'డీ'లా పడిప&

'డీ'లా పడిపోవద్దు!


‘డీ’లా పడిపోవద్దు!
విటమిన్‌ డి తీరే వేరు. అవటానికిది విటమినే అయినా హార్మోన్‌ మాదిరిగా పనిచేస్తుంది. చర్మానికి ఎండ తగిలినపుడు కొలెస్ట్రాల్‌ నుంచి దీన్ని మన శరీరమే తయారుచేసుకుంటుంది. కొవ్వుతో కూడిన చేపల వంటి వాటిల్లోనూ విటమిన్‌ డి ఉన్నప్పటికీ ఆహారం ద్వారా దీన్ని తగినంత తీసుకోవటం చాలా కష్టం. శరీరంలోని పలు వ్యవస్థలపై గణనీయమైన ప్రభావం చూపే విటమిన్‌ డి లోపంతో ఎంతోమంది బాధపడుతున్నారు. పైకి ఎలాంటి లక్షణాలూ కనబడకపోవటం వల్ల చాలామంది దీన్ని పట్టించుకోవటం లేదు. నిజానికి విటమిన్‌ డి లోపం పలు సమస్యలకు దారితీయొచ్చు. కొన్ని కొన్ని లక్షణాల ఆధారంగా దీని లోపాన్ని గుర్తించొచ్చు.
తరచుగా జబ్బుపడటం: రోగనిరోధక వ్యవస్థ బలంగా పనిచేయటంలో విటమిన్‌ డి కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్‌ఫెక్షన్లతో పోరాడే కణాలతో ఇది నేరుగా చర్య జరుపుతుంది. అందువల్ల విటమిన్‌ డి లోపిస్తే జలుబు, ఫ్లూ వంటివి తరచుగా దాడిచేస్తుంటాయి.
నిస్సత్తువ: అలసట, నిస్సత్తువకు దారితీసే అంశాల్లో విటమిన్‌ డి లోపం ఒకటి. దురదృష్టవశాత్తు చాలామందికి విటమిన్‌ డి లోపమన్నదే గుర్తుకురాదు. రక్తంలో దీని స్థాయిలు తగ్గితే తీవ్రమైన నిస్సత్తువకు దారితీస్తుంది.
వెన్నునొప్పి: ఎముకల దృఢంగా, ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్‌ డి ఎంతగానో తోడ్పడుతుంది. ఇది మనం తిన్న ఆహారం నుంచి శరీరం క్యాల్షియాన్ని మరింత ఎక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. అందువల్ల విటమిన్‌ డి లోపిస్తే వెన్నునొప్పి, ఎముకల నొప్పుల వంటివి బయలుదేరొచ్చు. దీని లోపంతో చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరిగే ప్రమాదముంది.
కుంగుబాటు: ఎప్పుడూ విచారంతో ఉంటున్నట్టు గమనిస్తే విటమిన్‌ డి లోపం కూడా కారణం కావొచ్చని అనుమానించాలి. రక్తంలో విటమిన్‌ డి స్థాయులు తగ్గటానికీ కుంగుబాటుకూ సంబంధం ఉంటున్నట్టు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
పుండ్లు మానకపోవటం: ఏదైనా దెబ్బ తగిలినపుడు, సర్జరీల వంటివి చేయించుకున్నప్పుడు గాయం, కోతలు త్వరగా మానకుండా వేధిస్తుంటే విటమిన్‌ డి లోపం ఉందేమో ఒకసారి పరీక్షించుకోవటం మంచిది. ఎందుకంటే పుండు మానే క్రమంలో కొత్త చర్మం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించే రసాయనాల ఉత్పత్తికి విటమిన్‌ డి తోడ్పడుతుంది మరి. అంతేకాదు, వాపు నియంత్రణలోనూ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటంలోనూ ఇది పాలు పంచుకుంటుంది.
జుట్టు ఊడటం: వెంట్రుకలు ఊడిపోతుంటే ముందుగా ఒత్తిడే గుర్తుకొస్తుంది. కానీ కొన్ని జబ్బులతో పాటు విటమిన్‌ డి లోపం సైతం జుట్టు ఊడిపోవటానికి దోహదం చేయొచ్చు.
Tags :

Related Keywords

, డ ల , పడ ప వద ద , Eenadu , Sukhibava , Article , General , 30801 , 121046485 , Health News , 1d Vitamin , Sun , ఆర గ య , స ఖ భవ , స ర యరశ మ , డ వ టమ న , Health Tips In Telugu , Fitness Tips In Telugu , Child Care Tips In Telugu , Nutrition Tips Telugu , Heart Care In Telugu , Liver Care In Telugu , Pulmonary Care In Telugu , Eye Care In Telugu , Skin Care In Telugu , Pregnancy Care In Telugu , Health Tips , Fitness Tips , Child Care , Natural Medicine , Home Remedies , Health Care Tips , Eenadu Sukhibava , Pregnancy Care , Food , Fruits , Vegetables Top Stories , Telugu Top Stories , ஈனது , சுகிபாவா , கட்டுரை , ஜநரல் , ஆரோக்கியம் செய்தி , ட வைட்டமின் , சூரியன் , ஆரோக்கியம் உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , உடற்பயிற்சி உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , குழந்தை பராமரிப்பு உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , ஊட்டச்சத்து உதவிக்குறிப்புகள் தெலுங்கு , இதயம் பராமரிப்பு இல் தெலுங்கு , கல்லீரல் பராமரிப்பு இல் தெலுங்கு , நுரையீரல் பராமரிப்பு இல் தெலுங்கு , கண் பராமரிப்பு இல் தெலுங்கு , தோல் பராமரிப்பு இல் தெலுங்கு , ப்ரெக்நெந்ஸீ பராமரிப்பு இல் தெலுங்கு , ஆரோக்கியம் உதவிக்குறிப்புகள் , உடற்பயிற்சி உதவிக்குறிப்புகள் , குழந்தை பராமரிப்பு , இயற்கை மருந்து , வீடு வைத்தியம் , ஆரோக்கியம் பராமரிப்பு உதவிக்குறிப்புகள் , ஈனது சுகிபாவா , ப்ரெக்நெந்ஸீ பராமரிப்பு , உணவு , பழங்கள் , காய்கறிகள் மேல் கதைகள் , தெலுங்கு மேல் கதைகள் ,

© 2025 Vimarsana