మధుమేహుల

మధుమేహులు పుచ్చకాయ తినొచ్చా?


మధుమేహులు పుచ్చకాయ తినొచ్చా?
సమస్య-సలహా
సమస్య: నా వయసు 50 సంవత్సరాలు. మధుమేహంతో బాధపడుతున్నాను. ఎండకాలంలో పుచ్చకాయలు ఎక్కువగా వస్తుంటాయి కదా. మధుమేహం గలవారు వీటిని తినొచ్చా? 
- రమేశ్‌, హైదరాబాద్‌
సలహా: పుచ్చకాయ చాలా తీయగా ఉండటం వల్ల మధుమేహుల్లో చాలామందికి ఇలాంటి సందేహమే వస్తుంటుంది. అయితే దీని విషయంలో మరీ భయపడాల్సిన పనేమీ లేదు. ఆయా పదార్థాల్లోని గ్లూకోజు రక్తంలో ఎంత వేగంగా కలుస్తోందనేదాన్ని ఒక సంఖ్యతో సూచిస్తారు. దీన్ని గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ (జీఐ) అంటారు. ఇది అధికంగా ఉండే పదార్థాల విషయంలో మధుమేహులు జాగ్రత్తగా ఉండటం మంచిదే. పుచ్చకాయ జీఐ 72. నిజానికిది దాదాపు కూల్‌డ్రింకుతో సమానమే అయినప్పటికీ పుచ్చకాయలో పిండి పదార్థం చాలా తక్కువ. సుమారు 100 గ్రాముల పుచ్చకాయ ముక్కల్లో ఉండే పిండి పదార్థం 7 గ్రాములే. అంటే 100 గ్రాములు తిన్నా కూడా ఒక బ్రెడ్డు ముక్కతో సమానం కాదన్నమాట. పైగా ఇందులో నీటి శాతం ఎక్కువ. అందువల్ల పుచ్చకాయను తిన్నప్పుడు వెంటనే గ్లూకోజు పెరుగుతుండొచ్చు గానీ మరీ ఎక్కువసేపు అలాగే ఉండదు. త్వరగానే తగ్గుతుంది. అంటే తాత్కాలికంగానే గ్లూకోజు స్థాయులు పెరుగుతాయన్నమాట. పుచ్చకాయలో ఒక్క పిండి పదార్థమే కాదు.. విటమిన్‌ ఎ, విటమిన్‌ బి1, బి6, విటమిన్‌ సి, పొటాషియం, మెగ్నీషియం, పీచు, ఐరన్‌, క్యాల్షియం, లైకోపేన్‌ వంటి పోషకాలూ ఉంటాయి. విటమిన్‌ ఎ గుండె, కిడ్నీలు, కళ్లు, ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. విటమిన్‌ సి శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందిస్తూ జబ్బులు, ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుతుంది. పుచ్చకాయ గుజ్జుకు ఎర్రటి రంగునిచ్చే లైకోపేన్‌ సైతం యాంటీఆక్సిడెంటే. ఇక దీనిలోని పీచు జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఎక్కువసేపు కడుపునిండిన భావన కలిగిస్తుంది. మెగ్నీషియం, పొటాషియం రక్త ప్రసరణ మెరుగుపడేలా, కిడ్నీలు సరిగా పనిచేసేలా చేస్తాయి. అంతేకాదు, దీనిలోని సిట్రులిన్‌ అనే అమైనో ఆమ్లం రక్తపోటు తగ్గటానికి, జీవక్రియలు చురుగా సాగటానికి తోడ్పడుతుంది. ఇవన్నీ మధుమేహులకు మేలు చేసేవే. ఒక్క గ్లూకోజు భయంతో పుచ్చకాయ తినటం మానేస్తే ఇలాంటి ప్రయోజనాలన్నీ కోల్పోయినట్టే అవుతుంది.
Tags :

Related Keywords

, మధ మ హ ల , ప చ చక య , త న చ , Eenadu , Sukhibava , Article , General , 30801 , 121049550 , Diabetes , Watermelon , Glucose , Blood Sugar , Anti Accident , Lycopene , Health Tips In Telugu , Fitness Tips In Telugu , Child Care Tips In Telugu , Nutrition Tips Telugu , Heart Care In Telugu , Liver Care In Telugu , Pulmonary Care In Telugu , Eye Care In Telugu , Skin Care In Telugu , Pregnancy Care In Telugu , Health Tips , Fitness Tips , Child Care , Natural Medicine , Home Remedies , Health Care Tips , Eenadu Sukhibava , Pregnancy Care , Food , Fruits , Vegetables Top Stories , Telugu Top Stories , ஈனது , சுகிபாவா , கட்டுரை , ஜநரல் , நீரிழிவு நோய் , தர்பூசணி , இரத்தம் சர்க்கரை , எதிர்ப்பு எதிர்பாராத நிகழ்ச்சி , ஆரோக்கியம் உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , உடற்பயிற்சி உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , குழந்தை பராமரிப்பு உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு , ஊட்டச்சத்து உதவிக்குறிப்புகள் தெலுங்கு , இதயம் பராமரிப்பு இல் தெலுங்கு , கல்லீரல் பராமரிப்பு இல் தெலுங்கு , நுரையீரல் பராமரிப்பு இல் தெலுங்கு , கண் பராமரிப்பு இல் தெலுங்கு , தோல் பராமரிப்பு இல் தெலுங்கு , ப்ரெக்நெந்ஸீ பராமரிப்பு இல் தெலுங்கு , ஆரோக்கியம் உதவிக்குறிப்புகள் , உடற்பயிற்சி உதவிக்குறிப்புகள் , குழந்தை பராமரிப்பு , இயற்கை மருந்து , வீடு வைத்தியம் , ஆரோக்கியம் பராமரிப்பு உதவிக்குறிப்புகள் , ஈனது சுகிபாவா , ப்ரெக்நெந்ஸீ பராமரிப்பு , உணவு , பழங்கள் , காய்கறிகள் மேல் கதைகள் , தெலுங்கு மேல் கதைகள் ,

© 2025 Vimarsana