భోజనం చేసిన వెంటనే బ్రష్ చేస్తున్నారా? భోజనం చేశాక బ్రష్‌తో పళ్లు తోముకోవటం ఎంతైనా అవసరం. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే రొట్టెలు, అన్నం వంటివి నోట్లో బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. ఇది పళ్లకు రక్షణగా నిలిచే తెల్లటి పొరను (ఎనామిల్) దెబ్బతీస్తుంది. బ్రష్‌తో తోముకుంటే ఈ బ్యాక్టీరియా పెరగకుండా నివారించుకోవచ్చు. అయితే కొన్నిసార్లు భోజనం చేసిన వెంటనే తోముకోవటమూ మంచిది కాకపోవచ్చు. ముఖ్యంగా పుల్లటి పదార్థాలు తిన్నాక 30 నిమిషాల తర్వాతే తోముకోవటం మేలు. పుల్లటి పదార్థాల్లోని ఆమ్లం ఎనామిల్ పొరను బలహీన పరుస్తుంది. అందువల్ల వీటిని తిన్న వెంటనే పళ్లు తోముకుంటే ఎనామిల్ దెబ్బతినే ప్రమాదముంది. ఒకసారి ఎనామిల్ పోతే అంతే. తిరిగి పెరగదు. పుల్లటి పదార్థాలు తినటానికి ముందే పళ్లు తోముకొని, తర్వాత నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి. దీంతో పళ్ల మీద ఆమ్లం ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. Tags :