ఈ మార్పు స&#

ఈ మార్పు సహజంగానే జరిగిందా?


ఈ మార్పు సహజంగానే జరిగిందా?
దేశరాజకీయాల్లో బలమైన ప్రతిపక్షం లేకపోవడం, తనను ఎదుర్కోగల ఒక శక్తిమంతమైన నేత కానీ, పార్టీ కానీ కనపడకపోవడం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని కూడా అనుకూలంగా మలుచుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అత్యంత బలహీనంగా ఉన్న ప్రతిపక్షాల విమర్శలను బట్టి తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఆయనకు ఎంత మాత్రమూ లేదు. అయితే తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే సౌలభ్యం కూడా మోదీకి లేదు. ప్రతిపక్షాలు లేవు కదా అని తమను విమర్శించే వారిని అణిచి వేయడం, వారిని దేశ వ్యతిరేకులుగా చిత్రించడం ఎల్లవేళలా సాధ్యం కాదు. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షాలు ఉన్నా, లేకపోయినా తమ అభిప్రాయాలను బలంగా చెప్పగల అవకాశాలు, వేదికలు ప్రజలకు, విమర్శకులకు లభ్యమవుతున్నాయి. అంతకంటే ముఖ్యంగా మొత్తం ప్రపంచం భారత దేశంలో ప్రతి కదలికనూ గమనిస్తోంది. నా దేశంలో ప్రజల పట్ల నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానని చెప్పుకోవడానికి ఆస్కారం లేదు. ప్రపంచ దేశాలతో ఆర్థిక, దౌత్యపరమైన, రక్షణ పరమైన సంబంధాలు నెలకొల్పాలనుకునేవారు ఆయా దేశాలు కూడా మన దేశంలో జరుగుతున్న పరిణామాలను ప్రశ్నిస్తాయని ఎప్పటికైనా గ్రహించక తప్పదు.
బహుశా అందుకే మోదీ తనకు ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు తప్పనిసరై చర్యల్ని ప్రారంభించారని అర్థం చేసుకోవచ్చు. కరోనా రెండో ప్రభంజనం మూలంగా తలెత్తిన తీవ్రవిమర్శలు, దాని రాజకీయ పర్యవసానాలు మాత్రమే కాదు, అంతర్జాతీయంగా తలెత్తిన పరిణామాలు కూడా ఆయన వైఖరికి కారణం అయి ఉంటాయి. ఈ దేశంలో న్యాయవ్యవస్థ ఉన్నట్లుండి గతంలో ఎన్నడూ లేనంతగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు కనపడడం కూడా యాదృచ్ఛికంగా జరిగిన పరిణామం కాదు. వాక్సిన్ విధానాన్ని ప్రశ్నించడం, జర్నలిస్టు వినోద్ దువాపై కేసును కొట్టివేయడంతో పాటు కొందరు మానవహక్కుల కార్యకర్తల్ని విడుదల చేసే విషయంలో కోర్టులు రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రస్తావించి తీవ్రంగా వ్యాఖ్యానించడం, అనేక సందర్భాల్లో ప్రభుత్వం బోనులో నిలబడాల్సి రావడం గత కొద్ది రోజుల్లోనే కనపడుతున్న ఆరోగ్యకరమైన పరిణామాలు. ఎమర్జెన్సీ చీకటి దినాలను గుర్తు చేసుకుంటూ భారత దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు, రాజ్యాంగంలో చెప్పిన విలువలను పరిరక్షించేందుకు సాధ్యమైనంత కృషి చేద్దామని ఇటీవల పిలుపు నిచ్చిన మోదీకి న్యాయస్థానాలు రాజ్యాంగ ఉల్లంఘన గురించి గుర్తు చేశాయంటే ఏమనుకోవాలి? న్యాయస్థానాలు కూడా బయటి ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను గమనించకపోతే తమ అస్తిత్వాన్ని తాము నిలబెట్టుకునే ప్రయత్నం చేయవు. 
జమ్ము, కశ్మీర్‌పై వివిధ రాజకీయ పార్టీలతో గత వారం చర్చలు నిర్వహించడం కూడా ఈ మారిన పరిణామంలో భాగం గానే జరిగిందనిపిస్తోంది. 2019లో జమ్మ–కశ్మీర్‌లో అసెంబ్లీని రద్దు చేశారు. ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని కూడా రద్దు చేశారు. ఆ సరిహద్దు రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఇందుకు నిరసన తెలిపిన అనేకమంది ప్రతిపక్ష నేతలను సుదీర్ఘకాలంపాటు నిర్బంధించారు. ఇంత జరిగిన తర్వాత, ఆ రాష్ట్రంలో సమీప భవిష్యత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని ఎవరూ భావించలేదు. కనీసం ఇంటర్నెట్ పునరుద్ధరించడానికి కూడా ప్రభుత్వం గత ఏడాది అంతగా ఇష్టపడలేదు. మరి ఇప్పుడు ఆ వైఖరి ఎందుకు మారింది? కొద్ది రోజుల క్రితం గుప్కార్ ముఠాగా హోంమంత్రి అమిత్ షా, దోపిడీ ముఠాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అభివర్ణించిన శక్తులనే చర్చకు ఎందుకు ఆహ్వానించాల్సి వచ్చింది? ‘కశ్మీర్ విషయంలో నేను ఎవరితో చర్చించేందుకు సిద్ధంగా లేను’ అని గత ఏడాది ప్రకటించిన నరేంద్రమోదీ ఈ సమావేశంలో అందరితో నవ్వుతూ, స్నేహపూర్వకంగా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమిటి? ‘ఈ సమావేశానికి ఎజెండా ఏమిట’ని ఒక కశ్మీరీ నాయకుడు అడిగినప్పుడు ‘మనం మనసువిప్పి స్వేచ్ఛగా ఏ విషయమైనా మాట్లాడుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాము’ అని మోదీ అంటారని ఎవరు ఊహించగలరు?
ఈ మార్పుకు అనేక కారణాలు ఉండవచ్చు. ప్రజాస్వామిక విలువలకు, స్వేచ్ఛా సమాజాలకు కట్టుబడి ఉండాలని తీర్మానం చేసిన జీ–7 నేతల సమావేశంలో పాల్గొన్న మోదీ ప్రపంచ దేశాలకు భారత్ పట్ల ఏర్పడుతున్న అభిప్రాయాలను అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాదు. భారత దేశంలో కొన్ని పరిణామాలు ప్రజాస్వామిక విలువలకు అనుగుణంగా లేవన్న వ్యాఖ్యలు అమెరికాలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ దేశ విదేశాంగ శాఖే చేసింది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉన్న భారత దేశంతో తాము వ్యూహాత్మక సంబంధాలు ఏర్పర్చుకోవాలనుకుంటున్నామని, అయితే భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు ప

Related Keywords

China , Australia , Ajit , Rajasthan , India , Japan , United States , Texas , Americans , American , Amit Shah , Jammu Pak , Narendra Modi , United States The Supreme Court , United States Army , International View , Foreign The Department , American Congress , Prime Minister Narendra Modi , World India , Human Rights , Home Amit Shah , Advisor Ajit , India Country , Department Minister , India Image , Foreign Minister Shankar , Modi United States , Texas American , Supreme Court , Vajpayee United States , Foreign Code , Black India , Margaret Delhi , சீனா , ஆஸ்திரேலியா , அஜித் , ராஜஸ்தான் , இந்தியா , ஜப்பான் , ஒன்றுபட்டது மாநிலங்களில் , டெக்சாஸ் , அமெரிக்கர்கள் , அமெரிக்கன் , அமித் ஷா , நரேந்திர மோடி , ஒன்றுபட்டது மாநிலங்களில் தி உச்ச நீதிமன்றம் , ஒன்றுபட்டது மாநிலங்களில் இராணுவம் , சர்வதேச பார்வை , அமெரிக்கன் காங்கிரஸ் , ப்ரைம் அமைச்சர் நரேந்திர மோடி , உலகம் இந்தியா , மனிதன் உரிமைகள் , வீடு அமித் ஷா , இந்தியா நாடு , துறை அமைச்சர் , இந்தியா படம் , டெக்சாஸ் அமெரிக்கன் , உச்ச நீதிமன்றம் , வெளிநாட்டு குறியீடு ,

© 2025 Vimarsana