Stay updated with breaking news from Health care tips. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
పండంటి కిడ్నీకి 12 సూత్రాలు! ఎల్లుండి వరల్డ్ కిడ్నీ డే ఒంటికి చీపుర్లు మూత్రపిండాలే! ఇవి ఎప్పటికప్పుడు రక్తాన్ని వడపోసి, వ్యర్థాలను వేరుచేసి, వాటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తేనే మన శరీరం ఆరోగ్యంతో కళకళలాడుతుంది. లేకపోతే చెత్త కుప్పలా తయారవుతుంది. అందుకే ఎక్కడైనా ఎవరైనా కిడ్నీల ఆరోగ్యం మీద దృష్టి సారించాలని, ఒకవేళ కిడ్నీ జబ్బు మొదలైనా తగు జాగ్రత్తలతో హాయిగా జీవ ....
మధుమేహులు పుచ్చకాయ తినొచ్చా? సమస్య-సలహా సమస్య: నా వయసు 50 సంవత్సరాలు. మధుమేహంతో బాధపడుతున్నాను. ఎండకాలంలో పుచ్చకాయలు ఎక్కువగా వస్తుంటాయి కదా. మధుమేహం గలవారు వీటిని తినొచ్చా? - రమేశ్, హైదరాబాద్ సలహా: పుచ్చకాయ చాలా తీయగా ఉండటం వల్ల మధుమేహుల్లో చాలామందికి ఇలాంటి సందేహమే వస్తుంటుంది. అయితే దీని విషయంలో మరీ భయపడాల్సిన పనేమీ లేదు. ఆయా పదార్థాల్లోని గ్లూకోజు రక్తంలో ఎ ....
భోజనం చేసిన వెంటనే బ్రష్ చేస్తున్నారా? భోజనం చేశాక బ్రష్‌తో పళ్లు తోముకోవటం ఎంతైనా అవసరం. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే రొట్టెలు, అన్నం వంటివి నోట్లో బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. ఇది పళ్లకు రక్షణగా నిలిచే తెల్లటి పొరను (ఎనామిల్) దెబ్బతీస్తుంది. బ్రష్‌తో తోముకుంటే ఈ బ్యాక్టీరియా పెరగకుండా నివారించుకోవచ్చు. అయితే కొన్నిసార్లు భోజనం చేసిన వెంటనే తోముకోవటమూ మంచ ....
‘డీ’లా పడిపోవద్దు! విటమిన్ డి తీరే వేరు. అవటానికిది విటమినే అయినా హార్మోన్ మాదిరిగా పనిచేస్తుంది. చర్మానికి ఎండ తగిలినపుడు కొలెస్ట్రాల్ నుంచి దీన్ని మన శరీరమే తయారుచేసుకుంటుంది. కొవ్వుతో కూడిన చేపల వంటి వాటిల్లోనూ విటమిన్ డి ఉన్నప్పటికీ ఆహారం ద్వారా దీన్ని తగినంత తీసుకోవటం చాలా కష్టం. శరీరంలోని పలు వ్యవస్థలపై గణనీయమైన ప్రభావం చూపే విటమిన్ డి లోపంతో ఎంతోమంద ....
వ్యాయామం ఆహారం! ఎంత వ్యాయామానికి అంత బలం! అందుకే వాటిపై అంత ఆసక్తి. వ్యాయామాలతో కండరాలు బలోపేతమవుతాయి. అందం, ఆకర్షణ ఇనుమడిస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బుల ముప్పులు తగ్గుతాయి. నియంత్రణలోనూ ఉంటాయి. కాబట్టే నిపుణుల శిక్షణలో చేసే వ్యాయామాలకు రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ఎంతోమంది జిమ్‌లలో కఠినమైన కసరత్తులు చేస్తూ కండరాలకు పరీక్ష పెడుతున్నారు. కానీ తిండి విష ....