపాంతరితమే సమస్యగా మారింది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే సెకండ్ వేవ్ ఉధృతికి ప్రధాన కారణం..’అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ‘సాక్షి’కి తెలిపారు. ప్ర: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజుకు నాలుగు లక్షలకు చేరువ అవుతోంది.